Dimensity P1 Ultra లో 8-కోర్ CPU ఉండగా, ఇది 175K DMIPS వరకు కంప్యూటింగ్ శక్తిని అందిస్తుంది. గ్రాఫిక్స్ కోసం ప్రత్యేకంగా హార్డ్వేర్ స్థాయి రే-ట్రేసింగ్ GPU ను MediaTek ఉపయోగించింది, ఇది 1800 GFLOPS వరకు పనితీరు అందిస్తుంది. AI పరంగా చూస్తే, ఈ చిప్‌లో ఉండే డెడికేటెడ్ NPU 23 TOPS సామర్థ్యంతో పని చేస్తుంది.
Photo Credit: MediaTek
దీంతో వాయిస్ అసిస్టెంట్లు, మల్టీమోడల్ ఇంటరాక్షన్స్, Stable Diffusion లాంటి ఆన్-డివైస్ ఇమేజ్ జనరేషన్, అలాగే AI ఆధారిత భద్రతా మానిటరింగ్ వంటి ఫీచర్లు క్లౌడ్‌పై ఆధారపడకుండా కార్‌లోనే నేరుగా పనిచేయగలవు.
MediaTek తన కొత్త ఆటోమోటివ్ కాక్‌పిట్ ప్రాసెసర్ Dimensity Cockpit P1 Ultra ను అధికారికంగా విడుదల చేసింది. అత్యాధునిక 4nm తయారీ ప్రక్రియపై రూపొందించిన ఈ చిప్, కార్లలో అత్యుత్తమ పనితీరు, బలమైన AI సామర్థ్యాలు, అలాగే మెరుగైన ఇన్-కార్ ఎంటర్టైన్మెంట్ అనుభవాన్ని అందించడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఈ ప్రాసెసర్‌ను ఉపయోగించే తొలి కార్ మోడళ్లు త్వరలోనే మార్కెట్‌లోకి రానున్నాయని కంపెనీ తెలిపింది.Dimensity P1 Ultra లో 8-కోర్ CPU ఉండగా, ఇది 175K DMIPS వరకు కంప్యూటింగ్ శక్తిని అందిస్తుంది. గ్రాఫిక్స్ కోసం ప్రత్యేకంగా హార్డ్వేర్ స్థాయి రే-ట్రేసింగ్ GPU ను MediaTek ఉపయోగించింది, ఇది 1800 GFLOPS వరకు పనితీరు అందిస్తుంది. AI పరంగా చూస్తే, ఈ చిప్‌లో ఉండే డెడికేటెడ్ NPU 23 TOPS సామర్థ్యంతో పని చేస్తుంది. Armv9 ఆర్కిటెక్చర్ మరియు ఇంటిగ్రేటెడ్ AI యూనిట్స్ వల్ల కార్‌లోనే 7 బిలియన్ పరామీటర్ల పెద్ద లాంగ్వేజ్ మోడల్స్ ను రన్ చేయగల సామర్థ్యం ఈ చిప్‌కు ఉంది.
దీంతో వాయిస్ అసిస్టెంట్లు, మల్టీమోడల్ ఇంటరాక్షన్స్, Stable Diffusion లాంటి ఆన్-డివైస్ ఇమేజ్ జనరేషన్, అలాగే AI ఆధారిత భద్రతా మానిటరింగ్ వంటి ఫీచర్లు క్లౌడ్‌పై ఆధారపడకుండా కార్‌లోనే నేరుగా పనిచేయగలవు.
ఆటోమేకర్స్‌కు డెవలప్‌మెంట్ టైమ్ తగ్గించేందుకు కూడా MediaTek ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. కాబట్టి P1 Ultra లో స్మార్ట్ కాక్‌పిట్, కనెక్టివిటీ మాడ్యూల్స్, T-BOX వంటి భాగాలు ఒకే ప్లాట్‌ఫామ్‌లో ఏకీకృతం చేయబడ్డాయి.
కనెక్టివిటీ విషయానికి వస్తే, ఇది 5G, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, Bluetooth, GNSS సపోర్ట్‌లతో పాటు బిల్ట్-ఇన్ మోడం సైతం కలిగి ఉంటుంది. కెమెరాల కోసం ఉన్న HDR ISP, AI Noise Reduction, AI 3A వంటి ఫీచర్లు 360-డిగ్రీ surround view, డ్రైవింగ్ రికార్డర్స్, క్యాబిన్ మానిటరింగ్ వంటి సిస్టమ్‌లను మరింత మెరుగుపరుస్తాయి.
ఎంటర్టైన్మెంట్ సెక్షన్‌లో ఒకేసారి ఆరు డిస్‌ప్లేలను సపోర్ట్ చేయడం ఈ చిప్ ప్రధాన బలాంశం. MiraVision టెక్నాలజీ వల్ల 4K 60fps వీడియో ప్లేబ్యాక్ మరియు రికార్డింగ్ సులభంగా నిర్వహించగలదు. డ్రైవర్, ముందు ప్రయాణికులు, వెనుక సీటు ప్రయాణికులందరికీ విడివిడిగా స్క్రీన్ అనుభవాన్ని ఒక్క చిప్‌తోనే అందించవచ్చు.
MediaTek తెలిపిన వివరాల ప్రకారం, Dimensity Cockpit P1 Ultra మూడు వేర్వేరు వెర్షన్లలో రానుంది... 5G, 4G మరియు Wi-Fi మోడళ్లు. ఇవన్నీ 8-కోర్ CPU, 6-కోర్ GPU తో వస్తాయి. ఈ కొత్త చిప్‌తో రాబోయే వాహనాలు మరింత స్మార్ట్, వేగవంతమైన, AI ఆధారిత ఫీచర్లతో నిండిన ఆధునిక డ్రైవింగ్ అనుభవాన్ని అందించనున్నాయి.
ప్రకటన
ప్రకటన
Huawei Mate 80, Mate 80 Pro, Mate 80 Pro Max and Mate 80 RS Master Edition Launched: Price, Specifications