OnePlus Ace 3Vకి కొన‌సాగింపుగా OnePlus Ace 5V రాబోతుందా.. కీల‌క స్పెసిఫికేష‌న్స్‌ లీక్..

కంపెనీ ఇంకా OnePlus Ace 5V మోనికర్‌ను అధికారికంగా ధృవీక‌రించ‌న‌ప్ప‌టికీ, ఒక టిప్‌స్టర్ ద్వారా ఫోన్‌కు సంబంధించిన‌ కీలక స్పెసిఫికేషన్‌లు బ‌హిర్గ‌తం అయ్యాయి

OnePlus Ace 3Vకి కొన‌సాగింపుగా OnePlus Ace 5V రాబోతుందా.. కీల‌క స్పెసిఫికేష‌న్స్‌ లీక్..

Photo Credit: OnePlus

OnePlus Ace 5V వన్‌ప్లస్ ఏస్ 3V విజయవంతం అవుతుందని భావిస్తున్నారు (చిత్రం)

ముఖ్యాంశాలు
  • OnePlus Ace 5V స్లిమ్ బెజెల్స్‌తో 1.5K ఫ్లాట్ డిస్‌ప్లేతో రావ‌చ్చ‌ని అంచ‌
  • MediaTek డైమెన్సిటీ 9350ని డైమెన్సిటీ 9300++ అని పిలుస్తారు
  • Ace 5Vను ఇత‌ర గ్లోబ‌ల్ మార్కెట్‌ల‌లో OnePlus Nord 5గా లాంచ్ చేసే అవ‌కాశం
ప్రకటన

గ‌త ఏడాది మార్చిలో చైనాలో విడుద‌ల చేసిన‌ OnePlus Ace 3Vకి కొన‌సాగింపుగా OnePlus Ace 5V అందుబాటులోకి రానున్న‌ట్లు తెలుస్తోంది. కంపెనీ ఇంకా మోనికర్‌ను అధికారికంగా ధృవీక‌రించ‌న‌ప్ప‌టికీ ఈ హ్యాండ్‌సెట్ గురించిన ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు ప్ర‌చారంలోకి వ‌స్తున్నాయి. ఒక టిప్‌స్టర్ ద్వారా ఈ త‌ర‌హాలో ఫోన్‌కు సంబంధించిన‌ కీలక స్పెసిఫికేషన్‌లు బ‌హిర్గ‌తం అయ్యాయి. ముఖ్యంగా, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్‌తో OnePlus Ace 5 Pro, OnePlus Ace 5 ఫోన్‌లు గత నెలలో చైనాలో విడుద‌ల చేసిన అంశంపై చ‌ర్చ న‌డుస్తోంది.

MediaTek డైమెన్సిటీ 9350 ప్రాసెస‌ర్‌

టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Weibo పోస్ట్ ప్రకారం OnePlus Ace 5V మోడ‌ల్‌లో MediaTek డైమెన్సిటీ 9350 ప్రాసెస‌ర్‌ను అందించ‌వ‌చ్చు. అలాగే, MediaTek ప్రాసెస‌ర్‌ను డైమెన్సిటీ 9300++ అని పిలిచే అవ‌కాశం ఉంది అని టిప్‌స్టర్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఇది ఇప్పటికే ఉన్న MediaTek డైమెన్సిటీ 9300 ప్రాసెస‌ర్‌పై అప్‌గ్రేడ్‌లతోపాటు పెరిగిన శ‌క్తి సామర్థ్యంతో వస్తుందని అంచ‌నా వేస్తున్నారు. అంతేకాదు, MediaTek డైమెన్సిటీ 9350 లేదా డైమెన్సిటీ 9300++ ప్రాసెస‌ర్‌ క్వాల్‌కామ్ తాజాగా స్నాప్‌డ్రాగన్ 8s ఎలైట్ ప్రాసెస‌ర్‌తో నేరుగా పోటీ ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి.

7000mAh బ్యాట‌రీ సామ‌ర్థ్యం

ఈ లీక్‌ల ఆదారంగా.. OnePlus Ace 5V ఏకరీతి, స్లిమ్ బెజెల్స్‌తో 1.5K ఫ్లాట్ డిస్‌ప్లేతో రానున్న‌ట్లు వెల్ల‌డైంది. అలాగే, ఇది 7000mAh లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీతో వ‌స్తుంద‌ని అంచ‌నా. ఈ అంచ‌నా నిజ‌మైతే, స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెస‌ర్‌, ఫుల్‌-HD+ రిజల్యూషన్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉన్న OnePlus Ace 3V హ్యాండ్‌సెట్‌కు అందించిన‌ 5500mAh బ్యాటరీపై ఈ మోడ‌ల్ పూర్తి స్థాయిలో అప్‌గ్రేడ్ అయిన‌ట్లే భావించ‌వ‌చ్చు. అలాగే, OnePlus Ace 5V గురించిన మరిన్ని వివరాలు రాబోయే మ‌రికొన్ని వారాల్లో ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్న‌ట్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

100W వైర్డు SuperVOOC ఛార్జింగ్‌

OnePlus Ace 3V ఫోన్‌ Android 14-ఆధారిత ColorOS 14తో వ‌చ్చింది. దీని 12GB + 256GB వేరియంట్ ధ‌ర‌ CNY 1,999 (సుమారు రూ. 23,000)గా ఉంది. దీని కెమెరా విష‌యానికి వస్తే.. 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తోపాటు 16-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ను అందించారు. అంతేకాదు, ఇది 100W వైర్డు SuperVOOC ఛార్జింగ్‌కు స‌పోర్ట్ ఇవ్వ‌డంతోపాటు ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది.

OnePlus Nord 5గా

మ‌రీ ముఖ్యంగా, OnePlus Ace 3Vలో కొన్ని మార్పులతో ఇండియాతోపాటు గ్లోబ‌ల్‌ మార్కెట్లలో OnePlus Nord 4 పేరుతో ప‌రిచ‌యం చేసిన విష‌యం తెలిసిందే. ఈ కార‌ణంగా OnePlus నుంచి చైనాలో రాబోతున్న‌ Ace 5Vను ఇత‌ర గ్లోబ‌ల్ మార్కెట్‌ల‌లో OnePlus Nord 5గా లాంచ్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాంటే మాత్రం, కంపెనీ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సిందే.

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. మడతపెట్టే ఐఫోన్ సిద్ధం.. 2026లో యాపిల్ నుంచి ఊహించని సంచలనం.. లీకైన అదిరిపోయే ఫీచర్లు..!
  2. శాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరిచిన 'కోల్డ్ ఫుట్‌ప్రింట్స్'.. బృహస్పతి వాతావరణంలో ఏం జరుగుతోంది?
  3. మీ వాట్సాప్ హ్యాక్ అవ్వకుండా మెటా కొత్త ప్లాన్.. ఇక స్కామర్ల ఆటలు సాగవు..!
  4. కెమెరా ప్రపంచానికి కొత్త రాజు.. 200MP కెమెరాతో షియోమీ 17 ఆల్ట్రా లాంచ్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే..!
  5. కింద పడినా.. నీటిలో మునిగినా భయం లేదు.. వీవో Y51 ప్రో 5G ఎంట్రీ..!
  6. ఐఫోన్ 17 ప్రో వర్సెస్ శామ్‌సంగ్ S26 అల్ట్రా.. కెమెరా వార్‌లో గెలిచింది ఎవరో తెలుసా..?
  7. మార్చి 19న ఇండియాలోకి వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 ప్రో.. టెక్కీల కోసం అదిరిపోయే అప్‌డేట్!
  8. వన్ ప్లస్ 15T.. అదిరిపోయే కలర్స్, ప్రీమియం డిజైన్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్.. పూర్తి వివరాలు ఇవే..!
  9. బడ్జెట్ మార్కెట్ మంటలే.. రియల్‌మీ నుంచి 6,300mAh బ్యాటరీతో సరికొత్త గేమింగ్ ఫోన్..!
  10. స్వదేశీ బ్రాండ్ సంచలనం.. అదిరిపోయే డిజైన్‌తో వస్తున్న 'లావా బోల్డ్ 2 5G'.. ధర ఎంతంటే?
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »