Photo Credit: Jio
ప్రముఖ టెలికాం దిగ్గజం Jio మన దేశీయ మార్కెట్‌లో Jio Phone Prima 2 ఫోన్‌ను విడుదల చేసింది. నవంబర్ 2023లో భారత్‌లో ప్రవేశపెట్టన JioPhone Prima 4G మోడల్‌కు మంచి ఆదరణ లభించడంతో దాని అప్‌గ్రేడ్ వెర్సన్‌గా Jio నుండి వచ్చిన ఫీచర్ ఫోన్‌గా దీనిని లాంచ్ చేసింది. అంతేకాదు, గతంలో విడుదల చేసిన JioPhone Prima హ్యాండ్‌సెట్‌కు కొన్ని ముఖ్యమైన ఫీచర్స్‌ను జోడించింది. తాజా JioPhone Prima 2 హ్యాండ్‌సెట్ Qualcomm ప్రాసెసర్, 2,000mAh బ్యాటరీతో 2.4-అంగుళాల కర్వ్డ్ స్క్రీన్‌తో రూపొందించారు. ఇది వెనుక మరియు ముందు కెమెరాలను కలిగి ఉంటుంది. అతి తక్కువ ధరలో మార్కెట్‌లోకి అడుగుపెట్టిన ఈ ఫీచర్ ఫోన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను చూసేద్దామా?!
దేశీయ మార్కెట్‌లో ఈ ఫోన్ ధర రూ. 2,799గా నిర్ణయించారు. నీలిరంగు షేడ్‌లో ఈ ఫోన్ మన దేశంలో అమెజాన్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. JioPhone Prima 2 ఫోన్ 2.4-అంగుళాల కర్వ్డ్ స్క్రీన్, కీప్యాడ్‌తో వస్తుంది. ఇందులో Qualcomm ప్రాసెసర్ KaiOS 2.5.3పై రన్ అవుతుంది. ఇది మైక్రో SD కార్డ్ ద్వారా 4GB ఆన్‌బోర్డ్ స్టోరేజీతోపాటు మెమరీని 128GB వరకూ పెంచుకునే అవకాశం ఉంటుంది.
UPI చెల్లింపులకు కూడా..
JioPhone Prima 2 హ్యాండ్‌సెట్‌లో కెమెరా విభాగం విషయానికి వస్తే.. ఫ్రంట్ కెమెరా యూనిట్‌తో పాటు వెనుక కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఈ ధరలో ఫ్రంట్ కెమెరాను అందించడం ద్వారా కొనుగోలుదారులను మరింత ఆకట్టుకునే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది అవుట్ వీడియో చాట్ అప్లికేషన్‌ను వినియోగించకుండా నేరుగా వీడియో కాలింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే, LED టార్చ్ యూనిట్‌తో అమర్చబడి ఉంటుంది. అంతేకాదు, Jio నుండి వచ్చిన ఈ తాజా ఫీచర్ ఫోన్ JioPayకి మద్దతు ఇస్తుంది. దీంతో వినియోగదారులు UPI స్కాన్ చేసుకోవడంతోపాటు చెల్లింపులు కూడా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇది వినోదం కోసం JioTV, JioCinema, JioSaavn వంటి యాప్‌లతో అందించబడుతోంది.
FM రేడియోను యాక్సెస్ చేయవచ్చు
ఈ JioPhone Prima 2 ఫోన్ 2,000mAh బ్యాటరీ సమర్థ్యాన్ని కలగి ఉంటుంది. వినియోగదారులు Facebook, YouTube, Google Assistant వంటి కమ్యూనికేషన్ మరియు సోషల్ మీడియా సాధనాలను యాక్సెస్ చేయవచ్చు. ఈ ఫోన్ 23 భాషలకు కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే, ఒకే నానో-సిమ్ ద్వారా 4G కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది. వినియోగదారులు ఫోన్ ద్వారా FM రేడియోను యాక్సెస్ చేయవచ్చు. 3.5mm ఆడియో జాక్‌ను కూడా అందిస్తుంది. లెదర్ ఎండ్‌తో వస్తోన్న ఈ హ్యాండ్‌సెట్ 123.4 x 55.5 x 15.1 mm పరిమాణంతో 120g బరువు ఉంటుంది. తక్కువ ధరలో మంచి ఫీచర్స్ ఉన్న ఫోన్ కావాలనుకునేవారికి ఈ JioPhone Prima 2 మోడల్ సరైన ఎంపికగా చెప్పుకోవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రకటన
ప్రకటన