ముఖ్యంగా, గెలాక్సీ S25 అల్ట్రా వంటి తాజా అల్ట్రా సిరీస్ ఫోన్లలో చూసిన 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను ఫోల్డ్ 7లో కూడా అందించడం పెద్ద చర్చకు దారి తీసింది.
ఈ పరికరం 2026 వేసవిలో విడుదల అవుతుంది.
సామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7ను విడుదల చేసినప్పుడు, అందరి దృష్టిని ఆకర్షించిన రెండు ప్రధాన మార్పులు స్పష్టంగా కనిపించాయి. మొదటిది, పూర్తిగా కొత్తగా రూపొందించిన డిజైన్. రెండోది, కెమెరా విభాగంలో వచ్చిన భారీ అప్‌గ్రేడ్. ముఖ్యంగా, గెలాక్సీ S25 అల్ట్రా వంటి తాజా అల్ట్రా సిరీస్ ఫోన్లలో చూసిన 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను ఫోల్డ్ 7లో కూడా అందించడం పెద్ద చర్చకు దారి తీసింది. అయితే, 2026లో రానున్న గెలాక్సీ Z ఫోల్డ్ 8లో ఎలాంటి మార్పులు చూడబోతున్నాం? ఇప్పటివరకు లభించిన సమాచారం ఆధారంగా కొద్దిగా తెరలేపుదాం. కెమెరాల విషయానికి వస్తే, ‘Q8' అనే కోడ్ నేమ్‌తో అభివృద్ధిలో ఉన్న గెలాక్సీ Z ఫోల్డ్ 8 కొన్ని అంశాల్లో ముందడుగు వేస్తే, మరికొన్ని చోట్ల అదే స్థాయిలో నిలిచేలా కనిపిస్తోంది. ముందుగా పెద్ద ఆశ్చర్యం కలిగించని అంశం గురించి చెప్పుకోవాలి. ఈసారి కూడా ఫోల్డ్ 8లో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరానే ఉండబోతోంది. ఇది ఇప్పటికే ఫోల్డ్ 7లో చూసిన అప్‌గ్రేడ్ కావడంతో, సామ్‌సంగ్ ఇదే దారిని కొనసాగించడం ఆశ్చర్యం కలిగించదు.
కానీ, కొంత ఆశ్చర్యం కలిగించే విషయం ఫ్రంట్ కెమెరాల విషయంలో కనిపిస్తోంది. కవర్ స్క్రీన్‌పై ఒకటి, లోపలి పెద్ద స్క్రీన్‌పై మరొకటి. ఈ రెండు ఫ్రంట్ కెమెరాలు మళ్లీ 10 మెగాపిక్సెల్ సెన్సార్‌తోనే రాబోతున్నట్లు సమాచారం. నిజానికి, గెలాక్సీ S23 సిరీస్ తర్వాత నుంచి సామ్‌సంగ్ తన S సిరీస్ ఫోన్లలో 10 MP ఫ్రంట్ కెమెరాలను ఉపయోగించడం మానేసింది. అలాంటి పరిస్థితిలో, ఫోల్డ్ 8లోనూ అదే పాత సెటప్ కొనసాగించడం కొంత నిరాశ కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు.
అయితే, టెలిఫోటో కెమెరా దగ్గరికి వచ్చేసరికి పరిస్థితి ఆసక్తికరంగా మారుతుంది. ఈ కెమెరా, త్వరలో రానున్న గెలాక్సీ S26 సిరీస్‌లో కనిపించబోయే అప్‌గ్రేడ్‌ను ఫోల్డ్ 8లో కూడా పొందనుంది. ఆప్టికల్ జూమ్ మాత్రం ఇప్పటిలాగే 3x వద్దే కొనసాగినా, సెన్సార్ రిజల్యూషన్‌ను 12 మెగాపిక్సెల్‌కు పెంచనున్నారు. ఇది జూమ్ ఫోటోగ్రఫీని కొంత మెరుగుపరచే అవకాశం ఉంది.
ఇక అల్ట్రా వైడ్ కెమెరా విషయానికి వస్తే, ఇది గెలాక్సీ S25 అల్ట్రాలో ఉపయోగించినదే కావడం విశేషం. అంటే, ఫోల్డ్ 8లో 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉండబోతోంది. దీంతో, ఫోల్డ్ సిరీస్ కెమెరా సెటప్ అల్ట్రా మోడళ్లకు మరింత దగ్గర అవుతుంది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, రాబోయే గెలాక్సీ S26 మరియు S26+ మోడళ్లలో మాత్రం మళ్లీ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరానే ఉండబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ‘H8' అనే కోడ్ నేమ్‌తో అభివృద్ధిలో ఉన్న మరో ఫోల్డ్ మోడల్ కూడా ఇదే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాను పొందనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ H8 మోడల్ నిజంగా ‘ఫోల్డ్ ఫ్యాన్ ఎడిషన్' అవుతుందా? లేక సాధారణ ఫోల్డ్ లైనప్‌లో మరో వేరియంట్‌గా వస్తుందా? అన్నది ఇప్పటికైతే స్పష్టంగా చెప్పలేం. దీనిపై తుది నిర్ణయానికి రావాలంటే మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది.
ఇప్పటివరకు వచ్చిన సమాచారం మొత్తాన్ని చూస్తే, గెలాక్సీ Z ఫోల్డ్ 8పై గాసిప్‌లు ప్రారంభ దశలోనే ఉందని చెప్పాలి. ఎందుకంటే, ఈ ఫోన్ విడుదలకు ఇంకా సమయం ఉంది. సామ్‌సంగ్ దీనిని 2026 జూలైలో విడుదల చేసే అవకాశం ఉంది. అప్పటివరకు ఈ ఫోన్‌కు సంబంధించిన మరెన్నో లీకులు, ఊహాగానాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రకటన
ప్రకటన