Photo Credit: Xiaomi
ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరులో Xiaomi 15, Xiaomi 15 Pro మోడల్స్ లాంచ్ కానున్నాయి. అయితే, ఇందులోనే Ultra మోడల్‌కు సంబంధించి మాత్రం ఎలాంటి అధికారిక సమాచారం లేదు. Xiaomi 13 Ultra, 14 అల్ట్రా మాదిరిగానే Xiaomi 15, Xiaomi 15 ప్రోలను విడుదల చేసిన కొన్ని నెలల తర్వాత.. అంటే, వచ్చే ఏడాది ప్రారంభంలో Xiaomi 15 Ultra అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే, తాజాగా లీకైన రెండర్‌ల ద్వారా Xiaomi 15 Ultra ఫ్లాగ్‌షిప్ ఎలా ఉంటుందో సూచిస్తున్నాయి. అంతేకాదు, ఈ రెండర్‌లు రీడిజైన్ చేయబడిన కెమెరా యూనిట్‌ను కూడా చూపిస్తున్నాయి. మరి.. రెండర్‌లలో ద్వారా Xiaomi 15 Ultra గురించి తెలిసిన విషయాలను తెలుసుకుందామా?!
టిప్‌స్టర్ యోగేష్ బ్రార్, స్మార్ట్‌ప్రిక్స్‌తో కలిసి Xiaomi 15 Ultraను నలుపు, సిల్వర్ లేదా తెలుపు రంగులలో లీకైన ఆకర్షణీయమైన రెండర్‌ల సెట్‌ను పోస్ట్ చేశారు. హ్యాండ్‌సెట్ వెనుక నాలుగు లెన్స్‌లతో రౌండ్ కెమెరా మాడ్యూల్‌తో మునుపటి మోడళ్లకు భిన్నంగా కనిపిస్తోంది. రౌండ్ మాడ్యూల్‌లో లైకా బ్రాండింగ్ పక్కన కెమెరా సెన్సార్ ఉంచబడింది. ఇది మాడ్యూల్ ఎడమ భాగంలో నుంచి కనిపిస్తుంది. మిగిలిన మూడు సెన్సార్లు కింద భాగంలో అమర్చబడి ఉన్నాయి. రెండు ఫ్లాష్ LED లు ఎగువ భాగంలో అమర్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ ఫోటోల్లో Xiaomi లోగో ఫోన్ దిగువన ఎడమవైపు నిలువుగా అమర్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అలాగే, Xiaomi 15 Ultra మోడల్‌లో ఎగువ కుడివైపున ఉంచబడిన కెమెరా 200-మెగాపిక్సెల్ Samsung ISOCELL HP9 1/1.4 పెరిస్కోప్ జూమ్ లెన్స్‌తో 4.3x ఆప్టికల్ జూమ్, f/2.6 అపెర్చర్ అని నివేదిక స్పష్టం చేసింది. ఇది Xiaomi 14 Ultra 50-మెగాపిక్సెల్ కెమెరా నుండి అప్‌గ్రేడ్ చేసినట్లు భావించవచ్చు. ఈ తరహాలోనే 14 Ultra కెమెరా యూనిట్ రూపొందించబడిన విషయం తెలిసిందే.
అలాగే, Xiaomi 15 Ultra ప్రైమరీ కెమెరాగా 50-మెగాపిక్సెల్ సోనీ సెన్సార్‌ను ఉపయోగిస్తుందని తెలుస్తోంది. ఈ ప్రైమరీ కెమెరా 50-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 50-మెగాపిక్సెల్ 2x టెలిఫోటో లెన్స్‌తో కలిసి ఉంటుందని ధృవీకరించారు. దీని ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. గతంలో వచ్చిన రూమర్స్ ప్రకారం చూస్తే.. Xiaomi 15 Ultra 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల 2K LTPO మైక్రో క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. దీనిలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను అందివ్వనున్నట్లు ప్రచారంలో ఉంది. అలాగే, ఆండ్రాయిడ్ 15 ఆధారంగా హైపర్‌ఓఎస్ 2.0పై రన్ అవుతుందని భావిస్తున్నారు. ఇది 90W వైర్డ్, 80W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. మరి ఈ మోడల్‌కు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాలంటే మాత్రం కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.
ప్రకటన
ప్రకటన