Photo Credit: Tecno
ఇండియా మొబైల్ మార్కెట్‌లో గత ఏడాది సెప్టెంబర్‌లో Tecno Pop 9 5G హ్యాండ్‌సెట్ 4GB RAM, 64GB, 128GB స్టోరేజీతో విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా కంపెనీ ఎక్కువ సమర్థ్యంతో కూడిన RAMతో కొత్త వేరియంట్‌ని పరిచయం చేసింది. ఈ కొత్త వేరియంట్ 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తోంది. అలాగే, ఇది 12GB వరకు వర్చువల్ RAMను పెంచుకునే ఫీచర్‌కు సపోర్ట్ చేయనుంది. ఈ ఫోన్ MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌తో రూపొందించబడుతోంది. అలాగే, 48-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అందించారు. గత నవంబర్‌లో మన దేశీయ మార్కెట్‌లో Tecno Pop 9 స్మార్ట్ ఫోన్ 4G వేరియంట్ లాంచ్ అయింది.
భారత్‌లో 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ Tecno Pop 9 5G హ్యాండ్‌సెట్ ధర రూ. 10,999గా ఉంది. ఈ కొత్త వేరియంట్ జనవరి 8వ తేదీ నుంచి అమెజాన్ ద్వారా దేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వచ్చింది. ఈ ధర బ్యాంక్ ఆఫర్‌లను కలిగి ఉంది. బేస్ మోడల్ 4GB + 64GB, 4GB + 128GB వేరియంట్‌ల ధరలు వరుసగా రూ. 9,499, రూ. 9,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ అరోరా క్లౌడ్, అజూర్ స్కై, మిడ్‌నైట్ షాడో కలర్ ఆప్షన్‌లలో లభిస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ బాక్స్‌లో కంపెనీ రెండు కాంప్లిమెంటరీ ఫోన్ స్కిన్‌లను అందిస్తోంది.
6.67-అంగుళాల HD (720 x 1,600 పిక్సెల్‌లు) LCD స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఈ Tecno Pop 9 5G స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వస్తోంది. అలాగే, ఇది 6nm ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో రావడంతోపాటు 8GB RAM, 128GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీతో అటాచ్ చేయబడి ఉంటుంది. ఇందులో RAMని వర్చువల్‌గా 12GB వరకు పెంచుకునే వెసులుబాటు ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతోంది.
Tecno Pop 9 5G ఫోన్ కెమెరా విషయానికి వస్తే.. ఇందులో 48-మెగాపిక్సెల్ Sony IMX582 సెన్సార్‌తో వెనుకవైపు LED ఫ్లాష్ యూనిట్‌ను అందించారు. అలాగే, సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. ఈ హ్యాండ్‌సెట్‌లో డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో పాటు ఇన్‌ఫ్రారెడ్ (ఐఆర్) ట్రాన్స్‌మిటర్‌తో డ్యూయల్ స్పీకర్‌లు కూడా ఉన్నాయి.
ఈ Tecno Pop 9 5G స్మార్ట్ ఫోన్ 18W వైర్డు ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీకి సపోర్ట్ చేస్తుంది. అలాగే, ఇది NFCకి సపోర్ట్ ఇస్తోంది. దుమ్ము, స్ప్లాష్ నియంత్రణ కోసం IP54 రేటింగ్‌ను కలిగి ఉంటుంది. హ్యాండ్‌సెట్ 165 x 77 x 8 మిమీ పరిమాణంతో 189 గ్రాముల బరువు ఉంటుంది. మార్కెట్ వర్గాలు ఈ ధరల్లో ఉన్న ఇతర కంపెనీల ఫోన్‌లకు Tecno Pop 9 5G మంచి పోటీ ఇస్తుందని భావిస్తున్నాయి.
ces_story_below_text
ప్రకటన
ప్రకటన