OnePlus Ace 5 లాంచ్ టైమ్‌లైన్ ఇదే.. 6.78-అంగుళాల డిస్‌ప్లేతోపాటు మరెన్నో ఫీచర్స్..
గత కొంతకాలంగా OnePlus Ace 5, OnePlus Ace 5 Pro హ్యాండ్‌సెట్‌ల గురించిన పలు రూమర్లు ఆన్‌లైన్‌లో చక్కర్లుకొడుతున్నాయి. కానీ, ఈ లైనప్‌పై అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదలకాలేదు. అయితే, తాజాగా vanilla మోడల్ చైనాలో వచ్చే నెల లాంచ్ అవుతుందనే వార్త వైరల్‌గా మారింది. OnePlus Ace 5 స్మార్ట్ ఫోన్ 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందనే లీక్ బహిర్గతమైంది. ఇది Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ చిప్‌సెట్‌లో రన్ అవుతందని చెబుతున్నారు. అలాగే, చైనా వెలుపలి మార్కెట్‌లోకి OnePlus 13R మోనికర్‌తో OnePlus Ace 5 స్మార్ట్ ఫోన్ వస్తుందని భావిస్తున్నారు.