Realme P3 5Gతో పాటు MediaTek Dimensity 8350 Ultra ప్రాసెస‌ర్‌తో P3 Ultra 5G భార‌త్‌లో లాంఛ్‌

Realme P3 5G, Realme P3 Ultra 5G రెండు ఫోన్‌లు 6,000mAh బ్యాటరీలతో వ‌స్తాయి. ఇందులో అల్ట్రా వేరియంట్ 80W AI బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీకి స‌పోర్ట్ చేస్తుంది

Realme P3 5Gతో పాటు MediaTek Dimensity 8350 Ultra ప్రాసెస‌ర్‌తో P3 Ultra 5G భార‌త్‌లో లాంఛ్‌

Photo Credit: Realme

రియల్‌మే పి 3 5 జి ఐపి 69-రేటెడ్ డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ బిల్డ్‌తో వస్తుంది

ముఖ్యాంశాలు
  • Realme P3 5G, P3 Ultra 5G ఫోన్‌లు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను క‌లిగి
  • ఈ హ్యాండ్‌సెట్‌లు ఆండ్రాయిడ్ 15-ఆధారిత Realme UI 6.0తో వస్తాయి
  • బ్యాంక్ ఆఫర్‌లతోపాటు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ కూడా అందించారు
ప్రకటన

ఇండియాలో Realme P3 5G పాటు Realme P3 Ultra 5G ఫోన్ కూడా లాంఛ్ అయ్యింది. ఈ అల్ట్రా మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్ట్రా ప్రాసెస‌ర్‌ ద్వారా శక్తిని గ్ర‌హిస్తుంది. అలాగే, బేస్ వేరియంట్ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెస‌ర్‌తో వస్తుంది. ఈ రెండు ఫోన్‌లు 6,000mAh బ్యాటరీలతో వ‌స్తాయి. ఇందులో అల్ట్రా వేరియంట్ 80W AI బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీకి స‌పోర్ట్ చేస్తుంది. ఇది గ్లో-ఇన్-ది-డార్క్ రియర్ ప్యానెల్‌తో వస్తూ, స్టార్‌లైట్ ఇంక్ ప్రాసెస్‌ను ఉపయోగిస్తుంది. Realme P3 5G IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో, P3 Ultra 5G IP66, IP68, IP69 రేటింగ్‌లతో వ‌స్తుంది.

ధ‌ర‌లు ఇలా

మ‌న దేశంలో Realme P3 Ultra 5G ధర 8GB + 128GB ఫోన్‌ రూ. 26,999 నుండి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ నెప్ట్యూన్ బ్లూ, ఓరియన్ రెడ్ కలర్ ఆప్షన్‌లలో ల‌భిస్తున్నాయి. బేస్ వేరియంట్‌ రూ. 22,999కు కొనుగోలు చేయవచ్చు. రూ. 3,000 వరకు బ్యాంక్ ఆఫర్‌లు, రూ. 1,000 ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ ఉంది. ఇది మార్చి 25న అమ్మకానికి వస్తుంది. ప్రీ-బుకింగ్ మార్చి 19 నుంచే ప్రారంభ‌మ‌య్యింది.

బ్యాంక్ ఆఫ‌ర్‌లు

ఇండియాలో Realme P3 5G ఫోన్ 6GB + 128GB కాన్ఫిగరేషన్ ధ‌ర‌ రూ. 16,999 నుండి ప్రారంభమవుతుంది. కామెట్ గ్రే, నెబ్యులా పింక్, స్పేస్ సిల్వర్ షేడ్స్‌లో అందించబడుతోంది. రూ. 2,000 బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. హ్యాండ్‌సెట్ అమ్మకాలు మార్చి 26నుంచి ప్రారంభమవుతాయి. బేస్ Realme P3 5G, P3 అల్ట్రా 5G హ్యాండ్‌సెట్‌లు ఫ్లిప్‌కార్ట్, Realme ఇండియా ఈ-స్టోర్‌తోపాటు ఇతర రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయొచ్చు.

Realme UI 6.0 స్కిన్‌తో

P3 Ultra 5G ఫోన్‌ 6.83-అంగుళాల 1.5 కె క్వాడ్-కర్వ్డ్ స్క్రీన్‌తో 2,500 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో వ‌స్తోంది. ఇది 12 GB వరకు LPDDR5x RAM, 256 GB వరకు UFS 3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వ‌స్తుంది. ealme P3 5G ఫోన్‌ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 1.500 నిట్స్ టచ్ శాంప్లింగ్ రేట్, ప్రోఎక్స్‌డిఆర్ సపోర్ట్‌తో 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వ‌స్తుంది. ఈ ఫోన్‌లు ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Realme UI 6.0 స్కిన్‌తో వ‌స్తున్నాయి.

కెమెరా విష‌యానికి వ‌స్తే..

P3 Ultra 5Gలో 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్‌తో పాటు OIS సపోర్ట్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ సోనీ IMX896 ప్రైమరీ రియర్ సెన్సార్ ఉంటుంది. బేస్ Realme P3 5Gలో 2-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌తో పాటు 50-మెగాపిక్సెల్ మెయిన్ రియర్ సెన్సార్‌ను అందించారు. ఈ రెండు ఫోన్‌లు 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా క‌లిగి ఉంటాయి. థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం 6,050mm sq ఏరోస్పేస్-గ్రేడ్ VC కూలింగ్ సిస్టమ్‌లతో BGMIలో 90fpsకి స‌పోర్ట్ చేస్తాయి.

Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. మార్కెట్లోకి అతి తక్కువ ధరకే లావా ప్రోబడ్స్ ఎన్ 33.. ఈ ఫీచర్ గురించి తెలుసా?
  2. సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 26 సిరీస్ ఫీచర్స్ లీక్.. కెమెరానే హైలెట్ కానుందా?
  3. ఇదికి తోడుగా OnePlus ప్రకటించిన మరో సొల్యూషన్ OP FPS Max.
  4. ఇందులో రెండు 50 మెగాపిక్సల్ సెన్సర్లు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.
  5. మార్కెట్లోకి రానున్న Realme GT 8 Pro.. అదిరిపోయే ఫీచర్స్ ఇవే
  6. రియల్‌మీ ఈ సిరీస్‌ను తొలిసారిగా అక్టోబర్ 21న చైనాలో ఆవిష్కరించింది
  7. ఐకూ 15 మోడల్ వివరాలు లీక్.. ఈ ప్రత్యేకతలు తెలుసుకున్నారా?
  8. ఈ రెండు ఫోన్లు నవంబర్ 3 నుంచి యూరప్‌లో విక్రయానికి వస్తాయి. Vivo అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు
  9. iQOO Neo 11 ధర చైనాలో CNY 2,599 (దాదాపు రూ. 32,500) నుంచి ప్రారంభమవుతోంది
  10. భారత వినియోగదారులు OnePlus 15 లాంచ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »