50 మెగాపిక్సెల్ డ్యుయల్ కెమెరా, స్నాప్ డ్రాగన్ ఎలైట్ చిప్‌తో ఆకర్షిస్తున్న మోటరోలా ఫ్లిప్ ఫోన్

50 మెగాపిక్సెల్ డ్యుయల్ కెమెరా, స్నాప్ డ్రాగన్ ఎలైట్ చిప్‌తో ఆకర్షిస్తున్న మోటరోలా ఫ్లిప్ ఫోన్

Photo Credit: Motorola

Motorola Razr 60 Ultra యొక్క గ్లోబల్ వేరియంట్ Android 15-ఆధారిత Hello UI పై నడుస్తుంది

ముఖ్యాంశాలు
  • ఈ స్మార్ట్ ఫోన్ అవుటాఫ్‌ది ది బాక్స్‌ ఆండ్రాయిడ్‌ 15తో పని చేస్తుంది
  • 50 మెగాపిక్సెల్ డ్యుయల్ కెమెరా, ప్రపంచంలోనే నెంబర్ వన్ ఏఐ సూట్‌తో రాను
  • 7 అంగుళాల 1.5K pOLED ప్యానల్‌, 165 హెడ్జ్ రీఫ్రెష్‌ రేటు కలిగిన డిస్‌ప్
ప్రకటన

మోటరోలా నుంచి మరో ప్రీమియం ఫొన్ విడుదలకు సిద్ధమైంది. మోటోరోలా రేజర్ 60 అల్ట్రా పేరుతో త్వరలో భారత మార్కెట్‌లోకి లాంఛ్ కానుంది. ఈమేరకు సోషల్ మీడియాలో ఈ స్మార్ట్ ఫోన్ టీజర్‌ను కంపెనీ పోస్ట్ చేసింది. గత నెల ఏప్రిల్ 24న మోటరోలా రేజర్ 60 అల్ట్రా.. ప్రపంచ మార్కెట్‌లో విడుదలైంది. ఇది మోటరోలా 50 అల్ట్రాకు అప్‌గ్రేడ్ వెర్షన్. ఈ గ్యాడ్జెట్ డిజైన్‌ను మడతపెట్టే స్టైల్‌లో రూపొందించారు.ఈ గ్యాడ్జెట్‌ ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో రానంది. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో భారత్‌లో లాంఛ్ కానున్నట్లు కంపెనీ ధృవీకరించింది.భారత్‌లో మోటోరోలా రేజర్ 60 అల్ట్రా లాంఛ్,మోటరోలా తన ఫ్లాగ్‌షిప్ ఫోన్ రేజర్ 60 అల్ట్రాను భారత్‌లో లాంఛ్‌ చేయనున్నట్లు ఆదివారం ఎక్స్‌ వేదికగా వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ మంచి పనితీరు, డిజైన్, ఇన్నోవేషన్ కలయికతో రూపొందినట్లు పేర్కొంది. ఇక ఈ గ్యాడ్జెట్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది.

దీనికోసం అమెజాన్‌లో ఒక ప్రత్యేకమైన మైక్రోసైట్‌ పేజీని ఏర్పాటు చేశారు. ఈ డివైస్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ ఫీచర్లు ఉన్న ఫ్లిప్ ఫోన్‌గా మోటరోలా తెలిపింది.

అద్బుతమైన ఏఐ ఫీచర్లు

ఈ గ్యాడ్జెట్ క్యామ్‌షెల్- స్టైల్(మడతపెట్టె) డిజైన్‌లో రూపొందింది. దీనిలో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. దీనివల్ల అద్భుతమైన పనితీరును కనబర్చనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో మోటరోలా ప్రత్యేకంగా తయారు చేసిన మోటో- ఏఐ సూట్‌ను కలిగి ఉంది. ఇది నెక్స్ట్ మూవ్, ప్లేలిస్ట్ స్టూడియో, ఇమేజ్ స్టూడియో, లుక్ అండ్ టాక్ ఫీచర్లను అందిస్తుంది.

ఆకట్టుకునే రంగుల్లో…

మోటరోలా టీజర్ ప్రకారం.. రేజర్ 60 అల్ట్రా మూడు అద్భుతమైన పాంటోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. అవి పాంటోన్ మౌంటైన్ ట్రైల్, పాంటోన్ రియో రెడ్, పాంటోన్ స్కారాబ్

ఇండియాలో విడుదలయ్యే మోటరోలా రేజర్ 60 అల్ట్రా కూడా తన గ్లోబల్ కౌంటర్ మాదిరిగానే స్పెసిఫికేషన్లు కలిగి ఉంటుందని భావిస్తున్నారు. దీని లాంఛ్ దగ్గరపడే కొద్దీ మరిన్నీ వివరాలు బయటకొచ్చే అవకాశం ఉంది.

మోటరోలా రేజర్ 60 అల్ట్రా స్పెసిఫికేషన్స్

మోటరోలా రేజర్ 60 అల్ట్రా లోపలి వైపు 7 అంగుళాల పొడవుతో 1.5K(1,224 x 2,992 పిక్సెల్స్) pOLED LTPO డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 165 హెడ్జ్ రీఫ్రేష్ రేటుతో 4,000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ కలిగి ఉంది. అలాగే 4 అంగుళాల (1,272 x 1,080 పిక్సెల్స్) పొడవు, 165 హెడ్జ్ రీఫ్రేష్ రేటుతో pOLED LTPO కవర్ డిస్‌ప్లే కూడా ఉంది. ఇది 3,000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ డిస్‌ప్లేకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్‌తో రక్షణ ఉంటుంది. మోటరోలా రేజర్ 60 అల్ట్రాలో శక్తివంతమైన స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇందులో 16GB ర్యామ్, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజీ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా హలో యూఐపై పనిచేస్తుంది.

మెస్మరైజింగ్ కెమెరా ఫీచర్లు

ఇక కెమెరాల విషయానికొస్తే… మోటరోలా రేజర్ 60 అల్ట్రాలో వెనుక వైపు 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా(f/1.8 అపర్చర్) యూనిట్‌ను కలిగి ఉంది. ఇది అఫ్టికల్ స్టెబిలైజేషన్(OIS) ఫీచర్‌ను అందిస్తుంది. దీంతో పాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌ను(f/2.0 అపర్చర్) కలిగి ఉంటుంది. ముందు భాగంలో సెల్ఫీ ఫోటోలు తీసుకునేందుకు 50 మెగాపిక్సెల్ కెమెరా అమర్చారు. దీని ద్వారా నాణ్యమైన సెల్ఫీలు, వీడియో కాల్స్ తీసుకోవచ్చు.

Comments
Facebookలో షేర్‌ Gadgets360 Twitter Shareట్వీట్ షేర్ Snapchat రెడ్డిట్ వ్యాఖ్యానించండి

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Haier C90, C95 OLED టీవీలు ఇండియాలో లాంఛ్‌.. ధ‌ర‌తోపాటు ఫీచ‌ర్స్ ఇవే
  2. ఇండియాలోకి 10,000mAh భారీ బ్యాట‌రీ క‌లిగిన Realme GT Concept ఫోన్‌
  3. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, 6,500mAh బ్యాటరీతో త్వరలో లాంఛ్ కానున్న వివో X200FE
  4. ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెస‌ర్‌తో Realme C75 వ‌చ్చేసింది
  5. 50 మెగాపిక్సెల్ డ్యుయల్ కెమెరా, స్నాప్ డ్రాగన్ ఎలైట్ చిప్‌తో ఆకర్షిస్తున్న మోటరోలా ఫ్లిప్ ఫోన్
  6. స్నాప్‌డ్రాగ‌న్ 7 జెన్ 3 ప్రాసెస‌ర్‌తో హాన‌ర్ 400.. విడుద‌ల‌కు ముందే కీల‌క స్పెసిఫికేష‌న్స్ లీక్‌
  7. చైనాలో మే 8న Motorola ఎడ్జ్ 60s లాంఛ్‌.. కీల‌క విష‌యాలను వెల్ల‌డించిన కంపెనీ
  8. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌ 2025లో రూ.72 వేల వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్
  9. అమెజాన్ గ్రేట్ సమ్మ‌ర్ సేల్ 2025: ప్రీమియం స్మార్ట్ ఫోన్‌ల‌పై బెస్ట్ డీల్స్ ఇవే
  10. అమెజాన్ గ్రేట్ స‌మ్మ‌ర్ సేల్ 2025 వ‌చ్చేసింది.. డిస్కౌంట్ ఆఫ‌ర్‌ల‌ను మిస్ అవ్వొద్దు
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »