ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కామ్ Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్ ను ఉపయోగించారు. దీనికి తోడు 7,300mAh బ్యాటరీ మరియు 120W సూపర్ ఫ్లాష్ ఛార్జ్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
Photo Credit: OnePlus
OnePlus 15 50-మెగాపిక్సెల్ ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం OnePlus అక్టోబర్ 2025 ఈవెంట్‌లో తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ OnePlus 15ను అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ గత ఏడాది విడుదలైన వన్‌ప్లస్ 13 కు కంటిన్యూషన్ మోడల్‌గా వస్తోంది. కొత్త మోడల్‌లో డిజైన్, పనితీరు, కెమెరా, బ్యాటరీ సామర్థ్యాల పరంగా గణనీయమైన అప్‌గ్రేడ్‌లు అందించబడాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కామ్ Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్ ను ఉపయోగించారు. దీనికి తోడు 7,300mAh బ్యాటరీ మరియు 120W Super Flash Charge వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఫోన్ డిజైన్‌లో చతురస్రాకార ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ కనిపిస్తుంది, ఇందులో ప్రధానంగా 50MP ప్రైమరీ సెన్సార్ ఉంటుంది.
OnePlus 15 చైనాలో కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అమ్మకానికి వస్తుంది. 12GB + 256GB వెర్షన్ ధర CNY 3,999 (సుమారు రూ.50,000) గా ఉంది. 16GB + 256GB వెర్షన్ ధర CNY 4,299 (సుమారు రూ. 53,000), 12GB + 512GB వెర్షన్ ధర CNY 4,599 (సుమారు రూ.57,000), 16GB + 512GB వెర్షన్ ధర CNY 4,899 (సుమారు రూ. 61,000), టాప్ వెర్షన్ (16GB + 1TB) ధర CNY 5,399 (సుమారు రూ.67,000) గా ప్రకటించారు. ఈ ఫోన్ అబ్సల్యూట్ బ్లాక్, మిస్టీ పర్పుల్, సాండ్ డ్యూన్ అనే మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. చైనాలో ఈ ఫోన్ అక్టోబర్ 28 నుంచి విక్రయానికి వస్తుంది.
OnePlus 15 చైనాలో Android 16 బేస్డ్ ColorOS 16 పై నడుస్తుంది. ఇది 6.78-అంగుళాల 3rd Gen BOE Flexible AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. స్క్రీన్‌కి 165Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్ (1272x2772 పిక్సెల్స్), 1,800 nits బ్రైట్‌నెస్, మరియు DCI-P3 కలర్ గాముట్ సపోర్ట్ ఉన్నాయి.
పనితీరు పరంగా, ఈ ఫోన్‌లో ఉన్న 3nm Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్ లో 2 పనితీరు కోర్లు, 6 ఎఫిషెన్సీ కోర్లు ఉన్నాయి. గరిష్ఠంగా 4.6GHz క్లాక్ స్పీడ్ అందిస్తుంది. ఫోన్‌లో Adreno 840 GPU, గరిష్ఠంగా 16GB LPDDR5X RAM, మరియు 1TB UFS 4.1 స్టోరేజ్ ఉన్నాయి. ఇక కెమెరా విభాగం చూస్తే ఇందులో మొత్తం మూడు కెమెరాలు ఉన్నాయి. 50MP ప్రైమరీ లెన్స్ (f/1.8, 24mm), 50MP అల్ట్రా వైడ్ లెన్స్ (f/2.0), 50MP టెలిఫోటో లెన్స్ (f/1.8). ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా (f/2.4) ఉంది. రియర్ కెమెరా 8K వీడియో రికార్డింగ్ (30fps) సపోర్ట్ చేస్తుంది.
ఈ ఫోన్‌లో అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, 5G, Wi-Fi 7, NFC, GPS, Beidou, GLONASS, మరియు QZSS వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. సెన్సార్ల పరంగా ప్రాక్సిమిటీ, యాక్సిలరేషన్, జైరోస్కోప్, లేజర్ ఫోకస్, IR బ్లాస్టర్ వంటి అనేక సెన్సార్లు అందించబడ్డాయి. దీని పరిమాణం 161.42 x 76.67 x 8.10mm, బరువు సుమారు 211 గ్రాములు.
మొత్తం చెప్పాలంటే, OnePlus 15 డిజైన్, పనితీరు, కెమెరా, బ్యాటరీ విభాగాల్లో గణనీయమైన మెరుగుదలలతో వస్తూ, ప్రీమియం యూజర్లకు సరిపోయే ఫ్లాగ్‌షిప్ అనిపిస్తుంది.
ప్రకటన
ప్రకటన
Microsoft CEO Satya Nadella Suggests Next-Gen Xbox Will Be Windows PC and Console Hybrid