మోటరోలా ఇండియా తన “X” హ్యాండిల్ ద్వారా ఈ టీజర్ వీడియోను పంచుకుంది. ఇందులో ఫోన్ వెనుక భాగంలో నాలుగు సర్క్యులర్ కటౌట్‌లతో ఉన్న కెమెరా మాడ్యూల్ కనిపించింది.
Photo Credit: Motorola
Moto X70 Air మందం 5.99mm
మోటరోలా భారతీయ వినియోగదారులకు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది. సోమవారం సంస్థ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ద్వారా విడుదల చేసిన టీజర్‌లో కొత్త ఫోన్ వెనుక భాగం డిజైన్‌ను చూపించింది. దీని ద్వారా ఫోన్ త్వరలో భారత మార్కెట్లోకి రాబోతుందనే సంకేతాలు లభించాయి. ఫోన్ పేరు అధికారికంగా వెల్లడించకపోయినా, ఇది చైనాలో ఇప్పటికే లభిస్తున్న Moto X70 Air మోడల్ అయి ఉండొచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఫోన్ డిజైన్ విషయంలో Samsung Galaxy S25 Edge మరియు iPhone Air మోడళ్లను పోలి ఉండే స్లిమ్ ప్రొఫైల్‌ను కలిగి ఉంటుంది. Snapdragon 7 Gen 4 చిప్‌సెట్‌తో వచ్చే ఈ ఫోన్‌లో 4,800mAh సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ఉండగా, 68W వైర్డ్ ఛార్జింగ్ మరియు 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది.
మోటరోలా ఇండియా తన “X” హ్యాండిల్ ద్వారా ఈ టీజర్ వీడియోను పంచుకుంది. ఇందులో ఫోన్ వెనుక భాగంలో నాలుగు సర్క్యులర్ కటౌట్‌లతో ఉన్న కెమెరా మాడ్యూల్ కనిపించింది. వీటిలో కెమెరా సెన్సర్లు మరియు LED ఫ్లాష్ అమర్చబడ్డాయి. టీజర్‌తో పాటు “battery that beats the clock, coming soon” అనే శీర్షికను ఉపయోగించారు.
ఫోన్ పేరు లేదా విడుదల తేదీ గురించి సంస్థ ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం వెల్లడించకపోయినా, చైనాలో ఇప్పటికే లాంచ్ అయిన Moto X70 Air భారత మార్కెట్లో త్వరలో విడుదల కానుందని అంచనా. అంతేకాక, ఈ ఫోన్ Motorola Edge 70 పేరుతో నవంబర్ 5న కొన్ని గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ కానుంది.
రంగు వేరియంట్లు మరియు ధరల విషయంలో Moto X70 Air మరియు Edge 70 మధ్య కొంత తేడా ఉండవచ్చు. కానీ, డిజైన్ మరియు స్పెసిఫికేషన్‌ల పరంగా రెండు ఫోన్లు దాదాపు ఒకేలా ఉండే అవకాశం ఉంది. తక్కువ బరువు, సన్నని డిజైన్ కారణంగా ఇది iPhone Air మరియు Galaxy S25 Edge లకు పోటీగా నిలవనుంది.
చైనాలో 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 2,399 (సుమారు రూ. 30,000), అలాగే 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 2,699 (సుమారు రూ. 33,500). భారత మార్కెట్లో కూడా దీని ధర ఈ పరిధిలోనే ఉండవచ్చని అంచనా. ఈ ఫోన్ Android 16 పై నడుస్తుంది. ఇందులో 6.7-అంగుళాల 1.5K pOLED స్క్రీన్ ఉండగా, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. Snapdragon 7 Gen 4 చిప్‌సెట్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో గరిష్టంగా 12GB RAM మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది.
వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా మరియు 50MP అల్ట్రా వైడ్ లెన్స్ కలిగిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఉంది. అదనంగా, ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్ కలిగి ఉండడం వల్ల నీరు, ధూళి నుండి రక్షణ లభిస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే, ఇది 4,800mAh సామర్థ్యంతో ఉండి, 68W వైర్డ్ ఛార్జింగ్ మరియు 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది. డిజైన్ పరంగా ఈ ఫోన్ మందం 5.99mm మాత్రమే ఉండగా, బరువు కేవలం 159 గ్రాములు మాత్రమే.
ప్రకటన
ప్రకటన