Photo Credit: Redmi
Redmi K80 Pro 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది
గత నవంబర్‌లో Redmi K80 Pro హ్యాండ్‌సెట్ చైనాలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 6000mAh బ్యాటరీతో విడుదలయ్యింది. దీంతో Redmi K90 Pro ఫోన్ గురించి మాట్లాడుకోవడానికి సమయం పట్టొచ్చు. కానీ, ఈ హ్యాండ్‌సెట్ గురించి ముందస్తు లీక్‌లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో కనిపించడం ప్రారంభించాయి. దీంతో రాబోయే Redmi K90 Pro ఫోన్ గురించి తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. త్వరలో రానున్న Redmi K-సిరీస్ ఫోన్ రెండవ తరం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ద్వారా శక్తిని గ్రహిస్తుందని చెబుతున్నారు. దీనికి పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా కూడా అమర్చవచ్చని అంచనా.
టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ సబ్-ఫ్లాగ్‌షిప్ సిరీస్‌కు చెందిన తర్వాతి తరం ప్రో మోడల్ యొక్క కీలక స్పెసిఫికేషన్‌లను వెల్లడిస్తోంది. పోస్ట్‌లో ప్రొడక్ట్ పేరు స్పష్టంగా చేర్చబడనప్పటికీ, ప్రశ్నలు, కామెంట్స్‌ను బట్టీ ఈ హ్యాండ్‌సెట్ Redmi K90 Pro ఫోన్ కావచ్చునని అంచనా వేస్తున్నారు. ఇది పెద్ద ఎపర్చర్‌తో 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అంతే కాదు, 2K రిజల్యూషన్ డిస్‌ప్లేను కూడా కలిగి ఉండొచ్చని చర్చ జరుగుతోంది.
రాబోయే Redmi K90 Pro స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ 2 ప్రాసెసర్‌పై రన్ అవుతుందని అంచనా. అలాగే, ఈ ప్రాసెసర్ 2025 రెండవ భాగంలో ప్రకటించబడుతుందని చర్చ జరుగుతోంది. ఈ Redmi K80 Pro ఫోన్‌కి శక్తినిచ్చే Snapdragon 8 ఎలైట్ కంటే పనితీరు అప్‌గ్రేడ్‌లు ఉంటాయి. Redmi K90 Pro హ్యాండ్‌సెట్ లాంచ్ ఈ సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో జరగవచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
గత సంవత్సరం నవబంర్‌లో Redmi K80 Pro ఫోన్ బేస్ 12GB RAM + 256GB వేరియంట్ CNY 3,699 (సుమారు రూ. 43,000) ప్రారంభ ధరతో మార్కెట్‌లోకి వచ్చింది. ఇది Xiaomi HyperOS 2.0 పై రన్ అవుతోంది. అలాగే, 2K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 3,200 nits గరిష్ట బ్రైట్‌నెస్‌తో 6.67-అంగుళాల (1,440 x 3,200 పిక్సెల్స్) AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. వీటితోపాటు ఇది 16GB వరకు LPDDR5X RAM, 1TB వరకు UFS 4.0 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చింది.
అంతేకాదు, ఈ Redmi K80 Pro హ్యాండ్‌సెట్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 32-మెగాపిక్సెల్ సెన్సార్ ఉన్నాయి. అలాగే, దీనికి 20-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కూడా ఉంది. Redmi K80 Pro ఫోన్ భద్రతలో భాగంగా అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఇది 120W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ప్రకటన
ప్రకటన