Photo Credit: Apple
తాజాగా Apple కంపెనీ తన వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఐఫోన్ కోసం iOS 18.2 Public Beta 1 అప్‌డేట్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. తాజా డెవలపర్‌లకు ముందు.. అంటే గతంలో అందుబాటులో ఉన్న కొత్త Apple ఇంటెలిజెన్స్ ఫీచర్‌లు Genmoji, ఇమేజ్ క్రియేట్ చేసే ప్లేగ్రౌండ్ ఫీచర్ వంటివి ఇందులోనే జోడించింది. ఈ కొత్త అప్‌డేట్‌లో AI ఎమోజీ జనరేటర్ యాప్, సిరితో ChatGPT ఇంటిగ్రేషన్, iPhone 16 కెమెరాలను ఉపయోగించి విజువల్ సర్చ్ లాంటి సరికొత్త ఫీచర్స్‌ను తీసుకువచ్చింది.
ఈ ఏడాది జూన్‌లో Apple కంపెనీ వరల్డ్ వేడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) 2024లో చాలా AI ఫీచర్స్‌ను పరిచయం చేసిన విషయం తెలిసిందే. అయితే, వాటిలో కొన్ని మాత్రమే విడుదల అయ్యాయి. అంతేకాదు, Public Beta 1 వినియోగదారులు సిరిని వారి యాప్‌లలోని సమాచారాన్ని స్ట్రీమ్ చేయమని లేదా స్క్రీన్‌పై కనిపించే వాటిలో మార్పులు చేయమని కమాండ్ చేయవచ్చు. అలాగే, వినియోగదారులు టెక్ట్స్ రాసేందుకు, ప్రశ్నలకు సమాధానమించేందుకు, ఇమేజ్‌లను క్రియేట్ చేసేందుకు ChatGPTని అడగొచ్చు. ఇది ఇమేజ్ ప్లేగ్రౌండ్ ఫీచర్‌లో ప్రాంప్ట్‌లతో కొత్త ఇమేజ్‌లను క్రియేట్ చేసేందుకు అనుమతిస్తుంది. తాజా అప్‌డేట్‌తో ChatGPT యాక్సెస్‌ను వినియోగించేందుకు అకౌంట్ అవసరం లేకుండా ఉచితంగా పొందొచ్చు.
రైటింగ్ టూల్స్ వినియోగదారులు మెయిల్, సందేశాలు, డాక్యుమెంట్స్ వంటివి థర్డ్-పార్టీ యాప్‌లతో సహా వారు రాసే ప్రతిచోటా వాక్యాన్ని తిరిగి రాయడం, సరిదిద్దడం లేదా స్వీకరించడం ద్వారా వారి భాషను మరిత మెరుగుపరచడానికి అవకాశం కల్పిస్తుంది. Apple రూపొందించిన ఇమేజ్‌లు, మెసేజ్‌లు, నోట్, కీనోట్ వంటివి యాప్‌లలో షేర్ చేసుకోవచ్చు. ఆపిల్ ఇంటెలిజెన్స్ ద్వారా నోట్స్ యాప్‌లో రఫ్ స్కెచ్‌లను సంబంధిత ఇమేజీగా మార్చగల ఇమేజ్ వాండ్ ఫీచర్ దీనిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఇందులో iOS 18.2 Public Beta 1 ChatGPTకి అటాచ్ చేయడం వినియోగదారులకు ఆకర్షణీయమైన అంశంగా చెప్పొచ్చు. Apple వాయిస్ అసిస్టెంట్ అయిన Siri నుండి ఫోటోలు, డాక్యుమెంట్స్‌కు సంబంధించిన సందేహాల నివృత్తి చేసుకునేందుకు iPhone వినియోగదారులు OpenAI లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (LLM) సహాయాన్ని సులువుగా పొందొచ్చు. అంతేకాదు, Apple ఇంటెలిజెన్స్ సూట్‌లోని రైటింగ్ టూల్స్‌లో ChatGPT సైతం భాగంగా ఉంటుంది. ఇది పాఠ్య ప్రాంప్ట్‌లను ఆధారంగా చేసుకుని వాక్యాన్ని మరింత అర్థవంతగా మార్చేందుకు సహకరిస్తుంది.
అంతేకాదు, iPhone సిరిలోని ChatGPTని వినియోగించడానికి సైన్-ఇన్ తప్పనిసరి కాదని Apple కంపెనీ స్పష్టం చేసింది. అయితే, ChatGPT అకౌంట్ ఉన్న iPhone వినియోగదారులు ఎటువంటి రోజువారీ పరిమితులు లేకుండా OpenAI మోడల్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే, కెమెరా కంట్రోల్ బటన్ విజువల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ iPhone 16 వినియోగదారుల కోసం ఉంటుంది. ఈ ఫీచర్ Apple Google లెన్స్ సొంత వెర్షన్‌గా చెబుతున్నారు.
ప్రకటన
ప్రకటన