Photo Credit: Realme
Realme P3 Pro Realme P2 Proని విజయవంతం చేస్తుందని భావిస్తున్నారు
భారత్‌లో త్వరలోనే Realme P3 సిరీస్ విడుదల కానుంది. ఈ లైనప్‌లో స్టాండర్డ్ Realme P3, Realme P3 ప్రో ఉంటాయి. ఇప్పటికే కంపెనీ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా రాబోయే కొత్త ఫోన్‌ల రిలీజ్‌ను టీజ్ చేసింది. అంతే కాదు, ఈ హ్యాండ్‌సెట్‌లు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడైంది. ఈ ప్రకటనకు ముందే, ప్రో మోడల్ డిజైన్ గురించిన ఓ కొత్త లీక్ బహిర్గతమైంది. ఫోన్ రెండర్‌లు వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌తో కూడిన డ్యూయల్-కెమెరా సెటప్‌ను చూపుతున్నాయి. గత సంవత్సరం వచ్చిన Realme P2 ప్రో కంటే అప్‌గ్రేడ్‌లతో Realme P3 ప్రో వచ్చే అవకాశం ఉంది.
ముకుల్ శర్మ (@stufflistings) అనే ఓ టిప్‌స్టర్ Xలో Realme P3 Pro రెండర్‌లను షేర్ చేశారు. ఈ రెండర్‌లు ఫోన్‌ను ప్రొటెక్టివ్ కేస్‌తో చూపిస్తున్నాయి. అయితే, అవి వెనుక కెమెరా డిజైన్‌పై స్పష్టత ఇచ్చేలా కనిపిస్తున్నాయి. వృత్తాకార ఆకారపు కెమెరా మాడ్యూల్‌లో అమర్చబడిన LED ఫ్లాష్‌తో పాటు డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్‌కు సెన్సార్‌లు, LED ఫ్లాష్ త్రిభుజాకార డిజైన్‌లో అమర్చబడి ఉన్నాయి.
ఇక్కడి రెండర్‌లను చూసినప్పుడు ఈ హ్యాండ్‌సెట్ నీలిరంగు కలర్ ఆప్షన్‌లో కనిపిస్తోంది. అలాగే, కెమెరా ఐస్‌ల్యాండ్‌లో చెక్కబడిన టెక్స్ట్‌ను పరిశీలిస్తే.. Realme P3 ప్రోలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), ఎఫ్ / 1.8 ఎపర్చరు, 24 ఎంఎం ఫోకల్ లెంగ్త్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ మెయిన్ షూటర్ ఉంటుందని తెలుస్తోంది. ఇటీవలి రోజుల్లోనే Realme అధికారికంగా రాబోయే ఈ Realme P3 సిరీస్‌ను టీజ్ చేయడం ప్రారంభించింది.
ఈ కొత్త మోడల్ ఫ్లిప్‌కార్ట్ లైనప్ కోసం ఒక ప్రత్యేక మైక్రోసైట్‌ను కూడా క్రియేట్ చేసింది. మరీ ముఖ్యంగా, మెరుగైన గేమింగ్ అనుభవం కోసం Realme P3 ప్రో స్మార్ట్ ఫోన్ AI- ఆధారిత జిటి బూస్ట్ గేమింగ్ టెక్నాలజీని కలిగి ఉందని నిర్ధారించబడింది. అంతే కాదు, ఈ ఫీచర్ రాబోయే హ్యాండ్‌సెట్ అమ్మకాలపై అనుకూల ప్రభావాన్ని చూపుతుందని కంపెనీ గట్టి నమ్మకంతో ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవలి లీక్‌లను బట్టీ, RMX5032 మోడల్ నంబర్‌తో Realme P3 ప్రో ఫిబ్రవరి మూడవ వారంలో మనదేశంలో లాంఛ్ అవుతుందని తెలుస్తోంది. ఇది 12GB RAM, 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. గత ఏడాది సెప్టెంబర్‌లో రూ. 21,999 ప్రారంభ ధరతో భారత్‌లో విడుదలైన Realme P2 ప్రో 5Gకి కొనసాగింపుగా ఇది రానున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మరి, మార్కెట్‌లోని ఇతర కంపెనీ హ్యాండ్‌సెట్‌లతో రాబోయే Realme P3 ప్రో ఎంత వరకూ పోటీ పడుతుందో వేచి చూడాలి.
ప్రకటన
ప్రకటన