Photo Credit: iQOO
అమెజాన్ రాబోయే ప్రైమ్ డే 2025 సేల్ జూలై 12 నుండి జూలై 14 వరకు ఉంటుంది
త్వరలో అమెజాన్ ప్రైమ్ డేట్ 2025 సేల్ జరగనుంది. ఈ సేల్ కోసం మొబైల్ కస్టమర్లు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సేల్లో టాప్ బ్రాండ్ మొబైల్స్ అన్నీ కూడా తక్కువ ధరకే లభించునున్నాయి. అందులో భాగంగానేప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO, అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్‌కు సందర్భంగా తమ పలు మోడళ్లపై మంచి ఆఫర్లను ప్రకటించింది. ఈ డిస్కౌంట్లు జూలై 12 నుండి జూలై 14 వరకు జరిగే ప్రైమ్ డే సేల్ సమయంలో కస్టమర్లకు లభిస్తాయి. ఈ సందర్భంగా, కంపెనీ తాజా ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన iQOO 13కి చెందిన కొత్త ఏస్ గ్రీన్ కలర్ వేరియంట్ తొలిసారిగా భారత మార్కెట్లోకి లాంచ్ అవ్వనుంది. iQOO బ్రాండ్ మొబైల్ కొనాలి అనుకునే వారికి ఈ సేల్ మంచి అవకాశం అని చెప్పవచ్చు.
ఈ సేల్లో iQOO 13 భారత మార్కెట్లో రూ. 52,999కు అందుబాటులోకి రానుంది.12GB + 256GB వేరియంట్ అసలు ధర రూ. 54,999 మరియు 16GB + 512GB వేరియంట్ రూ. 59,999 ఉండగా, ప్రైమ్ డే సందర్భంగా బ్యాంక్ ఆఫర్లు, కూపన్ డిస్కౌంట్లు వలన ఈ తగ్గింపు లభించనుంది. ఇప్పటికే లెజెండ్, నార్డో గ్రే కలర్ వేరియంట్లలో లభిస్తున్న ఈ ఫోన్, ఇప్పుడు ఏస్ గ్రీన్ కలర్ లోను కస్టమర్లకు లభిస్తుంది.
ఈ ఫోన్‌లో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ SoC, ప్రత్యేకమైన Q2 గేమింగ్ చిప్, 7,000 sq mm వేపర్ ఛాంబర్, 6,000mAh బ్యాటరీ మరియు 120W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లు ఉన్నాయి. 50MP ట్రిపుల్ కెమెరా యూనిట్, 6.82 అంగుళాల 2K LTPO AMOLED డిస్‌ప్లే,144Hz రిఫ్రెష్‌రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ ఫోన్‌కి అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఇటీవల భారత మార్కెట్లో విడుదలైన iQOO Neo 10 ధర రూ. 31,999 మరియు Neo 10R ధర రూ. 26,999 ఉండగా, ప్రైమ్ డే సమయంలో రూ. 26,999 మరియు రూ. 23,499కు లభించనున్నాయి. ఈ ధరలు బ్యాంక్ ఆఫర్లు, కూపన్లతో కలిపి వస్తాయి.
బడ్జెట్ కేటగిరీలోకి వచ్చే iQOO Z10 ఫోన్‌కి ప్రైమ్ డే సమయంలో ప్రత్యేక డిస్కౌంట్ లభించనుంది. 8GB + 128GB వేరియంట్ అసలు ధర రూ. 21,99 కాగా సేల్ సమయంలో ఇది రూ. 19,999కి లభించనుంది. అంతేకాక, 6GB + 128GB వేరియంట్ iQOO Z10x మోడల్ రూ. 13,499 కాగా, ప్రైమ్ డేలో ఇది రూ. 12,749కి లభిస్తుంది. మరోవైపు, 4GB + 128GB వేరియంట్ iQOO Z10 Lite 5G మోడల్ ప్రస్తుతం రూ. 9,999 కాగా, సేల్ సమయంలో ఇది రూ. 9,499కి అందుబాటులోకి రానుంది.
ఈ మొత్తం ఆఫర్లు బ్యాంక్ ఆఫర్లు మరియు కూపన్ డిస్కౌంట్లతో సహా ఎఫెక్టివ్ ధరలతో లభిస్తాయి. అంతేకాకుండా, వినియోగదారులు నో-కాస్ట్ EMI, ఇతర ఫైనాన్షియల్ ఆప్షన్లను కూడా వినియోగించుకోవచ్చు. ఈ సేల్ ఆఫర్లు జూలై 12 నుండి జూలై 14 వరకు మాత్రమే వర్తించనున్నాయి. iQOO ఫోన్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నవారికి తక్కువ ధరకే హై-ఎండ్ ఫోన్‌లను పొందేందుకు ఇది గొప్ప అవకాశం అని చెప్పవచ్చు.
ప్రకటన
ప్రకటన