ఈ ఈవెంట్‌లో ఐఫోన్ 17 లైనప్‌లో నాలుగు కొత్త మోడల్స్ ప్రకటించబడతాయని అంచనా

ఐఫోన్ 17 లాంచ్ ఈవెంట్ ఉదయం 10 గంటలకు పసిఫిక్ టైమ్ ప్రకారం ప్రారంభం కానుంది. భారతదేశంలో వీక్షకులకు ఇది రాత్రి 10:30 గంటలకు అందుబాటులో ఉంటుంది.

ఈ ఈవెంట్‌లో ఐఫోన్ 17 లైనప్‌లో నాలుగు కొత్త మోడల్స్ ప్రకటించబడతాయని అంచనా

Photo Credit: Apple

ఈవెంట్ కోసం Apple యొక్క లోగో కర్సర్ ఎక్కడ చూపుతుందో బట్టి రంగులను మారుస్తుంది

ముఖ్యాంశాలు
  • ఈ రోజు జరగనున్న ఆపిల్ అవే డ్రాపింగ్ ఈవెంట్
  • ఆపిల్ మూడు కొత్త స్మార్ట్‌వాచ్‌లను కూడా పరిచయం చేయనుంది
  • ఆపిల్ TV యాప్‌లో ఈ ఈవెంట్‌ను వీక్షించవచ్చు
ప్రకటన

ఆపిల్ ఈ ఏడాది అత్యంత పెద్ద హార్డ్‌వేర్ లాంచ్ ఈవెంట్ ఈరోజు జరగబోతోంది. సంవత్సరం పొడవునా వచ్చిన లీక్స్, రూమర్స్ అన్నింటికీ ముగింపు పలుకుతూ, ‘అవే డ్రాపింగ్' పేరుతో ఈ ఈవెంట్‌ను ఆపిల్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో తదుపరి తరం ఐఫోన్ లైనప్ ఆవిష్కరించబడే అవకాశం ఉంది. ఇది iPhone 17 సిరీస్‌గా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా, ఆపిల్ వాచ్ సిరీస్ 11 నుంచి కొత్త ఎయిర్‌పాడ్స్ ప్రో (3rd Generation) వరకు పలు ఉత్పత్తులు కూడా ఈవెంట్‌లో లాంచ్ అవ్వనున్నాయి అని సమాచారం. ఈ కీనోట్ ప్రసంగం చివర్లో iOS 26, iPadOS 26 మరియు ఇతర ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్స్‌కు సంబంధించిన రిలీజ్ తేదీలను కూడా వెల్లడించే అవకాశం ఉంది.

ఐఫోన్ 17 లాంచ్ ఈవెంట్ ఉదయం 10 గంటలకు పసిఫిక్ టైమ్ ప్రకారం ప్రారంభం కానుంది. భారతదేశంలో వీక్షకులకు ఇది రాత్రి 10:30 గంటలకు అందుబాటులో ఉంటుంది. గత ఐఫోన్ ఈవెంట్ల మాదిరిగానే, ఈ సారి కూడా ‘అవే డ్రాపింగ్' ఈవెంట్ అమెరికా, కాలిఫోర్నియాలోని కుపర్టినోలోని ఆపిల్ పార్క్‌లో ఉన్న స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో జరుగుతుంది. ఈ లాంచ్ ఈవెంట్‌ను ఆపిల్ అధికారిక వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానెల్ ద్వారా లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు. అదేవిధంగా, ఆపిల్ TV యాప్‌లో కూడా ఈవెంట్‌ను వీక్షించవచ్చు. ఇది iOS, ఆండ్రాయిడ్ పరికరాలు, స్మార్ట్ టీవీల్లో కూడా అందుబాటులో ఉంటుంది.

ఈ ఈవెంట్‌లో ఐఫోన్ 17 లైనప్‌లో నాలుగు కొత్త మోడల్స్ ప్రకటించబడతాయని అంచనా. వీటిలో బేస్ మోడల్ iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max, అలాగే కొత్త iPhone 17 Air ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా, ఈ స్లిమ్ మోడల్ iPhone 16 Plusకు బదులుగా వస్తుందని, ఇప్పటివరకు విడుదలైన ఐఫోన్‌లలో అతి సన్నని మోడల్‌గా నిలుస్తుందని చెబుతున్నారు.

ఐఫోన్ 17 సిరీస్‌తో పాటు, ఆపిల్ మూడు కొత్త స్మార్ట్‌వాచ్‌లను కూడా పరిచయం చేయనుంది. ఆపిల్ Watch Series 11, Watch Ultra 3, Watch SE 3 మోడల్స్ ఈవెంట్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా, మూడు సంవత్సరాల తర్వాత AirPods Pro (3rd Generation) కూడా ఆవిష్కరించబడతాయని సమాచారం. ఈ కొత్త మోడల్‌లో హార్ట్‌రేట్ మానిటరింగ్ వంటి అప్‌గ్రేడ్ ఫీచర్లు ఉండే అవకాశం ఉందని రూమర్స్ చెబుతున్నాయి.

Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. సరికొత్త Apple స్మార్ట్ వాచ్‌లు వచ్చేశాయ్, ఆరోగ్య లక్షణాలు చెప్పే సెన్సార్లు, 19 నుంచి సేల్స్ ప్రారంభం
  2. కళ్లు చెదిరే మోడల్స్, ధరతో ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్
  3. iPhone Air పూర్తిగా eSIM-only మోడల్‌గా వస్తుంది
  4. iPhone 17 లో డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది
  5. నేపథ్యంలో రాబోయే iPhone 17 సిరీస్పై వరుసగా లీకులు వెలుగులోకి వస్తున్నాయి
  6. iPhone 17 Pro మోడళ్ల రూపకల్పనలో కూడా కీలక మార్పులు జరగనున్నాయి
  7. ఈ ఈవెంట్‌లో ఐఫోన్ 17 లైనప్‌లో నాలుగు కొత్త మోడల్స్ ప్రకటించబడతాయని అంచనా
  8. మార్కెట్‌లోకి సరికొత్త Apple స్మార్ట్ వాచ్‌లు, కళ్లు చెదిరే ఫీచర్లు
  9. ఐఫోన్ 17 సిరీస్ రెడీ టు లాంఛ్.. ఏ ఏ మోడల్స్ వస్తున్నాయంటే?
  10. దయచేసి మీ ఫోన్లను రీస్టార్ట్‌ చేయండి అని ఎయిర్‌టెల్ వినియోగదారులకు సూచించింది
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »