ఆపిల్‌ని వీడనున్న డిజైన్ చీఫ్ అలాన్ డై, మెటాలోని కీలక పోస్టులో చేరనున్నట్టు సమాచారం

ఆపిల్‌ కంపెనీని డిజైన్ చీఫ్ అలాన్ డై వీడనున్నట్టు తెలుస్తుంది.ఆయన మెటాలోని కీలక పోస్టులో చేరనున్నట్టు సమాచారం.

ఆపిల్‌ని వీడనున్న డిజైన్ చీఫ్ అలాన్ డై, మెటాలోని కీలక పోస్టులో చేరనున్నట్టు సమాచారం

Photo Credit: Reuters

మెటాలో, అలాన్ డై కంపెనీ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ మరియు AI ఇంటిగ్రేషన్‌పై పనిచేస్తారని చెబుతారు.

ముఖ్యాంశాలు
  • మెటాలో కొత్త డిజైన్ విభాగానికి బాధ్యత వహించనున్న అలాన్ డై
  • అలాన్ డై స్థానంలో ఆపిల్‌లో స్టీఫెన్ లెమే నియామకం
  • అలాన్ డై మెటా CTO ఆండ్రూ బోస్‌వర్త్‌కు రిపోర్ట్ చేస్తారని సమాచారం
ప్రకటన

లిక్విడ్ గ్లాస్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను పర్యవేక్షించిన ఆపిల్ డిజైన్ చీఫ్ అలాన్ డై మెటాలో చేరుతున్నట్టు సమాచారం. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కంపెనీని విడిచిపెట్టి మెటాలో కొత్త చీఫ్ డిజైన్ ఆఫీసర్‌గా చేరుతున్నట్టు తెలుస్తుంది. కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం ఆపిల్‌ నుంచి తప్పుకోవడాన్ని ధ్రువీకరించింది. ఇప్పటికే ఆపిల్ కూడా ఈ స్థానంలోకి ఇంకొకరిని ఎంపిక చేసినట్టు సమాచారం. ముఖ్యంగా ఐఫోన్ తయారీదారు ఇటీవల ఉన్నత స్థాయి కార్యనిర్వాహకులు మరొక కంపెనీకి వెళ్లిపోవడం లేదా పదవీ విరమణ సహాజంగా జరుగుతుంది. బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ ప్రకారం ఆపిల్‌లో హ్యూమన్ ఇంటర్‌ఫేస్ డిజైన్ వైస్ ప్రెసిడెంట్ అలాన్ డై మెటా కంపెనీలో చేరనున్నారు. అధికారిక నియామకం తర్వాత డై మెటా AI-ఆధారిత వినియోగదారు పరికరాలపై దృష్టి సారిస్తుందని రిపోర్టులో పేర్కొంది. కాగా ఐఫోన్ తయారీదారు దీర్ఘకాల డిజైనర్ స్టీఫెన్ లెమేను డిపార్టీ రోల్‌కు నియమించాలని యోచిస్తున్నట్టు సమాచారం.

అలాగే బ్లూమ్‌బెర్గ్‌కు ఇచ్చిన ఒక ప్రకటనలో ఆపిల్ లెమే నియామకాన్ని ధ్రువీకరించింది. '1999 నుంచి ప్రతి ప్రధాన ఆపిల్ ఇంటర్‌ఫేస్ రూపకల్పనలో స్టీవ్ లెమే కీలక పాత్ర పోషించారు. అతను ఎల్లప్పుడూ అత్యుత్తమ స్థాయికి చేరుకున్నాడు.' అని సీఈవో టిమ్ కుక్ చెప్పినట్లు ప్రకటనలో వెల్లడించింది.

ఐఫోన్ 5 జనరేషన్ నుంచి ఆపిల్ సాఫ్ట్‌వేర్ రూపాన్ని, అనుభూతిని రూపొందించిన డై, డిసెంబర్ 31న మెటాలో తన కొత్త హోదాలో అధికారికంగా జాయిన్ అవుతారు. ఇతని మార్పు సంవత్సరాలలో సిలికాన్ వ్యాలీ, రెండు డిజైన్ పవర్‌హౌస్‌ల మధ్య అతిపెద్ద క్రాస్‌ఓవర్‌లలో ఒకటిగా గుర్తించబడుతుంది. మెటాలో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ పులకు బాధ్యత వహించే కొత్తగా ఏర్పడిన డిజైన్ స్టూడియోకు డై నాయకత్వం వహించనున్నట్టు తెలుస్తుంది.

2015లో ఐఫోన్ తయారీదారులో తొలిసారి చేరిన డై, వివిధ పరికరాలు, ఇంటర్‌ఫేస్‌ల రూపకల్పనకు దోహదపడినట్టు తెలుస్తోంది. మాజీ డిజైన్ చీఫ్ జోనీ ఐవ్ నిష్క్రమించిన తర్వాత ఆయన ప్రస్తుత రోల్‌లో నియమించపబడ్డారు. కంపెనీ వివిధ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో లిక్విడ్ గ్లాస్ డిజైన్ లాంగ్వేజ్‌ను పర్యవేక్షించడం ఆయన అత్యంత ముఖ్యమైన పనిగా చెప్పాలి. ఈ వారం తన నిష్క్రమణ నిర్ణయం గురించి డై కంపెనీకి చెప్పాడని రిపోర్ట్ పేర్కొంది. అయితే ఉన్నతాధికారులు దీనిని ఇప్పటికే అంచనా వేశారు.

కంపెనీలో అతని ప్రస్తుత హోదా ఇంకా నిర్ధారించబడనప్పటికీ, డిసెంబర్ 31 నుంచి డై మెటాలో చీఫ్ డిజైన్ ఆఫీసర్‌గా చేరనున్నట్లు సమాచారం. సోషల్ మీడియా దిగ్గజం ఎగ్జిక్యూటివ్ కోసం కొత్త డిజైన్ స్టూడియోను సృష్టిస్తున్నట్లు, స్మార్ట్ గ్లాసెస్, వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌లు వంటి కంపెనీ నిర్మించే అన్ని AI-ఆధారిత వినియోగదారు పరికరాల రూపకల్పనకు ఆయన బాధ్యత వహిస్తారని సమాచారం. రియాలిటీ ల్యాబ్స్‌ను కూడా పర్యవేక్షించే కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆండ్రూ బోస్‌వర్త్‌కు డై వ్యవహరిస్తారని సమాచారం.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. శామ్‌సంగ్ గెలాక్సీ బడ్స్ 4 సిరీస్ డిజైన్ లీక్, ఆకర్షణీయమైన రూపంలో బడ్స్
  2. ఆపిల్‌ని వీడనున్న డిజైన్ చీఫ్ అలాన్ డై, మెటాలోని కీలక పోస్టులో చేరనున్నట్టు సమాచారం
  3. రెండు డిస్‌ప్లేలు కూడా 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తాయి.
  4. HBO Max మాత్రం Apple TV విభాగంలో ఉత్తమ యాప్‌గా గుర్తింపుపొందింది.
  5. డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ వంటి సౌకర్యాలు కూడా యథాతథంగా ఉన్నాయి.
  6. త్వరలో Nothing ఫోన్ 3a విడుదల, హ్యాండ్‌ సెట్‌లో ఉండే ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
  7. ఇక స్టాండర్డ్ iPhone 17 మోడళ్లలో LTPO ప్యానెల్స్‌ వాడాలని ఆపిల్ ఆలోచిస్తోంది.
  8. సంచార్ సాథి యాప్‌పై ప్రభుత్వం సంచలన నిర్ణయం, ముందస్తుగా డౌన్‌లోడ్ చేసుకోనవసరం లేదని ప్రకటన
  9. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ Android 15 ఆధారంగా రూపొందించిన HyperOS 2 పై నడుస్తుంది.
  10. ఇటీవల వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం, Poco C85 5G గూగుల్ ప్లే కన్సోల్‌లో 2508CPC2BI మోడల్ నంబర్‌తో కనిపించింది.
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »