(OS) ColorOS 15 O+ ఇంటర్‌కనెక్షన్ యాప్ సహకారంతో Oppo, iPhone మోడల్‌ల మధ్య సులభంగా ఫైల్స్ ట్రాన్స్‌ఫర్‌కు సపోర్ట్ చేస్తుంది
Photo Credit: Oppo
ColorOS 15 brings Android 15 to Oppo and OnePlus smartphones
Oppo, OnePlus స్మార్ట్‌ఫోన్‌ల కోసం కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ (OS) ColorOS 15ను ఆవిష్కరించారు. ఈ తాజా Android 15 ఆధారంగా మెరుగైన మోషన్ ఎఫెక్ట్‌తోపాటు స్పష్టమైన యానిమేషన్‌లు, కొత్త థీమ్‌లను ఆస్వాదించవచ్చు. ఇది O+ ఇంటర్‌కనెక్షన్ యాప్ సహకారంతో Oppo, iPhone మోడల్‌ల మధ్య సులభంగా ఫైల్స్ ట్రాన్స్‌ఫర్‌కు సపోర్ట్ చేస్తుంది. ColorOS 15 దీని Xiaobu అసిస్టెంట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌లకు సపోర్ట్ చేయడం ద్వారా వినియోగదారులు దాని ఆన్-స్క్రీన్ వెసులుబాటును సద్వినియోగం చేసుకోవడంతో పాటు సాధారణ బాషలో సంభాషణలను కొనసాగించవచ్చు.
ఈ సరికొత్త డైనమిక్ ColorOS 15 ద్వారా సహజ కాంతి, షాడో, ఐకానోగ్రఫీతో రిఫ్రెష్ చేయబడిన యూజర్ ఇంటర్‌ఫేస్ (UI)ని తీసుకువస్తుంది. ఇది మల్టీటాస్కింగ్ అనుభవాన్ని అందించేలా యాప్ యానిమేషన్‌లను అరోరా, టైడల్ ఇంజిన్‌లను ఒకే విధంగా ఉపయోగిస్తుంది. ఆప్టిమైజేషన్స్ సహకారంతో కంపెనీ తాజా అప్‌డేట్ ఫలితాలను 18 శాతం మెరుగుపరిచినట్లు తెలిపింది.
Oppo పరికరాలు, iPhone మోడల్‌ల మధ్య ఫైల్‌లను బదిలీ చేయడం సులభతరం చేసే O+ ఇంటర్‌కనెక్షన్ యాప్ మరొక ముఖ్యమైన అటాచ్‌గా చెప్పొచ్చు. వినియోగదారులు ఫోటోలు, వీడియోలు, ఫైల్స్‌ను సెకన్ల వ్యవధిలో ట్రాన్సఫర్ చేసుకోవచ్చు.
ColorOS 15 AI ఫీచర్లను కూడా అందిస్తుంది. దాని Xiaobu అసిస్టెంట్‌లో సహజ భాషను అర్థం చేసుకోవడంతోపాటు సంభాషణలను నిర్వహించగలదు. Oppo వాయిస్ రికార్డర్‌లో ఇది రికార్డింగ్‌లను టైపింగ్, సమరైజ్ చేయగలదు.
ఫోటోల యాప్‌లో కూడా AI ఫీచర్లు ఉన్నాయి. వన్-టచ్ పర్సన్, రిఫ్లెక్షన్ రిమూవల్, పోర్ట్రెయిట్‌ల కోసం బ్లర్ రిమూవల్, ఇమేజ్ అప్‌స్కేలింగ్ వంటి ఫీచర్ల ప్రయోజనాన్ని పొందవచ్చు. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS)కి ఇప్పుడు లైవ్ ఫోటోలు సపోర్ట్ ఇస్తున్నాయి. చైనాలో రాబోయే Find X8 సిరీస్‌తోపాటు OnePlus 13లో ColorOS 15 అందుబాటులో ఉంటుందని Oppo వెల్లడించింది. ఇది చైనాలో నవంబర్ నుండి విడుదల కానుంది.
నవంబర్ 2024..
Oppo Find X7, Oppo Find X7 Ultra Satellite Communication Edition, Oppo N3 ఫ్లిప్, OnePlus 12, OnePlus టాబ్లెట్ ప్రో,
డిసెంబర్ 2024..
Oppo Find N2, Oppo Find X6,Oppo K12 5G, OnePlus 11, OnePlus 11 5G జూపిటర్ రాక్ కస్టమ్ ఎడిషన్,
జనవరి 2025..
Oppo Find N2 Flip, Oppo Find X5, Oppo Find X5 Pro, Oppo Reno 10 Pro స్టార్ ఎడిషన్ 5G,
ఫిబ్రవరి 2025..
Oppo Find X5 Pro డైమెన్సిటీ ఎడిషన్, Oppo K12 Plus, Oppo K12 5G, OnePlus Ace రేసింగ్ ఎడిషన్ 5G
మార్చి 2025..
Oppo Reno 9 Pro 5G, Oppo Reno 9 5G, Oppo Reno 8 Pro+
ప్రకటన
ప్రకటన
Scientists Unveil Screen That Produces Touchable 3D Images Using Light-Activated Pixels
SpaceX Expands Starlink Network With 29-Satellite Falcon 9 Launch
Nancy Grace Roman Space Telescope Fully Assembled, Launch Planned for 2026–2027
Hell’s Paradise Season 2 OTT Release Date: When and Where to Watch it Online?