దేశీయ మార్కెట్‌లోకి ఆగ‌స్టు 22న రాబోతోన్న Google Pixel 9.. ధ‌రెంతో తెలుసా?!

Google Pixel 9 సిరీస్ ఫోన్‌ల‌కు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, సెక్యూరిటీ ప్యాచ్‌లతోపాటు పిక్సెల్ డ్రాప్‌లను ఏడు సంవ‌త్స‌రాల‌పాటు కంపెనీనే అందించనున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

దేశీయ మార్కెట్‌లోకి ఆగ‌స్టు 22న రాబోతోన్న Google Pixel 9.. ధ‌రెంతో తెలుసా?!
ముఖ్యాంశాలు
  • దుమ్ము రేప‌నున్న Pixel 9 సిరీస్‌లో మూడు మోడల్స్
  • Pixel 9 ఫోన్ వెనుక‌ డ్యూయల్ కెమెరా సెటప్‌
  • Pixel 9 Pro, Pixel 9 Pro XL ట్రిపుల్ రియ‌ల్ కెమెరా సెట‌ప్‌
ప్రకటన
ఈ వారం జ‌రిగిన‌ మేడ్ బై గూగుల్ ఈవెంట్‌లో Google Pixel 9, Pixel 9 Pro, Pixel 9 Pro XLల‌ను కంపెనీ దేశీయ మార్కెట్‌లోకి విడుద‌ల చేసింది. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు టైటాన్ M2 సెక్యూరిటీ చిప్‌తో పాటు టెన్సర్ G4 SoCతో ప‌నిచేస్తాయి. మూడు మోడ‌ల్స్‌కు కూడా నీరు మరియు ధూళి నిరోధించే ఫీచ‌ర్‌ను అందించారు. వీటి రీఫ్రెస్ రేటింగ్‌ IP68 ఇవ్వ‌బ‌డింది. అంతేకాదు, ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, సెక్యూరిటీ ప్యాచ్‌లతోపాటు పిక్సెల్ డ్రాప్‌లను ఏడు సంవ‌త్స‌రాల‌పాటు కంపెనీనే అందించనున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. Pixel 9 వేరియంట్‌లో 12GB RAMతో డ్యూయల్ రియర్ కెమెరాలు లభిస్తుండగా, Pixel 9 Pro మరియు Pixel 9 Pro XL 16GB RAMని కలిగి ట్రిపుల్ రియ‌ల్ కెమెరాల‌తో వ‌స్తున్న‌ట్లు ఉంటాయ‌ని కంపెనీ తెలిపింది. 

భారతదేశంలో అందుబాటులో ఉన్న ఏకైక మోడ‌ల్‌ Google Pixel 9 ఫోన్‌ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధ‌ర రూ. 79,999గా నిర్ణ‌యించారు. ఇది పియోనీ, పింగాణీ, అబ్సిడియన్, వింటర్‌గ్రీన్ రంగులలో అందుబాటులో ఉంటుంది. 128GB వేరియంట్ కూడా ఉన్నప్పటికీ, ఇది ఇంకా మ‌న దేశంలో అమ్మ‌కాలు జ‌ర‌ప‌డం లేదు. అదే సమయంలో, Pixel 9 Pro మోడ‌ల్‌ 16GB RAM + 256GB స్టోరేజ్ వెర్షన్ ధ‌ర రూ. 1,09,999 కాగా Pixel 9 Pro XL ఫోన్‌ 16GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ద‌ర రూ. 1,24,999 ఉంది. అలాగే, Pixel 9 లైనప్ ఆగస్టు 22 నుండి ఫ్లిప్‌కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్ రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా అందుబాటులో ఉంటుంది.

Pixel 9 స్పెసిఫికేషన్స్‌..

Pixel 9 6.3 అంగుళాల డిస్‌ప్లే (1,080 x 2,424 పిక్సెల్‌లు)తో డ్యూయల్ సిమ్ (నానో+eSIM)ను క‌లిగి ఉంటుంది. అలాగే, 120హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌తోపాటు 2700 నిట్స్ బ్రైట్‌నెస్‌, టెన్సార్ జీ4 ఎస్‌వోసీ పవర్డ్, టైటాన్ ఎం2 సెక్యూరిటీ చిప్ ద్వారా ఈ ఫోన్ పనిచేస్తుందని కంపెనీ వెల్ల‌డించింది. Pixel 9 ఫోన్ వెనుక‌ డ్యూయల్ కెమెరా సెటప్‌తో రూపొందించారు. ఇందులో 50-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరా, 48-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్ కోసం ముందువైపున‌ 10.5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు. 4,700mAh బ్యాట‌రీ సామ‌ర్థ్యంతోపాటు 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తోపాటు క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్ చేసేలా రూపొందించారు.

Pixel 9 Pro, Pro XL స్పెసిఫికేషన్స్‌..

Pixel 9 Pro 6.3-అంగుళాల డిస్‌ప్లే సూపర్ ఆక్యూ ఓఎల్‌ఈడీతో రిఫ్రెష్ రేట్ 120హెట్జ్‌గా ఉంటుంది. మొబైల్ బ్రైట్‌నెస్ 3,000 నిట్స్ అందిస్తుంది. ఇక Pixel 9 Pro XL విష‌యానికి వ‌స్తే.. 6.8-అంగుళాల సూపర్ ఆక్టువా ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో రూపొందించ‌బ‌డింది. అలాగే, Pixel 9 Pro, Pro XL రెండు ఫోన్‌లలోనూ ఒకే మాదిరిగా కొన్ని ఫీచర్లను అందించారు. ఇవి రెండు కూడా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను క‌లిగి ఉంటాయి. అలాగే, 50-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 48-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్‌తో అందుబాటులోకి రానున్నాయి.  48-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్‌తో గరిష్టంగా 30రెట్లు సూపర్ రెస్ జూమ్, 5రెట్లు ఆప్టికల్ జూమ్‌తో షూట్ చేయ‌వ‌చ్చు. రెండు మోడ‌ల్స్‌కూ ముందు భాగంలో 42-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. వీడియో రికార్డింగ్ విష‌యాని వ‌స్తే రెండింటిలోనూ 8K క్వాలిటీతో వీడియో రికార్డింగ్‌కు స‌పోర్ట్ చేస్తాయి. అయితే, బ్యాట‌రీ సామ‌ర్థ్యం విష‌యంలో Pixel 9 Pro ఫోన్‌లో బ్యాట‌రీ కెపాసిటీ 4,700mAh ఉండ‌గా, Pro XLలో మాత్రం 5,060mAhగా ఉంది.


 

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. కొత్త ఏడాదిలో సామ్ సంగ్ నుంచి అద్భుతమైన ఫీచర్స్‌తో రానున్న టీవీలు.. ప్రత్యేకతలు ఇవే
  2. మార్కెట్లోకి హానర్ విన్, విన్ ఆర్‌టి మోడల్స్.. కీ ఫీచర్స్ గురించి తెలుసా?
  3. సాఫ్ట్‌వేర్ పరంగా, Realme 16 Pro+ Android 16 ఆధారిత Realme UI 7తో రన్ అవుతుంది.
  4. Moto G Power (2026) అమెరికాలో $299.99 ధరతో విడుదలైంది.
  5. సాఫ్ట్‌వేర్ పరంగా, Realme 16 Pro+ Android 16 ఆధారిత Realme UI 7తో రన్ అవుతుంది.
  6. స్ట్రాటజీతో రేట్లు పెంచేసిన సామ్ సంగ్.. ఇక నెక్ట్స్ ఐఫోన్ వంతు
  7. వీటిలో ఇప్పటికే 3,500 పోస్టులు భర్తీ అయ్యాయని ఆయన తెలిపారు.
  8. అంతేకాదు, భారీగా 9,000mAh బ్యాటరీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
  9. అదిరే కెమెరా ఫీచర్స్‌తో ఒప్పో Find X9.. ఈ ప్రత్యేకతలు తెలుసుకున్నారా?
  10. ఇది 2026 వసంతకాలంలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »