Honor కంపెనీ ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్‌లలో తమ తాజా స్మార్ట్ ఫోన్ Honor 400 Lite ను లాంఛ్ చేసింది. ఈ చైనీస్ టెక్ బ్రాండ్ నుంచి గత ఏడాది వచ్చిన తాజా నంబర్ సిరీస్ హ్యాండ్‌సెట్ Honor 200 Lite 5G కి మంచి స్పందన వచ్చింది. తర్వాత కంపెనీ నుంచి Honor 300 Lite సిరీస్‌లో లైట్ వెర్షన్ రాలేదు. ప్రస్తుతం విడుదలైన Honor 400 Lite ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ కీలక స్పెసిఫికేషన్స్‌లలో 108-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, 5,230mAh బ్యాటరీ, IP65-రేటెడ్ బిల్డ్ వంటివి ఉన్నాయి.
హంగేరీలో మొబైల్ ధర
కొత్త Honor 300 Lite హంగేరీలో బేస్ మోడల్ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర FT 1,09 999 (సుమారు రూ. 25,000)గా ఉంది. అయితే, అదే స్టోరేజ్ ఉన్న 12GB RAM వేరియంట్ ధర వివరాలు మాత్రం అందుబాటులో లేదు. అలాగే, ఇది మార్స్ గ్రీన్, వెల్వెట్ బ్లాక్, వెల్వెట్ గ్రే కలర్ ఆప్షన్‌లలో అమ్మకాలకు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడైంది.
డ్యూయల్ రియర్ కెమెరా
Honor 400 Lite మొబైల్ డ్యూయల్-సిమ్ (నానో)తో ఆండ్రాయిడ్ 15 పై రన్ అవుతుంది. అలాగే, మ్యాజిక్ ఓఎస్ 9.0 పైన కూడా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 6.7-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,412 పిక్సెల్స్)
AMOLED డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్, 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. దీని డిస్‌ప్లే 3840Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్‌ను అందిస్తోంది. ఇది 8GB, 12GB RAM ఆప్షన్‌లలో వస్తుంది. దీనికి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. 108-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో f/1.75 ఎపర్చరు, 5-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌తో వస్తుంది. ముందు భాగంలో, f/2.45 ఎపర్చరుతో 16-మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.
డ్రాప్ రెసిస్టెన్స్ కోసం
ఈ ఫోన్ కనెక్టివిటీ ఆప్షన్‌లలో 5GNR, Wi-Fi 802.11 a/b/g/n/ac, బ్లూటూత్ 5.3, GPS, AGPS,
GLONASS, BeiDou, గెలీలియో, OTG, USB టైప్-C వంటివి ఉన్నాయి. హ్యాండ్‌సెట్‌లోని సెన్సార్‌లలో యాంబియంట్ లైట్ సెన్సార్, కంపాస్, గ్రావిటీ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లను అందించారు. ఇది డ్రాప్ రెసిస్టెన్స్ కోసం SGS ఫైవ్-స్టార్ రేటింగ్‌ను పొందింది. ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటుంది.
AI కెమెరా బటన్‌తో
కొత్త Honor 400 Lite లో AI ఎరేస్, AI పెయింటింగ్, AI ట్రాన్స్‌లేట్ వంటి అనేక AI-ఆధారిత ఫీచర్‌లను అందించారు. ఇది AI కెమెరా బటన్‌తో వస్తుంది. దీంతో వినియోగదారులు ఒక చేతితో ఫోటోలు, వీడియోలను తీయడానికి అవకాశం ఉంటుంది. ఈ మొబైల్ 35W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. 161x74.55x7.29mm పరిమాణంతో 171 గ్రాముల బరువును ఉంటుంది.