Photo Credit: Honor
గత ఏడాది డిసెంబర్‌లో Honor 90 GT చైనాలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ మోడల్‌కు కొనసాగింపుగా మరో హ్యాండ్‌సెట్ త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాబోయే కొత్త Honor GT ప్రొడక్ట్స్‌ను ఈ నెలాఖరులో పరిచయం చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే, రాబోయే ప్రొడక్ట్ యొక్క మోనికర్‌ను మాత్రం కంపెనీ ఇంకా బహిర్గతం చేయలేదు. అయితే, అది Honor 100 GTగా వచ్చే అవకాశం ఉన్నట్లు, దాని డిజైన్ కూడా ఫిక్స్ అయినట్లు భావిస్తున్నారు. అంతేకాదు, గతంలోనే Honor 100 GT స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించినవిగా కొన్ని కీలకమైన స్పెసిఫికేషన్స్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. అలాగే, ఇప్పటికే ఉన్న Honor 90 GT కంటే అది అప్‌గ్రేడ్ చేసిన బ్యాటరీ, ప్రాసెసర్‌ను చూపుతోంది.
కొత్తగా రాబోతోన్న ఈ Honor GT ప్రొడక్ట్స్ డిసెంబర్ 16న స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7:30pm (5pm IST)కి చైనాలో లాంచ్ అవుతాయని Honor Weibo పోస్ట్‌లో స్పష్టం చేసింది. అయితే, రాబోయే ప్రొడక్ట్స్‌కు సంబంధించిన మోనికర్‌లను మాత్రం కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అలాగే, కొత్త లాంచ్‌లలో ఒకటి మాత్రం Honor 100 GT ఫోన్‌గా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Weibo పోస్టును పరిశీలిస్తే.. దీర్ఘచతురస్రాకార వెనుక కెమెరా మాడ్యూల్‌తో Honor GT స్మార్ట్ ఫోన్ డిజైన్‌ను కంపెనీ టీజ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌కు రెండు కెమెరా సెన్సార్లతోపాటు పిల్ ఆకారపు LED యూనిట్‌ను అందించారు. అలాగే, వెనుక కెమెరా మాడ్యూల్ ఒక మూలలో GT అనే అక్షరాలు చెక్కబడి ఉన్నాయి. ఈ టీజర్‌లో ఫోన్‌ను తెలుపుతోపాటు సిల్వర్ రంగులో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. అలాగే, ఈ ఫోన్ MagicOSలో రన్ అవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ Honor 100 GT స్మార్ట్ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, హై-డెన్సిటీ సిలికాన్ బ్యాటరీని అందించినట్లు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు ఇది 1.5K రిజల్యూషన్, ఐ-ప్రొటెక్షన్ టెక్నాలజీతో ఫ్లాట్ LTPS డిస్‌ప్లేను కలిగి ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో వచ్చిన లీక్‌లను బట్టీ.. Honor 100 GT ఫోన్‌ను 50-మెగాపిక్సెల్ సోనీ IMX9xx ప్రైమరీ రియర్ సెన్సార్‌తో రూపొందించారు. ఈ హ్యాండ్‌సెట్ సెక్యూరిటీ కోసం 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
గత ఏడాది లాంచ్ అయిన Honor 90 GT ఫోన్ సోనీ IMX800 ప్రధాన కెమెరా సెన్సార్‌తో సహా 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో వచ్చింది. అలాగే, ఈ హ్యాండ్‌సెట్‌కు 6.7-అంగుళాల ఫుల్-HD+ (2,664 x 1,200 పిక్సెల్‌లు) OLED స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందించారు. సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.
ప్రకటన
ప్రకటన