భారత మార్కెట్‌లో Tecno Spark Go 3 ధరను రూ. 8,999గా కంపెనీ నిర్ణయించింది.
Photo Credit: Flipkart
ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఆపిల్ యొక్క ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ (చిత్రంలో) విజయవంతం కావచ్చు.
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ టెక్నో భారత మార్కెట్‌లో తన కొత్త ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ Tecno Spark Go 3 ను శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ Spark సిరీస్‌లోకి తాజాగా వచ్చిన ఈ ఫోన్, ఈ నెల చివర్లో దేశవ్యాప్తంగా అమ్మకాలకు అందుబాటులోకి రానుంది. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ మార్కెట్‌లలో కూడా వినియోగదారులు ఈ డివైస్‌ను కొనుగోలు చేయవచ్చు. భారత మార్కెట్‌లో Tecno Spark Go 3 ధరను రూ. 8,999గా కంపెనీ నిర్ణయించింది. ఇది 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఒక్క వేరియంట్‌లోనే అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ జనవరి 23 నుంచి Amazon ద్వారా అధికారికంగా అమ్మకాలు ప్రారంభం కానుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో ఇది విక్రయానికి ఉంది. అలాగే, త్వరలోనే Flipkart ద్వారా కూడా ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం కల్పించనున్నట్లు కంపెనీ తెలిపింది. కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే టైటానియం గ్రే, ఇంక్ బ్లాక్, గెలాక్సీ బ్లూ, అరోరా పర్పుల్ అనే నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో Tecno Spark Go 3 లభించనుంది..
Tecno Spark Go 3 డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో Android 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 6.74 అంగుళాల HD+ IPS డిస్‌ప్లేను అందించారు. ముఖ్యంగా ఈ డిస్‌ప్లేకు 120Hz వరకు రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉండడం ఈ ధరలో ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. అదనంగా, డస్ట్ మరియు స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్, అలాగే సుమారు 1.2 మీటర్ల ఎత్తు నుంచి పడినప్పటికీ దెబ్బ తగలకుండా ఉండే డ్రాప్ రెసిస్టెన్స్‌ను కంపెనీ హామీ ఇస్తోంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టా-కోర్ Unisoc T7250 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 1.8GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తుంది. 4GB LPDDR4x ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో కలిసి సాధారణ రోజువారీ అవసరాలకు సరిపోయే పనితీరును అందిస్తుంది. అలాగే Tecno యొక్క Ella వాయిస్ అసిస్టెంట్ కూడా ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంది.
ఫోటోగ్రఫీ కోసం Tecno Spark Go 3 వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ సింగిల్ రియర్ కెమెరాను డ్యూయల్ LED ఫ్లాష్‌తో అందించారు. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. AIGC Portrait, AI CAM, Super Night, Beauty, Dual Video, Vlog, Time-lapse, Panorama, Pro వంటి అనేక కెమెరా మోడ్‌లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. అదనంగా, టెక్నో అందిస్తున్న ఆఫ్‌లైన్ కాలింగ్ ఫీచర్ ద్వారా 1.5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఇతర Tecno ఫోన్ యూజర్లతో నెట్‌వర్క్ లేకుండానే కనెక్ట్ కావచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000mAh సామర్థ్యమైన బ్యాటరీని అందించారు. ఇది 15W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ కోసం 4G LTE, 3G, Wi-Fi, GPS, USB Type-C పోర్ట్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. అంతేకాదు, నాలుగు సంవత్సరాల పాటు “ల్యాగ్-ఫ్రీ పర్ఫార్మెన్స్” అందిస్తుందని Tecno కంపెనీ పేర్కొంటోంది.
ces_story_below_text
ప్రకటన
ప్రకటన
Honor Magic 8 Pro Air Key Features Confirmed; Company Teases External Lens for Honor Magic 8 RSR Porsche Design
Resident Evil Requiem Gets New Leon Gameplay at Resident Evil Showcase