ఈ స్టోర్ Nothing బ్రాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా రెండో ఫ్లాగ్‌షిప్ స్టోర్‌గా నిలవనుంది.
భారతదేశంలో నథింగ్ ఫోన్ 3a ప్రో ధర రూ. 29,999 నుండి ప్రారంభమవుతుంది.
యూకేకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing భారత్‌లో తన తొలి ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఈ స్టోర్‌ను ప్రారంభించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా దీనిపై సంకేతాలు ఇచ్చిన Nothing, తాజాగా ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా ఈ విషయాన్ని ఖరారు చేసింది. అయితే స్టోర్ ఓపెనింగ్‌కు సంబంధించిన ఖచ్చితమైన తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు.
Nothing తొలి భారతీయ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను ఒక ప్రత్యేక అనుభవ కేంద్రంగా రూపొందించనుంది. ఈ స్టోర్‌లో కంపెనీ విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్లు, TWS ఇయర్‌బడ్‌లు, ఇతర డివైస్‌లు మాత్రమే కాకుండా, వాటి డిజైన్ తత్వం, ప్రోడక్ట్ ఎకోసిస్టమ్‌ను కూడా వినియోగదారులు ప్రత్యక్షంగా అనుభవించవచ్చు. డివైస్‌ను చేతిలో పట్టి చూడటం, ఉపయోగించి చూడటం ద్వారా కొనుగోలు నిర్ణయం తీసుకునే అవకాశం కస్టమర్లకు కల్పించడమే ఈ స్టోర్ ప్రధాన లక్ష్యమని కంపెనీ తెలిపింది.
ఈ స్టోర్ Nothing బ్రాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా రెండో ఫ్లాగ్‌షిప్ స్టోర్‌గా నిలవనుంది. ప్రస్తుతం కంపెనీకి ఒకే ఒక్క బ్రాండ్-ఓన్డ్ స్టోర్ ఉంది, అది లండన్‌లోని సోహో ప్రాంతంలో, 4 Peter Street వద్ద కొనసాగుతోంది. ఇప్పుడు అదే తరహాలో భారత్‌లోనూ ఫిజికల్ ప్రెజెన్స్ పెంచుకోవాలని Nothing నిర్ణయించినట్లు తెలుస్తోంది. భారత మార్కెట్‌పై Nothing ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇటీవలి కాలంలో దేశంలో ప్రత్యేక ప్రొడక్ట్ డ్రాప్ ఈవెంట్స్ నిర్వహించడం, కొత్త డివైస్‌లను ఇక్కడే లాంచ్ చేయడం ద్వారా భారత వినియోగదారులకు మరింత దగ్గరవుతోంది. అంతేకాదు, Nothing సబ్-బ్రాండ్ అయిన CMF కూడా ఇటీవలే భారత్‌లో స్వతంత్రంగా లీగల్ ఎంటిటీగా నమోదు అయింది. డిసెంబర్ 2025లో CMF అధికారికంగా ఒక స్వతంత్ర కంపెనీగా మారినట్లు వెల్లడైంది.
ఈ సందర్భంగా Nothing సహ వ్యవస్థాపకుడు, ఇండియా ప్రెసిడెంట్ అయిన ఆకిస్ ఎవాంజెలిడిస్ మాట్లాడుతూ, గ్లోబల్ కన్స్యూమర్ టెక్ ఎకోసిస్టమ్‌లో భారత్ కీలక పాత్ర పోషిస్తున్నదని పేర్కొన్నారు. ఈ మార్పులో CMFకు ఎంతో ముఖ్యమైన స్థానం ఉందని ఆయన స్పష్టం చేశారు. లీగల్ డాక్యుమెంట్స్ ప్రకారం, ఈ బ్రాండ్ ఇకపై CMF India Private Limitedగా కార్యకలాపాలు నిర్వహించనుంది. కంపెనీ తన ఆపరేషన్స్ బేస్‌ను కూడా భారత్‌కు మార్చింది. స్మార్ట్‌ఫోన్లు, వేరబుల్స్ తయారీ నుంచి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ వరకు అన్నింటినీ భారత్ కేంద్రంగా చేసుకుని నిర్వహించాలనే వ్యూహంతో Nothing ముందుకు సాగుతోంది. ఈ పరిణామాలతో, భారత మార్కెట్ Nothingకు ఎంత ప్రాధాన్యంగా మారిందో స్పష్టంగా కనిపిస్తోంది.
ces_story_below_text
ప్రకటన
ప్రకటన
Honor Magic 8 Pro Air Key Features Confirmed; Company Teases External Lens for Honor Magic 8 RSR Porsche Design
Resident Evil Requiem Gets New Leon Gameplay at Resident Evil Showcase