Infinix Xpad పేరుతో Infinix కంపెనీ తన మొదటి ట్యాబ్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, సంస్థ అధికారిక ప్రకటనకు ముందే ఈ ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను Infinix నైజీరియన్ ఆర్మ్ నుంచి టీచర్‌ను విడుదల చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీని ద్వారా ట్యాబ్‌కు సంబంధించిన అనేక స్పెసిఫికేషన్లను కంపెనీ ధృవీకరించినట్లు స్పష్టమైంది. ఈ టీచర్ ఆధారంగా Infinix Xpad 11-అంగుళాల స్క్రీన్‌తో మార్కెట్‌లోకి విడుదల కానుంది. అంతేకాదు ఈ ట్యాబ్ నలుపు, నీలం, బంగారు రంగులలో మొత్తం మూడు కలర్స్‌లో అందుబాటులోకి రానుంది. నైజీరియాలోని అనేక ఆఫ్‌లైన్ రిటైలర్‌లు Infinix Xpadని వినియోగంలోకి తీసుకోవడంతోపాటు దీని ధర సైతం బహిర్గతమైంది.
నైజీరియా కరెన్సీ ధర ఆధారంగా..
Infinix కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ కొత్త Infinix Xpad ట్యాబ్ ధరతోపాటు ఎప్పటి నుంచి అందుబాటులోకి రానుంది అన్న విషయాలను వెల్లడించలేదు. అయితే, ఈ మోడల్ యొక్క స్పెసిఫికేషన్‌లు మాత్రం నైజీరియా Infinix అధికారిక X అకౌంట్ నుంచి పోస్ట్ ద్వారా పంచుకుంది. దీని ఆధారంగా ఈ ట్యాబ్ ధర 4GB RAM + 256GB స్టోరేజ్ సామర్థ్యంతో నైజీరియా కరెన్సీ NGN 2,51,800 (దాదాపు రూ. 13,500)గానూ, 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ మోడల్ NGN 2,83,800 (దాదాపు రూ. 15,000)గానూ నిర్ణయించినట్లు ట్యాగ్ చేసింది. అంతేకాదు, నైజీరియాలోని ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నట్లు స్పష్టం చేసింది. జాబితాను విస్తృతం చేసేందుకు..
Infinix Xpad ట్యాబ్ Android 14తో రన్ అవుతోంది. అలాగే, రెండు సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను పొందనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 11-అంగుళాల full-HD (1,200x1,920 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. MediaTek Helio G99 ప్రాసెసర్ ద్వారా శక్తిని గ్రహిస్తుంది. ఈ కొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్‌లో ChatGPTతో AI- సపోర్ట్ చేసే ఫోలాక్స్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఇది స్టీరియో సౌండ్‌తో క్వాడ్-స్పీకర్ యూనిట్‌ను కలిగి ఉండడంతోపాటు 256GB ఆన్‌బోర్డ్ మెమరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ట్యాబ్‌ను మార్కెట్‌కు పరిచయం చేయడం ద్వారా Infinix కంపెనీ యొక్క ఉత్పత్తుల జాబితాను మరింత విస్తృతం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాదు, Infinix తన మొదటి గేమింగ్ ల్యాప్‌టాప్, Infinix GT బుక్ (రివ్యూ)ను ఈ ఏడాది మేలో దేశీయ మార్కెట్‌లో ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు, Infinix నుంచి వస్తోన్న అనేక స్మార్ట్‌ఫోన్‌లు, ఉపకరణాలు, స్మార్ట్ టీవీలు కొనుగోలుదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆ తరహా ఆధరణ పొందేందుకు..
దేశీయ మార్కెట్‌లో ఇప్పటికే Infinix Note 40X 5G పేరులో ఈ ఏడాది ఆగస్టు 5న స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోట్ సిరీస్ ఫోన్ 12GB వరకు RAMతో రూపొందించబడి మీడియా టెక్ డైమెన్సిటీ 6300 5G చిప్‌తో అందుబాటులోకి వచ్చింది. Infinix Note 40X 5G మీడియా టెక్ చిప్‌సెట్‌తోపాటు సూపర్ స్మూత్ డిస్‌ప్లేని కలిగి ఉంటుంది. ఆకట్టుకునే ట్రిపుల్ కెమెరా సెటప్‌తోపాటు ఎక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీ, డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లతో వినియోగదారులను ఎంతగానో తనవైపు తిప్పుకునేలా చేసింది. తాజాగా విడుదలవుతున్న Infinix Xpad ట్యాబ్ ఈ తరహా ఆదరణనే పొందుతుందని కంపెనీ ఆశిస్తోంది. మరి త్వరలో దేశీయ మార్కెట్‌లోకి లాంచ్ కాబోతోన్న ఈ ట్యాబ్ ఎంతవరకూ మార్కెట్ వర్గాలను ఆకట్టుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!