Photo Credit: Infinix
ఇన్ఫినిక్స్ నోట్ 50X అష్టభుజి 'జెమ్-కట్' కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది.
త్వరలోనే Infinix Note 50X 5G మన దేశంలోకి రాబోతోంది. తాజాగా, కంపెనీ లాంచ్ తేదీని ప్రకటించింది. అలాగే, రాబోయే హ్యాండ్‌సెట్ డిజైన్‌ను కూడా వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ లైవ్‌లో వచ్చిన మైక్రోసైట్ ఈ-కామర్స్ సైట్‌లో దీని లభ్యతను ధృవీకరించింది. లాంచ్‌కు ముందు రోజుల్లో ఈ స్మార్ట్ ఫోన్ గురించి మరిన్ని వివరాలను వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రారంభంలోనే Infinix ఇండోనేషియాలో బేస్ Note 50, Note 50 ప్రో, Note 50 ప్రో+ లను ఆవిష్కరించింది. భారత్‌లో ఈ వేరియంట్‌ల లాంఛ్‌పై ఇంకా స్పష్టత లేదు. రాబోయే Infinix Note 50X 5Gకి సంబంధించిన కీలక విషయాలను తెలుసుకుందాం.
Infinix Note 50X 5G స్మార్ట్ ఫోన్ మార్చి 27న మన దేశంలో లాంఛ్ అవుతుందని కంపెనీ ఓ పత్రికా ప్రకటనలో స్పష్టం చేసింది. అలాగే, ఈ ఫోన్ యాక్టివ్ హాలో లైట్ ఫీచర్‌తో రానుంది. ఇది నోటిఫికేషన్‌ల సమయంలో లైట్ వెలగడం, సెల్ఫీ టైమర్‌గా పనిచేయడం, ఛార్జింగ్ స్టేటస్‌ను చూపడం, గేమ్ బూట్-అప్ సమయంలో డైనమిక్ ఎఫెక్ట్ క్రియేట్ చేయడం చేస్తుంది. ఇది ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
అలాగే, కంపెనీ షేర్ చేసిన ఇమేజ్‌లో Infinix Note 50X 5G ఫోన్ సిల్వర్ ఫినిషింగ్‌తోపాటు జెమ్-కట్ కెమెరా మాడ్యూల్‌తో కనిపిస్తోంది. ఇందులో మూడు సెన్సార్లు, LED ఫ్లాష్, యాక్టివ్ హాలో యూనిట్‌లు ఉన్నాయి. అలాగే, కెమెరా ఐస్‌లాండ్ బేస్ Infinix Note 50X స్మార్ట్ ఫోన్ పోలికతో ఉంది. రాబోయే రోజుల్లో ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన అనేక కీలక ఫీచర్స్ వెల్లడవుతాయని సూచిస్తోంది.
రాబోయే Infinix Note 50X 5G స్మార్ట్ ఫోన్ ఆగస్టు 2024లో మన దేశంలో విడుదలైన Infinix Note 40X 5G హ్యాండ్‌సెట్ స్థానంలో రానుంది. ఈ ఫోన్ MediaTek Dimensity 6300 ప్రాసెసర్, 6.78-అంగుళాల 120Hz ఫుల్-HD+ స్క్రీన్, 18W వైర్డ్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దీనికి 108-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ను అందించారు. అలాగే, ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14-ఆధారిత XOS 14తో వస్తోంది.
మన దేశంలో Infinix Note 40X ఫోన్ లాంఛ్ సమయంలో 8GB + 256GB వేరియంట్ ధర రూ. 14,999గా ఉంది. అలాగే, 12GB + 256GB వేరియంట్ ధర రూ. 15,999గా నిర్ణయించారు. దీంతో రాబోయే Infinix Note 50X 5G స్మార్ట్ ఫోన్ ధర కూడా ఇండియాలో ఇదే ధర రేంజ్‌లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ధరపై స్పష్టత రావాంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ప్రకటన
ప్రకటన