Apple India వెబ్‌సైట్‌లో iPhone 15 Plus బేస్ 128GB వేరియంట్ ధర రూ. 89,600గా ఉంది. అయితే, అదే వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 13,601 తగ్గిస్తూ.. రూ. 75,999గా లభిస్తోంది
Photo Credit: Apple
iPhone 15 Plus (pictured) is offered in Black, Blue, Green, Pink and Yellow colourways
గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో iPhone 15 సిరీస్ హ్యాండ్‌సెట్‌లతో పాటు iPhone 15 Plus లాంచ్ అయింది. ఈ సిరీస్‌లో iPhone 15, iPhone 15 Pro, iPhone 15 Pro Max మోడల్స్ కూడా ఉన్నాయి. సరిగ్గా మళ్లీ ఏడాదికి Apple నుంచి iPhone 16 లైనప్ సెప్టెంబర్ 9న లాంచ్ కాబోతోంది. ఈ లాంచ్‌కు ముందు A16 బయోనిక్ చిప్‌సెట్-బ్యాక్డ్ iPhone 15 Plus ధరను దేశీయ మార్కెట్‌లోని ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో భారీగా తగ్గించింది. అంతేకాదు, అధికారిక వెబ్‌సైట్‌లో ప్రస్తుతం చూపిస్తోన్న ధరలతో పోల్చితే ఈ మోడల్ ప్రారంభ ధర కంటే చాలా తక్కువగా ఉంది.
దేశీయ మార్కెట్‌లోనే కాదు.. ప్రపపంచ వ్యాప్తంగా iPhoneకు ఉన్న క్రేజ్ అంతాఇంత కాదు. ఈ ఫోన్ చేతిలో ఉందంటే అదోక స్టేటస్ సింబల్‌గా ఫీల్ అవుతుంటారు. అలాంటి iPhone ఇప్పుడు భారీ డిస్కౌంట్ ప్రకటించిందంటే.. అది ముమ్మాటికీ హాట్ న్యూస్ అనే చెప్పాలి. ఆ ఆఫర్‌ల గురించి చూస్తే.. Apple India వెబ్‌సైట్‌లో iPhone 15 Plus బేస్ 128GB వేరియంట్ ధర రూ. 89,600గా ఉంది. అయితే, అదే వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 13,601 తగ్గిస్తూ.. రూ. 75,999గా లభిస్తోంది. అదనంగా, కొనుగోలుదారులు తమ హ్యాండ్‌సెట్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లలో ధరలను తగ్గించి, తీసుకోవచ్చు. అలాగే, HSBC లేదా ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMIని ఉపయోగించే కస్టమర్‌లు రూ. 1,500 డిస్కౌంట్ పొందవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా BOB CARD హోల్డర్‌లతో పాటు UPI లావాదేవీలను ఉపయోగించే కొనుగోలుదారులు అదనంగా రూ. 1,000 తగ్గింపు ఆఫర్ సొంతం చేసుకోవచ్చు.
iPhone 15 Plus బెస్ట్ వేరియంట్‌లు అయిన 256GB, 512GBలు ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గింపు ధరలు వరుసగా రూ. 85,999, రూ. 1,05,999గా ఉన్నాయి. ఈ వేరియంట్‌లు అధికారిక Apple వెబ్‌సైట్‌లో మాత్రం వరుసగా రూ. 99,600, రూ. 1,19,600గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, iPhone 16 లైనప్ నుంచి రాబోయే లాంచ్ కారణంగా iPhone 15 Plus ధరతోపాటు ఇతర iPhone 15 సిరీస్ హ్యాండ్‌సెట్‌ల ధరలను రాబోయే కొద్ది రోజుల్లో దేశీయ మార్కెట్‌లో తగ్గించే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
iPhone 15 Plus 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది A16 బయోనిక్ చిప్‌సెట్‌తో శక్తిని పొందుతుంది. అలాగే, USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌తో ప్రారంభించబడిన మొదటి ఆపిల్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇది ఒకటిగా చెప్పొచ్చు. ఇక కెమెరా విభాగాన్ని చూస్తే.. డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌లో 48-మెగాపిక్సెల్ సెన్సార్, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 12-మెగాపిక్సెల్ TrueDepth కెమెరాను కలిగి ఉంటుంది. మరి ఇలాంటి అధిరిపోయే ఫీచర్స్ ఉన్న iPhone డిస్కౌంట్‌లో దొరుకుతుందంటే ఎవ్వరు వదులు కుంటారు చెప్పండి!
ప్రకటన
ప్రకటన
Redmi Note 15 Pro Series Colourways and Memory Configurations Listed on Amazon
BSNL Bharat Connect Prepaid Plan With 365-Day Validity Launched; Telco's BSNL Superstar Premium Plan Gets Price Cut