యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రధాన ఆక‌ర్ష‌ణ‌గా iPhone 16 మ‌రియు iPhone 16 Plusలు విడుద‌ల‌

iPhone 16, iPhone 16 Plusలను కంపెనీ ప్రారంభించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ల‌లో యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంద‌ని కంపెనీ చెబుతోంది

యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రధాన ఆక‌ర్ష‌ణ‌గా iPhone 16 మ‌రియు iPhone 16 Plusలు విడుద‌ల‌

Photo Credit: Apple

iPhone 16 and iPhone 16 Plus are both equipped with a vertical camera layout

ముఖ్యాంశాలు
  • iPhone 16 మరియు iPhone 16 Plus Apple A18 ప్రాసెస‌ర్‌తో వ‌స్తున్నాయి
  • ఈ రెండు ఫోన్‌లూ మాక్రో ఫోటోగ్రఫీని సపోర్ట్ చేస్తాయి
  • యాక్షన్ బటన్‌తో పాటు కొత్త కెమెరా కంట్రోల్ బటన్‌తో వ‌స్తుంది
ప్రకటన

ప్ర‌ముఖ‌ టెక్‌ దిగ్గజం యాపిల్‌ iPhone 16 సిరీస్‌ను భార‌త్‌తో స‌హా ప‌లు దేశాల‌లో విడుదల చేసింది. తాజా హార్ట్‌వేర్ లాంచ్ ఈవెంట్‌లో iPhone 16, iPhone 16 Plusలను కంపెనీ ప్రారంభించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ల‌లో యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంద‌ని కంపెనీ చెబుతోంది. ఈ 16 సిరీస్ ఫోన్‌లు ఏ18 చిప్‌తో అందుబాటులోకి రానున్నాయి. గ‌త మోడ‌ల్స్ మాదిరిగానే డ్యూయల్ వెనుక కెమెరా సెటప్‌తో అమర్చబడి ఉంటాయి. అలాగే, iPhone 16, iPhone 16 Plusలు గత సంవత్సరం గ‌త సంవ‌త్స‌రం మార్కెట్‌లోకి విడుద‌లైన iPhone 15 ప్రో మోడల్‌లతో వచ్చిన యాక్షన్ బటన్, కొత్త కెమెరా కంట్రోల్ బటన్‌ను కూడా కలిగి ఉన్నాయి.

iPhone 16 ధర $799 (దాదాపు రూ. 67,100)గా కంపెనీ నిర్ణ‌యించింది. అయితే, iPhone 16 Plus బేస్ 128GB వేరియంట్ ధ‌ర మాత్రం $899 (సుమారు రూ. 75,500) వద్ద ప్రారంభమవుతుంది. ఈ రెండు ఫోన్‌లు గరిష్టంగా 512GB స్టోరేజీతో అందుబాటులో ఉన్నాయి. బ్లాక్, పింక్, టీల్, అల్ట్రామెరైన్, వైట్ కలర్ ఆప్షన్‌లలో సంద‌డి చేయ‌నున్నాయి. ప్రీ-ఆర్డర్‌లు సెప్టెంబర్ 13న ప్రారంభమవుతుండ‌గా, సెప్టెంబర్ 20న అమ్మ‌కాలు మొద‌ల‌వుతాయి.

న్యూరల్ ఇంజన్‌తో..

కొత్తగా లాంచ్ అయిన‌ iPhone 16 డ్యూయల్ సిమ్ (US: eSIM, వరల్డ్‌వైడ్: Nano+eSIM)తో iOS 18లో ర‌న్ అవుతుంది. 6-కోర్ CPU, 5-కోర్ GPU ఫీచర్లతో 3nm ఆక్టా-కోర్ A18 ప్రాసెస‌ర్‌ ద్వారా శక్తిని పొందుతూ 16-కోర్ న్యూరల్ ఇంజన్‌తో వ‌స్తుంది. Apple iPhone 16ను 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేతో రూపొందించారు. ఇది 2,000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌, అప్‌గ్రేడ్ చేసిన సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్, డైనమిక్ ఐలాండ్‌తో వ‌స్తుంది. దుమ్ము, నీటి నిరోధకత కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉంది.

ట్యాప్ లేదా స్లయిడ్‌తో జూమ్

iPhone 16 Plus స్టాండర్డ్ మోడల్ మాదిరిగా అదే స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. అయితే, ఇది 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేతో వ‌స్తుంది. ఈ ఫోన్‌లు iPhone 15 ప్రో సిరీస్ నుండి వ‌చ్చిన యాక్షన్ బటన్‌తో పాటు కుడి వైపున కొత్త కెమెరా కంట్రోల్ బటన్‌తో వ‌స్తుంది. వినియోగ‌దారులు ఒక ట్యాప్ లేదా స్లయిడ్‌తో జూమ్ చేయడానికి, ఫొటోల‌ను క్లిక్ చేయడానికి, వీడియోను రికార్డ్ చేయడానికి రెండోదాన్ని వినియోగించొచ్చు.

48-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా

ఈ కొత్త హ్యాండ్‌సెట్‌లు 48-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో 2x ఇన్-సెన్సర్ జూమ్, f/1.6 ఎపర్చరుతో ఉంటాయి. ఇవి 12-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను f/2.2 ఎపర్చరు, ఆటోఫోకస్‌తో కలిగి ఉంటాయి. అల్ట్రావైడ్ కెమెరా మాక్రో ఫోటోగ్రఫీని కూడా ఎనేబుల్ చేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 12-మెగాపిక్సెల్ TrueDepth కెమెరా ఉంది. 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్, GPS, NFC, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. భారత వినియోగదారులు OnePlus 15 లాంచ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
  2. మార్కెట్లోకి అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4కె సెలెక్ట్.. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్
  3. అదిరిపోయే ఫీచర్లతో నథింగ్ ఫోన్ 3ఏ లైట్.. ఇంకా ఇతర విషయాలు తెలుసుకోండి
  4. ఈ ఫోన్‌లో Snapdragon 7s Gen 2 ప్రాసెసర్ అమర్చబడింది.
  5. ANC ఆఫ్‌లో ఉన్నప్పుడు ఒక్కసారి ఛార్జ్‌పై ఇయర్‌బడ్స్ 11 గంటల వరకు పనిచేస్తాయి.
  6. Samsung సాధారణంగా తన ఫ్లాగ్‌షిప్ ఫోన్లను జనవరి లేదా ఫిబ్రవరిలో విడుదల చేస్తుంది
  7. Realme ఇప్పటికే వియత్నాం మార్కెట్‌లో ఈ ఫోన్‌ను అధికారికంగా టీజ్ చేసింది
  8. Oppo ఐదు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, ఆరు సంవత్సరాల భద్రతా అప్‌డేట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది
  9. మార్కెట్లోకి రానున్న ఐకూ నియో 11.. 7,500mAh బ్యాటరీతో రానున్న మోడల్
  10. 7,500mAh బ్యాటరీ సపోర్ట్‌తో రానున్న రెడ్ మీ టర్బో 5.. స్పెషాలిటీ ఏంటంటే?
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »