Photo Credit: Apple
iPhone SE 4 లాంచ్‌పై చాలా కాలంగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం చూస్తున్న సమయంలో బ్లూమ్‌బెర్గ్ యొక్క మార్క్ గుర్మాన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. iPhone SE 4ని 2025 ప్రారంభంలో విడుదల చేసేందుకు Apple సమాయత్తమవుతోందని తెలిపారు. రాబోయే ఈ iPhone మోడల్‌ను కొత్త iPad Airతోపాటుగా లాంచ్ అయ్యే ఉపకరణాలతో విడుదల చేయవచ్చు. అలాగే, ఈ iPhone SE 4 హోమ్ బటన్ తొలగించి, దానికి బదులుగా ఫేస్ IDని ఉపయోగిస్తుంది. ఇది యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో రానున్నట్లు భావిస్తున్నారు. ఈ మోడల్‌కు సంబంధించిన పలు విషయాలను చూద్దాం.
Apple తాజా iPhone SE 4తో పాత హోమ్ బటన్ డిజైన్ నుండి ఎడ్జ్-టు-ఎడ్జ్ స్క్రీన్‌కి మారుతుందని నివేదించబడింది. ఈ ఫోన్ ఫేస్ IDని ఉపయోగిస్తూ.. Apple Intelligenceకి సపోర్ట్ చేయనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ AI టూల్స్ యొక్క సూట్ ఇప్పటికే iPhone 16, హై-ఎండ్ iPhone 15 మోడళ్లలో అందుబాటులో ఉంది. అలాగే, iPhone SE 4 కొసం అనేక డిజైన్‌లను 2022 iPhone 14 నుండి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో పైభాగంలో ఉన్న నాచ్ కటౌట్ కూడా ఉంది. ప్రస్తుతం Apple స్టోర్‌లో అందుబాటులో ఉన్న iPhone SE టచ్ ID, థిక్ బెజెల్‌లు, సింగల్ వెనుక కెమెరాతో iPhone 8ని పోలి ఉంటుంది.
ఈ కొత్త iPhone SE విడుదలతో తక్కవ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో Apple సమర్థవంతంగా నిలబడేందుకు సహాయపడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే, ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న Huawei, Xiaomi వంటి బ్రాండ్‌ల వల్ల కోల్పోయిన మార్కెట్ వాటాను తిరిగి పొందే అవకాశం ఉంటుంది. గుర్మాన్ ప్రకారం.. iPhone SE 4తోపాటు Apple కొత్త iPad Air మోడల్‌లను J607, J637 అనే కోడ్‌నేమ్‌లతో వచ్చే ఏడాది ప్రారంభంలో ఆవిష్కరించనుంది. ఇవి వరుసగా 11-అంగుళాలు, 13-అంగుళాల స్క్రీన్‌లను కలిగి ఉంటాయి. అలాగే, మ్యాజిక్ కీబోర్డ్ యాక్సెసరీ అప్‌గ్రేడ్, అప్‌డేట్ చేసిన Mac మినీ, M4 చిప్‌తో అప్‌డేట్ చేసిన MacBook ప్రోస్, iMacs, Apple ఇంటెలిజెన్స్ ఫీచర్‌లు కూడా 2025లో అధికారికంగా అందుబాటులోకి రానున్నాయి.
iPhone SE 4 మోడల్ 48-మెగాపిక్సెల్‌తో ఒకే ఒక్క వెనుక కెమెరాతో వస్తుంది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.06-అంగుళాల ప్యానెల్‌తో రూపొందించే అవకాశం ఉంది. ఇది 6GB, 8GB LPDDR5 RAM వేరియంట్‌లలో Apple A18 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. దీని ధర $499 (దాదాపు రూ. 42,000), $549 (దాదాపు రూ. 46,000) మధ్య ఉంటుందని అంచనా. iPhone SE (2022) బేస్ 64GB మోడల్ $429 (దాదాపు రూ. 35,000) ప్రారంభ ధర ట్యాగ్‌తో ఆవిష్కరించబడింది.
ప్రకటన
ప్రకటన