Apple iOS 18 ఇప్పుడు భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉందని ప్రకటించింది
Apple first showcased its latest OS updates, including iOS 18 at WWDC 2024 in June
భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా iOS 18ని Apple కంపెనీ విడుదల చేసింది. iPhone కోసం ఈ కొత్త అప్‌డేట్ మొదటిసారిగా జూన్‌లో జరిగిన వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) 2024లో కొన్ని విషయాలు వెల్లడించబడ్డాయి. ఆ తర్వాత రోజుల్లో అనేక డెవలపర్, పబ్లిక్ బీటా అప్‌డేట్‌లు వచ్చాయి. ఇది ఇప్పుడు భారతదేశంలోని iPhone వినియోగదారుల డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. తాజా అప్‌డేట్‌తో అనేక ఫీచర్స్‌ను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. అలాగే, Apple నుంచి రాబోయే నెలలో వచ్చే ఐఫోన్ మోడల్‌లకు Apple ఇంటెలిజెన్స్ – కంపెనీ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సూట్‌ని ఉపయోగించి ఫీచర్లను తీసుకురానుంది.
ఒక ప్రకటన ద్వారా Apple iOS 18 ఇప్పుడు భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉందని ప్రకటించింది. కింది తెలిపిన విధంగా చేయడం ద్వారా దీనిని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ముందుగా iPhoneలో సెట్టింగ్‌లను తెరవాలి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఆప్షన్‌ను ఎంచుకునేందుకు జనరల్ ట్యాబ్‌కు నావిగేట్ చేయాలి. ఏవైనా పెండింగ్‌లో ఉన్న అప్‌డేట్‌ల కోసం iPhone ఆటోమెటిక్‌గా సర్చ్ చేస్తుంది. తర్వాత డౌన్‌లోడ్ & ఇన్‌స్టాల్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. నిబంధనలు, షరతులను చదివివి వాటిని అంగీకరించినట్లయితే మీ iPhoneలో iOS 18 డౌన్‌లోడ్ చేయబడి, ఇన్‌స్టాల్ అయిపోతుంది.
ఈ కొత్త iOS 18 డెవలపర్, పబ్లిక్ బీటా అప్‌డేట్‌లను పొందిన అన్ని iPhone మోడల్‌లు కూడా iOS 18 పబ్లిక్ రిలీజ్‌కి అర్హులని Apple కంపెనీ చెబుతోంది. ఇందులో iPhone 15 Pro Max వంటి Apple యొక్క తాజా ఫ్లాగ్‌షిప్‌లు, అలాగే iPhone XR వంటి పాత మోడల్‌లు కూడా ఉన్నాయి. iPhone 16 సిరీస్, సెప్టెంబర్ 20న అమ్మకానికి వస్తుంది. ఈ కొత్త iOS 18 అప్‌డేట్ అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో కూడా వస్తుంది. ఆప్‌డేట్‌లు స్వీకరించే మోడల్స్ జాబితాను పరిశీలిస్తే..
iPhone 16 Series
iPhone 15 Series
iPhone 14 Series
iPhone SE (2022)
iPhone 13 Series
iPhone 12 Series
iPhone 11 Series
iPhone XS Max
iPhone XS
iPhone XR
iPhone SE (2020)
iOS 18 ఇప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నప్పటికీ, Apple ఇంటెలిజెన్స్ అప్‌డేట్‌లో చేర్చబడదు. కుపెర్టినో-ఆధారిత ఈ టెక్ దిగ్గజం WWDC 2024 ఈవెంట్‌లో దాని కొత్త AI సూట్‌ను కొత్త iPhone 16 మోడల్‌లతో పాటు భారీగా ప్రచారం చేసింది. అయితే, రైటింగ్ టూల్స్, ఆబ్జెక్ట్ రిమూవల్ టూల్స్, వెబ్ పేజీ సారాంశం వంటి ఫీచర్లు వచ్చే నెల iOS 18.1 అప్‌డేట్‌తో మాత్రమే వస్తాయి. ఇదిలా ఉండగా.. సరికొత్తగా రాబోయే AI- పవర్డ్ ఇమేజ్ ప్లేగ్రౌండ్ వంటి కొన్ని అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్‌లు వచ్చే ఏడాది తర్వాత వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి.
ప్రకటన
ప్రకటన
Engineers Turn Lobster Shells Into Robot Parts That Lift, Grip and Swim
Strongest Solar Flare of 2025 Sends High-Energy Radiation Rushing Toward Earth
Raat Akeli Hai: The Bansal Murders OTT Release: When, Where to Watch the Nawazuddin Siddiqui Murder Mystery
Bison Kaalamaadan Is Now Streaming: Know All About the Tamil Sports Action Drama