Photo Credit: iQOO
మొబైల్ ప్రియులు ఈ ఏడాదిలో ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతుందా అని ఎదురుచూసే స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో iQOO 13 తప్పకుండా ఉంటుంది. కానీ, ఈ Vivo సబ్-బ్రాండ్ దీని లాంచ్ తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, దీనికి ముందే ఫోన్ ధర, స్పెసిఫికేషన్‌లు, దేశీయ మార్కెట్‌లో లాంచ్ టైమ్‌లైన్ గురించి ఊహాగానాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. గత సంవత్సరం విడుదలైన iQOO 12 మాదిరిగానే iQoo 13 కూడా స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో నడుస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా భావిస్తున్నాయి. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల 2K AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. iQoo 13లో 6,150mAh బ్యాటరీని అందించే అవకాశం ఉంది. మరెందుకు ఆలస్యం.. iQoo 13 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దామా?!
GizmoChina నుంచి వచ్చిన లీక్ ఆదారంగా.. iQOO 13 భారతదేశం లాంచ్ టైమ్‌లైన్, ధర, స్పెసిఫికేషన్‌లను అంచనా వేస్తున్నారు. దీని నివేదిక ప్రకారం, చైనాలో డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 10 మధ్య, అలాగే ఈ హ్యాండ్‌సెట్ మనదేశంలో డిసెంబర్ నేలాఖరుకు లాంచ్ చేసే అవకాశం ఉంది. దేశీయ మార్కెట్‌లో దీని ధర దాదాపు రూ. 55,000 వరకూ ఉండవచ్చు. గత ఏడాది iQOO 12 నవంబర్‌లో చైనాలో విడుదల కాగా, తరువాత డిసెంబర్ 2023లో భారతదేశంలో లాంచ్ అయ్యింది. అలాగే, ధరతోపాటు డిజైన్ విషయంలో ఈ కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ iQOO 12కు దగ్గరగా ఉండే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు సైతం భావిస్తున్నాయి.
ఇక స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. iQoo 13 2K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్‌తో 16GB RAM, 512GB వరకు స్టోరేజీతో వస్తుందని అంచనా. 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్, 50-మెగాపిక్సెల్ 2x టెలిఫోటో కెమెరాతో పాటు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో దీనిని రూపొందించారు. అలాగే, సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించవచ్చు. iQOO 13 హ్యాండ్‌సెట్‌లోని ఈ కెమెరాతో క్వాలిటీ వీడియో కాలింగ్ అనుభూతిని పొందవచ్చు.
కొన్ని నివేదికల ప్రకారం.. iQoo 13 అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఇది మెటల్ మిడిల్ ఫ్రేమ్‌తో వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాదు, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,150mAh బ్యాటరీని అందిస్తున్నారు. నీరు, ధూళి నిరోధకత కోసం IP68-రేటెడ్ బిల్డ్‌తో వస్తుంది. ఈ ఫోన్ హాలో లైట్ డిజైన్‌ను కలిగి ఉండవచ్చని భావిస్తున్నారు. అందరూ ఊహిస్తున్నట్లు ఈ ధరతోపాటు స్పెసిఫికేషన్స్‌తో iQoo 13 దేశీయ మొబైల్ మార్కెట్‌లోకి లాంచ్ అయితే మాత్రం ఇతర కంపెనీలకు గట్టిపోటీ ఇచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది.
(Except for the headline, this story has not been edited by NDTV staff and is published from a press release)
ప్రకటన
ప్రకటన