ప్రముఖ టెక్ బ్రాండ్ iQOO దేశీయ మార్కెట్‌లో నిత్యం కొత్త కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తూ.. కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది. ఈ కంపెనీ ఇప్పటికే అనేక మోడల్స్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరొక కొత్త ఫోన్‌ను మార్కెట్‌కి పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. iQOO 13 మోడల్ ఫోన్ విషయంలో ఇటీవల జరుగుతోన్న ప్రచారాన్ని బట్టీ త్వరలోనే ఈ కొత్త మోడల్ లాంచ్ కాబోతున్నట్లు స్పష్టమవుతోంది. మరెందుకు ఆలస్యం.. iQOO 13 మోడల్ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను చూసేద్దాం రండి!
నిజానికి కంపెనీ చైనాలో iQOO 12 మోడల్‌ను గత సంవత్సరం నవంబర్ ఆవిష్కరించింది. అదే ఏడాది డిసెంబర్ నెలలో దీనిని దేశీయ మార్కెట్‌లో విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన iQOO 12 మోడల్‌కు దేశీయ మార్కెట్‌లో మంచి స్పందన రావడంతో ఈ మోడల్లో గణనీయమైన డిజైన్ మార్పులుతో దీనిని తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాదు, ప్రాసెసర్, డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ, ఛార్జింగ్ వంటి కీలక విషయాలతో కూడిన పలు స్పెసిఫికేషన్‌లను వెల్లడిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను గతంలోనే వైరల్‌గా మారాయి.
1St gen మాదిరిగానే..
అలాగే, టిప్‌స్టర్ వీబో పోస్ట్‌ను బట్టీ చూస్తే.. iQOO 13 లైట్-స్ట్రిప్ డిజైన్‌తో లాంచ్ కాబోతున్నట్లు భావించవచ్చు. దీంతోపాటు ఈ డిజైన్ పూర్తిగా iQOO స్మార్ట్‌ఫోన్‌లనుంచి వచ్చిన 1St gen మాదిరిగానే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ గ్లాస్ వెనుక ప్యానెల్‌లో ఒక మిల్లీమీటర్ లోతులో నిలువు లైట్ స్ట్రిప్‌ను రూపొందించారు. ఈ కొత్త మోడల్ స్క్విర్కిల్ రియర్ కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉన్న ప్రస్తుత iQOO 12 డిజైన్‌గా అందించబడుతోంది.
2K OLED స్క్రీన్‌తో విడుదల..
ఈ మోడల్‌కి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్‌లను X వేదికగా ప్రముఖ టిప్‌స్టర్ పోస్ట్ చేశారు. టిప్‌స్టర్ పోస్ట్ ఆధారంగా.. iQOO 13 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల 2K OLED స్క్రీన్‌తో విడుదల కానుంది. అలాగే, ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ ద్వారా శక్తిని అందుకుంటుంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్ దుమ్ము, స్ప్లాష్ నిరోధకత కోసం IP68-రేటెడ్ బిల్డ్‌తో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్..
ముఖ్యంగా iQOO 13 మోడల్ స్మార్ట్‌ఫోన్‌కు అందించబోయే కెమెరా విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 50 మెగాపిక్సెల్ షూటర్, 2x ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌తో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్‌తో సహా ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుందని టిప్‌స్టర్ వెల్లడించారు. ఈ హ్యాండ్‌సెట్ ముందువైపు కెమెరా 16-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే, 100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6,000mAh బ్యాటరీ సామర్థ్యం ఉండే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. గతంలో విడుదలైన iQOO 12 మోడల్ స్మార్ట్‌ఫోన్ 120W అల్ట్రా-ఫాస్ట్ ఫ్లాష్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
మంచి స్పందన ఉంటుందని..
ఈ మోడల్ 2024 నవంబర్ చివరిలో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు కొందరు కొనుగోలుదారులు అభిప్రాయపడుతున్నారు. అయితే, iQOO 13కు సంబంధించి కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం ఇప్పటి వరకూ అందుబాటులో లేదు. ఈ మోడల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే మాత్రం.. కంపెనీ నుంచి స్పష్టమైన ప్రకటన రావాల్సిందే. ఏది ఏమైనా అందరూ ఊహించినట్లు ఇవే స్పెసిఫికేషన్‌లతో iQOO 13 మోడల్ మార్కెట్‌లోకి లాంచ్ అయితే మాత్రం కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.