లాంచ్‌కు ముందే ప్రో మోడల్‌కు సంబంధించిన ప్రాసెసర్ గురించిన వివరాలను కంపెనీ వెల్లడించింది. దీని SoC TSMC ఫాబ్రికేషన్ ప్రాసెస్‌పై రూపొందించబడిన MediaTek నుండి సేకరించబడిన ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌గా ధృవీకరించారు.
Photo Credit: iQOO
iQOO Neo 10 సిరీస్ మూడు రంగులలో వస్తుందని నిర్ధారించబడింది
iQOO Neo 10 సిరీస్ ఈ నెలలోనే చైనా మొబైల్ మార్కెట్‌లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో iQOO Neo 10, iQOO Neo 10 Pro అనే రెండు మోడల్స్ పరిచయం కానున్నాయి. అయితే, తాజాగా లాంచ్‌కు ముందే ప్రో మోడల్‌కు సంబంధించిన ప్రాసెసర్ గురించిన వివరాలను కంపెనీ వెల్లడించింది. దీని SoC TSMC ఫాబ్రికేషన్ ప్రాసెస్‌పై రూపొందించబడిన MediaTek నుండి సేకరించబడిన ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌గా ధృవీకరించారు. దీని రంగులు, ప్రీ-ఆర్డర్ ఆఫర్‌లతో పాటు, సిరీస్ లాంచ్ తేదీ కూడా బహిర్గతమైంది.
చైనాలోని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Weibo పోస్ట్ ప్రకారం.. iQOO కంపెనీ తన తాజా స్మార్ట్‌ఫోన్‌లు iQOO Neo 10 సిరీస్‌ను చైనాలో నవంబర్ 29న స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు (సుమారు 3:30 am IST) లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ లైనప్ నలుపు, నారింజ, తెలుపు మూడు రంగులలో అందుబాటులోకి రానుంది. ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ చెబుతున్నదాని ప్రకారం.. కొనుగోలుదారులు CNY 2267 (దాదాపు రూ. 26,000) ధరకు స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను ప్రీ-రిజర్వ్ చేసుకోవచ్చు. అలాగే, వీరికి బ్లూటూత్ స్పీకర్, కస్టమైజ్‌డ్ టెంపర్డ్ గ్లాస్, మంచి ట్రేడ్-ఇన్ ఆఫర్‌ల వంటి అదనపు ప్రయోజనాలు అందించనున్నారు.
MediaTek డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ ద్వారా iQOO Neo 10 Pro ఫ్లాగ్‌షిప్ పవర్‌ను అందుకోనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. Vivo X200 సిరీస్‌కు కూడా ఇదే ప్రాసెసర్ పవర్‌ను అందిస్తోంది. ఇది సింగిల్ ఆర్మ్ కార్టెక్స్-X925 ప్రైమ్ కోర్, మూడు ఆర్మ్ కార్టెక్స్-X4 మిడ్-కోర్లు, నాలుగు ఆర్మ్ కార్టెక్స్-A720 ఎఫిషియెన్సీ కోర్‌లతో కలిపి మొత్తం ఎనిమిది కోర్లను కలిగి ఉంటుంది. LPDDR5X RAM, కృత్రిమ మేధస్సు (AI) ఫీచర్స్‌కు సపోర్ట్ చేసేలా దీనిని రూపొందించారు. అలాగే, iQOO Neo 10 Pro హ్యాండ్‌సెట్ రెక్టాంగ్‌లర్ డ్యూయల్ కెమెరా మాడ్యూల్ హౌసింగ్ స్క్వారీష్ కెమెరా సెన్సార్‌లతో పాటు 1.5కె రిజల్యూషన్ డిస్‌ప్లే, మెటల్ మిడిల్ ఫ్రేమ్‌లతో ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తుంది.
SoC ఇండిపెండెంట్ Q2 సూపర్‌కంప్యూటింగ్ చిప్‌తో అటాచ్ చేయబడుతుంది. 6,000 ఎమ్‌ఏహెచ్ కన్నా ఎక్కువగా బ్యాటరీ సామర్థ్యం ఉండే అవకాశం ఉంది. కంపెనీ తన రాబోయే స్మార్ట్ ఫోన్ బ్లూ క్రిస్టల్ చిప్ టెక్నాలజీ స్టాక్‌ను ఉపయోగిస్తుందని గట్టిగా ప్రచారం చేస్తోంది. ఇది తక్కువ మొత్తంలో పవర్ వినియోగంతో అధిక పర్ఫామెన్స్‌ను అందిస్తుందని చెబుతోంది. ఇంకా, ఇది ఎక్కువ కాలం మన్నికతోపాటు వేగవంతమైన ఛార్జింగ్ కోసం బ్లూ వోల్ట్ టెక్నాలజీని కూడా అందిచినట్లు కంపెనీ వెల్లడించింది. iQOO Neo 10 Pro మోడల్ BlueLM AI మోడల్ సహకారంతో AI ఫీచర్లను ప్రభావితం చేసేలా రూపొందించారు. ఈ సిరీస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాంటే మాత్రం నవంబర్ 29 వరకూ వేచిచూడాల్సిందే.
ప్రకటన
ప్రకటన
Hogwarts Legacy Has Sold 40 Million Copies, Warner Bros. Games Announces
Infinix Xpad Edge Launched With 13.2-Inch Display, 8,000mAh Battery: Price, Specifications