Photo Credit: iQOO
చైనా మొబైల్ మార్కెట్‌లోకి త్వరలోనే iQOO Neo 10 సిరీస్ లాంచ్ కాబోతోంది. ఈ రాబోయే లైనప్‌కు సంబంధించిన వివరాలు గత కొన్ని వారాలుగా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఆ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఈ సిరీస్ విడుదల అంశాన్ని ధృవీకరించారు. అయితే లాంచ్‌కు సంబంధించిన ఖచ్చితమైన తేదీని వెల్లడించలేదు. ఈ సిరీస్‌లో బేస్ మోడల్స్ iQOO Neo 10, iQOO Neo 10 Proలు ఉంటాయి. అలాగే, గత ఏడాది డిసెంబర్‌లో చైనాలో లాంచ్ చేసిన iQOO Neo 9, iQOO Neo 9 ప్రోల ఈ లైనప్ మార్కెట్‌లో మంచి స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. తాజాగా iQOO నుంచి వచ్చే నెలలో iQOO 13ని భారత్‌లో లాంచ్ చేసేందుకు కంపెనీ సిద్ధంగా ఉంది. iQOO Neo 10 సిరీస్ లాంచ్‌కు సంబంధించిన పలు కీలక అంశాలను ఒక్కసారి పరిశీలిద్దాం!
iQOO Neo 10 సిరీస్ లాంచ్ కాబోతున్నట్లు iQOO Neo ప్రోడక్ట్ మేనేజర్ Weibo పోస్ట్‌లో అధికారికంగా ధృవీకరించారు. అయితే, మోనికర్ మినహా ఇతర వివరాలు వెల్లడించలేదు. iQOO Neo 10 సిరీస్ నవంబర్‌లో చైనాలో పరిచయం కావచ్చని ఇటీవల ఆన్‌లైన్‌లో బహిర్గతం అయ్యింది. దీనిని బలపరిచేలా తాము దాదాపు నెల మధ్యలో ఉన్నందున, ఈ సిరీస్ లాంచ్ నెల చివరిలో జరిగేలా చూస్తున్నామని మేనేజర్ తెలిపారు. దీని ప్రకారం.. అధికారిక లాంచ్ తేదీ ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ బేస్ మోడల్ iQOO Neo 10 స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌తో రావచ్చని అంచనా. అలాగే, ప్రో వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌తో వస్తుందని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోన్‌లు 100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయని భావిస్తున్నారు. అలాగే, ఈ సిరీస్ మొబైల్స్ 6,000mAh భారీ బ్యాటరీ, నేరో బెజెల్స్‌తో 1.5K ఫ్లాట్ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారంలో ఉంది. అలాగే, iQOO Neo 10 సిరీస్ హ్యాండ్‌సెట్‌లు మెటల్ మిడిల్ ఫ్రేమ్‌తో వస్తాయని భావిస్తున్నారు. ఇవి iQOO Neo 9 సిరీస్‌లో వచ్చిన ప్లాస్టిక్ ఫ్రేమ్‌లకు అప్‌గ్రేడ్ వెర్షన్‌లుగా చెబుతున్నారు.
గతంలో వచ్చిన iQOO Neo 9 స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. అయితే iQOO Neo 9 ప్రోలో మాత్రం MediaTek డైమెన్సిటీ 9300 ప్రాసెసర్ ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌లు 20W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో ఒక్కొక్కటి 5,160mAh బ్యాటరీలతో లభిస్తున్నాయి. ఫోన్‌లు 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేలు, 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌లను కలిగి ఉన్నాయి. అయితే, ఈ సిరీస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాంటే మాత్రం కంపెనీ అధికారిక ప్రకటన విడుదల చేయాల్సిందే.
ప్రకటన
ప్రకటన