Photo Credit: iQOO
తాజాగా, సోషల్ మీడియాలో ఒక టిప్‌స్టర్ అంచనా ప్రకారం.. iQOO Neo 10R 5G భారత్‌లో ఆ కంపెనీ నుంచి వస్తోన్న తర్వాతి స్మార్ట్ ఫోన్‌గా విడుదల కావచ్చని చెబుతున్నారు. ఈ తాజా మోడల్ హ్యాండ్‌సెట్ రూ. 30,000 లోపు ధరకే లాంచ్ చేయొచ్చని కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ ఫోన్ iQOO Neo 10 సిరీస్‌లో భాగంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో Neo 10, Neo 10 Pro స్మార్ట్ ఫోన్‌లు ఉంటాయి. అయితే, ప్రస్తుతం ఇవి చైనాలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. iQOO Neo 10R 5G మోడల్‌ను మన దేశీయ మార్కెట్‌లో Qualcomm's స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్‌పాటు 12GB వరకు RAMతో విడుదుల చేసే అవకాశం ఉన్నట్లు అంచనా.
X (గతంలో ట్విట్టర్) వేదికగా పరాస్ గుగ్లానీ (@passionategeekz) అనే టిప్‌స్టర్ చేసిన ఓ పోస్టును బట్టీ, iQOO Neo 10R 5G మోడల్‌కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు బహిర్గతం అయ్యాయి. ఈ టిప్‌స్టర్ చెప్పిన దాని ప్రకారం, కొత్త iQOO మోడల్ స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరిలో మన దేశంలో లాంచ్ కావచ్చు. ఒకసారి లాంచ్ అయిన తర్వాత ఈ హ్యాండ్‌సెట్‌లు బ్లూ వైట్ స్లైస్, లూనార్ టైటానియం అనే రెండు రంగులలో అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
ఇక ఈ మోడల్ ధర విషయానికి వస్తే.. ఇది మోటరోలా ఎడ్జ్ 50 ప్రో, న్యూ పోకో X7 ప్రో వంటి వాటికి పోటీగా రూ. 30,000 లోపు ధరతో మార్కెట్‌లో అందుబాటులో ఉంటుందని అంచనా. అయితే, iQOO హ్యాండ్‌సెట్‌లు అన్ని వేరియంట్‌లు కూడా ఈ ధర పరిధిలోకి వస్తాయా లేదా అనే దానిపై మాత్రం ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. ఈ అంశంపై మార్కెట్ వర్గాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.
త్వరలోనే రాబోయే iQOO Neo 10R 5G స్మార్ట్ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అలాగే, ఈ ఫోన్ మోడల్ నంబర్ I2221 తో రావచ్చు. ఇది అండర్ ది హుడ్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ ద్వారా శక్తిని గ్రహిస్తుంది. అంతే కాదు, ఒకే స్టోరేజీ కెపాసిటీతో 8GB+256GB, 12GB+256GB రెండు RAM వేరియంట్‌లలో మార్కెట్‌లోకి అడుగుపెడుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ మొబైల్ కెమెరా విషయానికి వస్తే.. ఇది 50-మెగాపిక్సెల్ సోనీ LYT-600 సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ షూటర్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అలాగే, సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా అందించవచ్చని అంచనా వేస్తున్నారు. iQOO Neo 10R 5G హ్యాండ్‌సెట్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 6,400mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ప్రకటన
ప్రకటన