Photo Credit: iQOO
త్వరలోనే iQOO Z10 టర్బో, Z10 టర్బో ప్రోలను కంపెనీ ఆవిష్కరించే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ల ప్రోటోటైప్‌లను గీక్‌బెంచ్ బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమయ్యాయి. రాబోయే iQOO Z10 టర్బో ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8400 ప్రాసెసర్‌పై రన్ అవుతున్నట్లు చూపబడింది. అయితే, iQOO Z10 టర్బో హ్యాండ్‌సెట్ ప్రో మాత్రం స్నాప్‌డ్రాగన్ 8s ప్రాసెసర్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ జాబితాలో వీటికి సంబంధించిన ప్రాసెసర్‌ల పనితీరు, కోర్ కాన్ఫిగరేషన్ వివరాలను పరిశీలించవచ్చు. iQOOకు రాబోయే రెండు హ్యాండ్‌సెట్‌లు మరింత ఆదరణను చేకూరుస్తాయని భావిస్తున్నారు.
Geekbenchలో V2452A, V2453A మోడల్ నంబర్లతో రెండు Vivo స్మార్ట్ ఫోన్‌లను MySmartPrice గుర్తించింది. మొదటిది iQOO Z10 స్మార్ట్ ఫోన్ టర్బోతో అటాచ్ చేయబడిందని, రెండోది Z10 టర్బో ప్రోకు చెందినదని చెబుతున్నారు. అలాగే, V2452A లిస్ట్ సింగిల్-కోర్‌లో 1,593 పాయింట్లు, మల్టీ-కోర్ పరీక్షలలో 6,455 పాయింట్ల స్కోర్‌ను సూచిస్తోంది. ఈ స్కోర్‌లు మార్కెట్ వర్గాల అంచనాలకు మించి ఉన్నట్లు ప్రచారంలో ఉంది.
రాబోయే ఈ ఫోన్‌లో 2.10GHz బేస్ ఫ్రీక్వెన్సీతో ఆక్టా-కోర్ ప్రాసెసర్, 3.0GHz వద్ద మూడు కోర్లు, 3.25GHz వేగంతో ప్రైమ్ CPU కోర్ ఉంటుందని ఇది వెల్లడిస్తోంది. అలాగే, ఈ CPU వేగం MediaTek డైమెన్సిటీ 8400 ప్రాసెసర్‌తో సమానంగా ఉన్నట్లు సూచిస్తోంది. రాబోయే మోడల్ 12GB RAM, Android 15ని సూచిస్తున్నాయి. అయితే, గత మోడల్స్‌తో పోల్చి చూసినప్పుడు ఈ కాన్ఫిగరేషన్ అప్‌డేటెడ్‌గా కనిపిస్తున్నాయి.
మోడల్ నంబర్ V2453A ఉన్న హ్యాండ్‌సెట్ సింగిల్-కోర్‌లో 1,960 పాయింట్లు, మల్టీ-కోర్ పరీక్షల్లో 5,764 పాయింట్లు సాధించినట్లు కనిపిస్తోంది. ఈ లిస్ట్ ఆండ్రాయిడ్ 15, 12GB RAMని సూచిస్తోంది. అలాగే, ఈ పరికరం సన్ అనే కోడ్‌నేమ్ ఉన్న మదర్ బోర్డ్, వాల్ట్ అనే కోడ్‌నేమ్ ఉన్న గవర్నర్, అడ్రినో 825 GPUతో కనిపిస్తోంది. ఇది 3.21GHz వద్ద రన్ అవుతోన్న ప్రైమ్ కోర్, 3.01GHz వద్ద మూడు కోర్లు, 2.80GHz వద్ద రెండు కోర్లు, 2.20GHz వద్ద రెండు కోర్లను కలిగి ఉంది. అంతేకాదు, ఈ CPU ఫ్రీక్వెన్సీలు స్నాప్‌డ్రాగన్ 8s ఎలైట్ ప్రాసెసర్‌తో అటాచ్ చేయబడి ఉన్నట్లు చెబుతున్నారు.
స్నాప్‌డ్రాగన్ 8s ఎలైట్ కాన్ఫిగరేషన్ గత సంవత్సరం వచ్చిన స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌తో సమానంగా కనిపిస్తోంది. గత ఏడాది వచ్చిన స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్‌కు కొనసాగింపుగా దీనిని 2025 మొదటి త్రైమాసికంలో ప్రకటించబడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది సాధారణ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ టోన్-డౌన్ వెర్షన్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదని అంచనా వేస్తున్నాయి. Xiaomi Civi 5 స్నాప్‌డ్రాగన్ 8s ఎలైట్ ప్రాసెసర్‌తో మొదటి హ్యాండ్‌సెట్‌గా పరిచయం కావచ్చన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన