Photo Credit: Itel
ఐటెల్ A95 5G నలుపు, బంగారం మరియు పుదీనా నీలం రంగు ఎంపికలలో వస్తుంది
భారత్‌లో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తోపాటు 6GB వరకూ RAM తో అటాచ్ చేయబడి ఉన్న Itel A95 5G స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ లాంఛ్ చేసింది. ఇది ఆండ్రాయిడ్ 14తో అందించబడుతోంది. అలాగే, ఈ హ్యాండ్‌సెట్ 5000mAh బ్యాటరీతో వస్తోంది. ఇందులో వాయిస్ అసిస్టెంట్‌తో సహా అనేక ఏఐ-ఆధారిత ఫీచర్స్‌కు సపోర్ట్ చేసే ఫీచర్స్‌ను జోడించారు. దీనిని 50-మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరా, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో రూపొందించారు. అలాగే, దుమ్ము, స్ప్లాష్ నియంత్రణకు IP54 రేటింగ్‌ను కలిగి ఉంటుంది. ఇది మూడు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి రానుంది.స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఆప్షన్,4GB + 128GB ఆప్షన్ Itel A95 5G ఫోన్ ధర మన దేశంలో రూ. 9,599గా నిర్ణయించారు. అలాగే, 6GB + 128GB వేరియంట్ ధర రూ. 9,999 అని కంపెనీ ఓ ప్రతికా ప్రకటన ద్వారా వెల్లడించింది. బ్లాక్, గోల్డ్, మింట్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో మార్కెట్‌లో లభించనుంది. ఈ హ్యాండ్‌సెట్ వంద రోజుల ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఆప్షన్‌లో అందుబాటులోకి రానుంది. అయితే, ఎప్పటినుంచి ఫోన్ కొనుగోలుకు అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.
ఈ కొత్త Itel A95 5G హ్యాండ్‌సెట్ పాండా గ్లాస్ ప్రొటక్షన్‌తో 6.67-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. గత మోడల్స్‌తో పోల్చితే ఇది మరింత ధృడంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. అలాగే, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అటాచ్ చేయబడింది. స్టోరేజీ సామర్థ్యానికి అనుగుణంగా దీనిని రూపొందించినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ పై రన్ అవుతుంది.
కంపెనీ ఐదేళ్ల ఫ్లూయెన్సీ ప్రామిస్ తో Itel A95 5G స్మార్ట్ ఫోన్ వస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇది కంపెనీ ఏఐ వాయిస్ అసిస్టెంట్, ఐవానాకు సపోర్ట్ చేయడంతోపాటు ఆస్క్ ఏఐ లాంటి ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అలాగే, వినియోగదారులకు కంటెంట్‌ను డ్రాఫ్ట్ చేసేందుకు, సమాచారాన్ని సమరైజ్ చేసేందుకు, వివిధ సందర్భాల కోసం మెసేజ్‌లను మంచిగా ట్యూన్ చేసేందుకు సహాయపడుతుంది. ఇది డైనమిక్ బార్ ఫీచర్‌కు సపోర్ట్ చేస్తుంది.
ఈ హ్యాండ్‌సెట్ కెమెరా విషయానికి వస్తే.. దీనికి 50-మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరా, సెల్ఫీలు- వీడియో కాల్స్ చేసేందుకు వీలుగా ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ కెమెరా అందించారు. 2K వీడియో రికార్డింగ్, డ్యూయల్ వీడియో క్యాప్చర్, వ్లాగ్ మోడ్ లాంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. సెక్యూరిటీ విషయానికి వస్తే.. ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తో వస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ IP54 డస్ట్, స్ప్లాష్-రెసిస్టెంట్ రేటింగ్‌తో ఉంది. ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 7.8mm ప్రొఫైల్ కూడా ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన