గతంలో విడుదలైన Lava Shark 5Gతో పోలిస్తే ఈ కొత్త మోడల్ డిస్‌ప్లేలో మెరుగుదలలు ఉన్నాయి.
Photo Credit: Lava Mobiles
కంపెనీ ప్రకారం, హ్యాండ్‌సెట్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది
Lava Shark 2 త్వరలో భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ కానుంది. గతంలో విడుదలైన Lava Shark 5Gకి సక్సెసర్‌గా రానున్న ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ గురించి కంపెనీ ఇప్పటికే కొన్ని ముఖ్యమైన వివరాలను వెల్లడించింది. తాజాగా, ఫోన్ డిస్‌ప్లే స్పెసిఫికేషన్లు కూడా బయటపడ్డాయి. కంపెనీ ఎక్స్ లో షేర్ చేసిన సమాచారం ప్రకారం, Lava Shark 2లో 6.75-అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. ఇది HD+ రిజల్యూషన్తో పాటు 120Hz రిఫ్రెష్‌రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లేలో సెంటర్‌లో హోల్-పంచ్ కట్‌అవుట్ ఉండి, సెల్ఫీ కెమెరా కోసం ప్రత్యేక స్థానం కల్పించబడింది.గతంలో విడుదలైన Lava Shark 5Gతో పోలిస్తే ఈ కొత్త మోడల్ డిస్‌ప్లేలో మెరుగుదలలు ఉన్నాయి. పాత మోడల్‌లో 90Hz రిఫ్రెష్‌రేట్ మాత్రమే ఉండగా, కొత్త Lava Shark 2లో 120Hz రిఫ్రెష్‌రేట్ లభిస్తోంది. ఇది యూజర్‌కి మరింత స్మూత్ స్క్రోలింగ్ మరియు గేమింగ్ అనుభవాన్ని అందించనుంది.
Lava ఇప్పటికే ఈ ఫోన్ డిజైన్‌ను కూడా టీజ్ చేసింది. ఫోన్ వెనుక భాగంలో గ్లాసీ ఫినిష్తో ఆకర్షణీయమైన లుక్ కలిగి ఉంటుంది. టాప్ లెఫ్ట్ కార్నర్ లో స్క్వేర్ కెమెరా మాడ్యూల్ ఉండగా, క్రింద భాగంలో Lava బ్రాండింగ్ కనిపిస్తుంది. ఈ కెమెరా మాడ్యూల్ డిజైన్ Lava Bold N1 Pro మోడల్‌లా ఉంటుంది. కంపెనీ రివీల్ వివరాల ప్రకారం, ఇందులో 50MP AI ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంటుంది.
ఫోన్ ఎడమ వైపున సిమ్ ట్రే స్లాట్ ఉండగా, కుడి వైపున పవర్ మరియు వాల్యూమ్ బటన్లు ఉంటాయి. దిగువ భాగంలో స్పీకర్ గ్రిల్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, మరియు USB Type-C పోర్ట్ ఉన్నాయి.
Lava Shark 2 రెండు రంగుల్లో అందుబాటులోకి రానుంది...బ్లాక్ మరియు సిల్వర్ . ఫోన్ ఫ్రేమ్, వెనుక భాగం రంగుతో సమన్వయం కలిగినట్టుగా ఉంటుంది.
ప్రస్తుతం Lava Shark 2 యొక్క లాంచ్ తేదీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇప్పటికే వచ్చిన టీజర్ల ప్రకారం, ఈ ఫోన్ డిజైన్, డిస్‌ప్లే మరియు కెమెరా విభాగాల్లో గణనీయమైన అప్‌గ్రేడ్లతో మార్కెట్లోకి రావచ్చని అంచనా. భారతీయ వినియోగదారుల కోసం Lava ఈసారి మరింత ప్రీమియమ్ లుక్ మరియు మెరుగైన పనితీరును అందించడానికి సన్నద్ధమవుతోంది. ఒకసారి ఈ ఫోన్ అఫీషియల్ గా లాంచ్ అయిన తర్వాత కంప్లీట్ స్పెసిఫికేషన్లో అలాగే ఇతర డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది. LAVA బ్రాండ్ కి ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉండడం కలిసి వచ్చే అంశం.
ప్రకటన
ప్రకటన