హై-రెస్ ఆడియో, 12 గంటల బ్యాటరీ లైఫ్‌తో Vivo TWS 5 సిరీస్ ఇయర్ బడ్స్ విడుదలయ్యాయి.Vivo TWS 5 స్టాండర్డ్ మోడల్ ధర దాదాపు రూ.
Photo Credit: Vivo
Vivo TWS 5 సిరీస్ 5,500Hz అల్ట్రా-వైడ్‌బ్యాండ్ నాయిస్ తగ్గింపు, మూడు AI మైక్రోఫోన్లు, నానో-కోటింగ్, సిరామిక్ టంగ్‌స్టన్ డయాఫ్రాగమ్ కలిగి ఉన్నాయి
Vivo TWS 5 సిరీస్ ఇయర బడ్స్ సోమవారం చైనాలో ప్రారంభించబడింది. చైనీస్ టెక్ బ్రాండ్ నుంచి కొత్త నిజమైన వైర్‌లెస్ స్టీరియో (TWS) హెడ్‌సెట్ వివో X300, X300 Proలతో పాటు విడుదలైంది. ఈ సిరీస్‌లో గత సంవత్సరం Vivo TWS 4 మోడల్ మాదిరిగానే ప్రామాణిక వివో TWS 5, Vivo TWS 5 హై-ఫై ఉన్నాయి. రెండు మోడళ్లు 11mm డైనమిక్ డ్రైవర్లతో అమర్చబడి ఉంటాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్‌కు సపోర్ట్ చేస్తాయి. ఇది యాంబియంట్ శబ్దాన్ని 60dB వరకు తగ్గిస్తుంది. ఛార్జింగ్ కేసుతో సహా మొత్తం బ్యాటరీ జీవితాన్ని 48 గంటల వరకు ఇయర్‌ఫోన్‌లు అందిస్తాయని చెబుతున్నారు.
Vivo TWS 5 స్టాండర్డ్ మోడల్ ధర దాదాపు రూ. 4,500లు నిర్ణయించగా Vivo TWS 5 హై-ఫై వేరియంట్ ధర దాదాపు రూ. 5,500గా నిర్ణయించబడింది. ఈ వైర్‌లెస్ హెడ్‌సెట్ సింపుల్ వైట్, ప్యూర్ బ్లాక్, స్మోకీ పర్పుల్ రంగుల్లో, TWS 5 హై-ఫై డీప్ సీ బ్లూ, వైట్ కలర్స్‌లో అందుబాటులో ఉంటాయి.
Vivo తన కొత్త TWS హెడ్‌సెట్‌లు 16Hz-48kHz ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ రేటుతో 11mm డ్రైవర్లతో అమర్చబడి ఉన్నాయని తెలిపింది. హై-ఫై వేరియంట్ LDAC, LHDC, AAC, SBC, LC3 కోడెక్‌లకు సపోర్ట్ చేస్తుంది. అయితే ప్రామాణిక Vivo TWS 5 LDAC, AAC, SBC, LC3audio కోడెక్‌లకు సపోర్ట్ చేసతుంది. అవి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)ని కలిగి ఉంటాయి. అలాగే ఇది యాంబియంట్ నాయిస్‌ను 60dB వరకు తగ్గించే ఛాన్స్ ఉంది.
దీంతో పాటు గేమింగ్ కోసం Vivo TWS 5 సిరీస్ 42ms లేటెన్సీ రేటును కలగి ఉంది. ఈ ఇయర్‌ఫోన్‌లు హై-రెస్ ఆడియో సర్టిఫికేషన్‌ను కలిగి ఉన్నాయి. డీప్‌ఎక్స్ 4.0 స్టీరియో సౌండ్‌ను అందిస్తాయి. ఇవి 10 మీటర్ల ఆపరేటింగ్ రేంజ్‌తో బ్లూటూత్ 5.4 కనెక్టివిటీని అందిస్తాయి. ఇవి IP54-సర్టిఫైడ్ డస్ట్ మరియు స్ప్లాష్-రెసిస్టెంట్ బిల్డ్‌ను కలిగి ఉంటాయి.
Vivo TWS 5 సిరీస్ 5,500Hz అల్ట్రా-వైడ్‌బ్యాండ్ నాయిస్‌ని గణనీయంగా తగ్గిస్తుంది. ఇవి AI- ఆధారిత కాల్ నాయిస్ తగ్గింపు కోసం మూడు మైక్రోఫోన్‌లను కలిగి ఉంటాయి. అవి నానో-కోటింగ్‌తో సెకండ్ జనరేషన్ సిరామిక్ టంగ్‌స్టన్ అకౌస్టిక్ డయాఫ్రాగమ్‌తో అమర్చబడి ఉంటాయి.
Vivo TWS 5, TWS 5 హై-ఫై వెర్షన్ రెండూ బహుళ పరికరాల్లో ట్రిపుల్ కనెక్షన్‌లకు మద్దతు ఇస్తాయి. వాటిలో చైనీస్, ఇంగ్లీష్, జపనీస్, కొరియన్, ఫ్రెంచ్, థాయ్, ఇతర భాషల వాయిస్ అనువాదం కోసం స్మార్ట్ ట్రాన్స్‌లేట్ ఫీచర్ కూడా ఉంది. అవి టచ్ కంట్రోల్‌లను కలిగి ఉంటాయి. ఇవి వినియోగదారులు కాల్‌లకు సమాధానం ఇవ్వడానికి, తిరస్కరించడానికి, ప్లేజాబితాలను ఎంచుకోవడానికి అనుమతిస్తాయి.
ప్రకటన
ప్రకటన