కెమెరా పరంగా, Nothing Phone 3aలో మూడు వెనుక కెమెరాలు ఉన్నాయి

లీక్ అయిన రిపోర్టుల ప్రకారం, Nothing Phone 3a Lite ఒకే వేరియంట్‌లో 8GB RAM + 128GB స్టోరేజ్ కాంబినేషన్‌లో రావచ్చని తెలుస్తోంది.

కెమెరా పరంగా, Nothing Phone 3aలో మూడు వెనుక కెమెరాలు ఉన్నాయి

Photo Credit: Nothing

మార్చిలో ఫోన్ 3a (చిత్రంలో) ఏమీ లాంచ్ కాలేదు

ముఖ్యాంశాలు
  • Nothing Phone 3a Lite మొబైల్ తీసుకురానున్న నథింగ్ కంపెనీ
  • 50MP ట్రిపుల్ కెమెరాతో బెస్ట్ ఫోటోగ్రఫీ అనుభవం
  • 5,000mAh బ్యాటరీ, 50W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్
ప్రకటన

నథింగ్ కంపెనీ తమ ఫోన్ 3 సిరీస్‌ను విస్తరించేందుకు సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం, సంస్థ Nothing Phone 3a Lite పేరుతో మరో కొత్త మోడల్‌పై పని చేస్తోంది. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న Phone 3a కంటే మరింత చవకగా ఉండబోతోందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. అధికారిక వివరాలు ఇంకా వెలువడనప్పటికీ, ఈ ఫోన్ కంపెనీ స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో Phone 3a కంటే తక్కువ ధర శ్రేణిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

లీక్ అయిన రిపోర్టుల ప్రకారం, Nothing Phone 3a Lite ఒకే వేరియంట్‌లో 8GB RAM + 128GB స్టోరేజ్ కాంబినేషన్‌లో రావచ్చని తెలుస్తోంది. కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే, నథింగ్ ప్రత్యేకతగా మారిన బ్లాక్ మరియు వైట్ రంగులలో ఇది లభించనుంది. అయితే ఇతర మార్కెట్లలో కంపెనీ మరిన్ని కలర్ వేరియంట్లు లేదా అధిక స్టోరేజ్ వెర్షన్‌లను ప్రవేశపెట్టే అవకాశముందని కూడా అంచనా. ఈ ఫోన్ భారతదేశం సహా గ్లోబల్ మార్కెట్లలో ఈ ఏడాది చివరినాటికి విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

ప్రస్తుతం ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లు బయటకు రాలేదు. కానీ ఇది Phone 3a కంటే తక్కువ ధరలో అందుబాటులోకి రానుండటంతో, ఫీచర్ల పరంగా కూడా కొంత తగ్గింపు ఉండవచ్చని అంచనా. Nothing Phone 3a స్పెసిఫికేషన్‌లను తీసుకుంటే 6.7 అంగుళాల ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది, 1,080 x 2,392 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, మరియు 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది.

ఇది Snapdragon 7s Gen 3 ప్రాసెసర్ ద్వారా నడుస్తుంది, దీనికి గరిష్టంగా 12GB RAM మరియు 256GB స్టోరేజ్ సపోర్ట్ ఉంది. Android 15 బేస్డ్ NothingOS 3.1పై ఈ ఫోన్ పనిచేస్తుంది. కంపెనీ మూడు సంవత్సరాల OS అప్‌డేట్స్, ఆరు సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లు అందించనున్నట్లు తెలిపింది.

కెమెరా పరంగా, Nothing Phone 3aలో మూడు వెనుక కెమెరాలు ఉన్నాయి. 50MP Samsung ప్రధాన సెన్సార్ (1/1.57-inch), 8MP అల్ట్రా వైడ్ కెమెరా, మరియు 50MP Sony టెలిఫోటో లెన్స్ (1/2.74-inch). ఫ్రంట్‌లో 32MP కెమెరాతో సెల్ఫీలు మరియు వీడియో కాల్స్‌కి బాగా యూస్ అవుతుంది.

కనెక్టివిటీ విషయానికి వస్తే, ఇందులో 5G, 4G, Bluetooth 5.4, Wi-Fi, GPS, NFC (Google Pay సపోర్ట్‌తో) మరియు USB Type-C పోర్ట్ ఉన్నాయి. 5,000mAh బ్యాటరీతో పాటు 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందించబడింది.

మొత్తం మీద, Nothing Phone 3a Lite తక్కువ ధరలో అదే మినిమలిస్టిక్ డిజైన్, క్లీన UI, మరియు స్మార్ట్ ఫీచర్లను అందించేలా రూపుదిద్దుకుంటుందని భావిస్తున్నారు. ఫోన్ 3a కంటే కొద్దిగా సరసమైన ధరలో నథింగ్ అనుభవాన్ని కోరుకునే యూజర్లకు ఇది సరైన ఆప్షన్‌గా నిలిచే అవకాశం ఉంది.

Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. సరికొత్త ఫీచర్లతో Vivo TWS 5 సిరీస్ ఇయర బడ్స్, ధర, స్పెషికేషన్లు ఇక్కడ చూడండి
  2. ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఇందులో Ricoh GR Mode అనే ప్రత్యేక మోడ్‌ను కూడా అందించారు
  3. ఫోన్ ఇవి ఫోన్ లాంచ్ సమయంలో తక్కువగా లేకుండా Xiaomi 17 వంటి పర్ఫార్మెన్స్ ఇవ్వగలదని సూచిస్తున్నాయి
  4. నోట్‌బుల్ ఎల్‌ఎంలో నానా బనానా అప్డేట్.. ఇకపై మరింత సులభతరం
  5. ఫోన్ 7,000mAh పైగా సామర్థ్యం కలిగిన బ్యాటరీతో, వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది
  6. వెబ్ పేజ్ సమ్మరైజింగ్ కోసం అప్డేట్.. జెమినీలో కొత్త అప్డేట్ ఇదే
  7. ఫోన్ ఫోల్డ్ అయినప్పుడు దాని థిక్నెస్ 9.2mm, మరియు అన్‌ఫోల్డ్ చేసినప్పుడు 4.6mm ఉంటుంది
  8. ఆపిల్ టీవీలో ‘ఎఫ్ 1 ది మూవీ’.. ఈ కొత్త ఛేంజ్ చూశారా?
  9. 3 కలర్స్‌లో అదిరిపోయే హెడ్‌ఫోన్లు, సౌండ్ బై బోస్ టెక్నాలజీ, ఆడియో రికార్డింగ్ కోసం ఐదు మైక్రోఫోన్ సెటప్ వీటి ప్రత్యేకత
  10. కెమెరా పరంగా, Nothing Phone 3aలో మూడు వెనుక కెమెరాలు ఉన్నాయి
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »