ఫోన్ వెనుక భాగంలో మార్చుకోగలిగే కెమెరా మాడ్యూల్ ఉండనుంది.
Photo Credit: Realme
రియల్‌మీ GT 8 Proలో Ricoh GR సిరీస్ ఐదు టోన్లు — స్టాండర్డ్, పాజిటివ్, నెగటివ్, మోనోటోన్, బ్లాక్ & వైట్
రియల్‌మీ తాజాగా ప్రముఖ కెమెరా తయారీ సంస్థ రికో (Ricoh) తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా రాబోయే Realme GT 8 Pro స్మార్ట్‌ఫోన్‌లో రికో ఇమేజింగ్‌తో సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొత్త కెమెరా సిస్టమ్‌ను అందిస్తోంది. రికో యొక్క ప్రసిద్ధ GR సిరీస్ టెక్నాలజీ తొలిసారి మొబైల్ ఫోన్‌లో చేరబోతోందని కంపెనీ వెల్లడించింది. ఈ టెక్నాలజీతో GT 8 Pro మరింత అధునాతన ఫోటోగ్రఫీ అనుభవాన్ని అందించనుంది.
ఫోన్ వెనుక భాగంలో మార్చుకోగలిగే కెమెరా మాడ్యూల్ ఉండనుంది. దీని ప్రధాన ఆకర్షణగా 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా మరియు తాజా Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్ ఉంటాయి. రియల్‌మీ ప్రకారం, ఈ కొత్త కెమెరా వ్యవస్థ బెస్ట్ క్వాలిటీ ఫొటోస్ తీసేలా ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది. రికో GR ఆప్టికల్ ప్రమాణాలకు సరిపడే అల్ట్రా-హై ట్రాన్స్‌పరెన్సీ లెన్స్ గ్రూప్ ఉపయోగించబడింది, దీని వల్ల షాడోస్ తగ్గి, ఫోటోలు మరింత స్పష్టంగా రావచ్చు.
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఇందులో Ricoh GR Mode అనే ప్రత్యేక మోడ్‌ను కూడా అందించారు. ఇందులో వేగంగా ప్రారంభమయ్యే ఇంటర్‌ఫేస్, GR కెమెరాలకు ప్రత్యేకమైన షట్టర్ క్లిక్ సౌండ్, అలాగే Snap Mode ఫోకస్ ప్రీసెట్స్ ఉంటాయి. ఈ మోడ్‌లో రెండు ప్రధాన ఫోకల్ లెన్త్‌లు అందుబాటులో ఉంటాయి. 28mm వైడ్ స్ట్రీట్ షాట్స్ కోసం, 40mm క్లోజప్ డీటైల్డ్ ఫోటోల కోసం.
అంతేకాకుండా, రియల్‌మీ GT 8 Proలో Ricoh GR సిరీస్‌లోని ఐదు క్లాసిక్ టోన్లు అందుబాటులో ఉంటాయి. అవి స్టాండర్డ్, పాజిటివ్ ఫిలిం, నెగిటివ్ ఫిలిం, మోనోటోన్, హై కాంట్రస్ట్ బ్లాక్& వైట్ . వీటిని వినియోగదారులు కష్టమైసేడ్ టోన్ ఫీచర్ ద్వారా తమ స్టైల్‌కి తగ్గట్టు సవరించుకోవచ్చు. అదనంగా, GR-స్టైల్ వాటర్‌మార్క్స్, GR లేబుల్స్‌తో ప్రత్యేక ఆల్బమ్స్, అలాగే టోన్ సెట్టింగ్స్‌ను ఇతరులతో పంచుకునే ఆప్షన్ కూడా అందించనుంది.
టెక్నికల్ పరంగా చూస్తే, ఈ ఫోన్‌లో 2K 10-bit LTPO BOE ఫ్లాట్ OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, మరియు Snapdragon 8 Elite Gen 5 SoC ఉన్నాయి. ప్రధాన కెమెరాగా 50MP Sony LYT-808 సెన్సార్ (OISతో) మరియు 50MP Samsung JN5 అల్ట్రా వైడ్ లెన్స్ వచ్చే అవకాశముంది.
బ్యాటరీ పరంగా చూస్తే 7,000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుందని సమాచారం. అలాగే, ఇది IP69 రేటింగ్తో వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అందిస్తుంది. అదనంగా, ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, మెరుగైన హాప్టిక్ ఫీడ్‌బ్యాక్, మరియు అధిక నాణ్యత గల స్టీరియో స్పీకర్స్ కూడా లభించనున్నాయి.
డిజైన్ పరంగా, వినియోగదారులు కెమెరా ఐలాండ్ ఆకారాన్ని లేదా లుక్‌ను మార్చుకునే అవకాశం ఉంటుంది. రికో రూపొందించిన మూడు వేర్వేరు డిజైన్‌లు అందుబాటులో ఉంటాయని టీజర్లు సూచిస్తున్నాయి. వీటిని మార్చడానికి ప్రత్యేక సాధనాలు అవసరమవుతాయని కూడా తెలుస్తోంది.
మొత్తం మీద, Realme GT 8 Pro రియల్‌మీ స్మార్ట్‌ఫోన్‌లలో కొత్త దశను ప్రారంభించనుంది. ప్రొఫెషనల్ స్థాయి ఫోటోగ్రఫీ అనుభవాన్ని మొబైల్‌లో పొందాలనుకునే వినియోగదారులకు ఇది ఒక ఉత్తమ ఎంపికగా నిలిచే అవకాశం ఉంది.
ప్రకటన
ప్రకటన