Photo Credit: Samsung
దేశీయ మార్కెట్‌లోకి Samsung Galaxy F05 స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. తక్కువ ధరలో మంచి ఫీచర్స్ ఉన్న స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురు చూసేవారికి Samsung Galaxy F05 సరైన ఎంపిక అని చెప్పొచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 4GB RAMతో జత చేయబడిన ఆక్టా-కోర్ MediaTek Helio G85 ప్రాసెసర్‌తో వస్తుంది. అలాగే, 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 6.7-అంగుళాల HD+ స్క్రీన్‌ను అందించారు. 8-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌తో పాటు 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో దీనిని రూపొందించారు. ఇది ఒకే RAM, స్టోరేజీ కాన్ఫిగరేషన్‌లో ఈ నెల చివరిలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అలాగే, ఈ హ్యాండ్‌సెట్ రీబ్యాడ్జ్ చేయబడిన Samsung Galaxy M05 లేదా Samsung Galaxy A05ని పోలినట్లు కనిపిస్తుంది. మరెందుకు ఆలస్యం.. ఈ మోడల్ ధరతోపాటు స్పెసిఫికేషన్స్ చూసేద్దామా?!
ఇక మనదేశంలో Samsung Galaxy F05 ధర 4GB + 64GB వేరియంట్‌లో రూ. 7,999గా నిర్ణయించినట్లు కంపెనీ ఓ పత్రికా ప్రకటనలో ప్రకటించింది. దేశీయ మార్కెట్‌లో సెప్టెంబర్ 20 నుండి ఫ్లిప్‌కార్ట్, Samsung ఇండియా వెబ్‌సైట్‌తోపాటు ఎంపిక చేసుకున్న ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఫోన్ ట్విలైట్ బ్లూ కలర్‌వేలో ఆకర్షణీయమైన డిజైన్‌తో అందుబాటులోకి రానుంది. దీని లుక్ ఎంతో ట్రెండీగా ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ధర కూడా తక్కువగా ఉండడంతో ఇతర బడ్జెట్ ఫోన్‌లకు మంచి పోటీనిస్తుందని అంచనా వేస్తున్నాయి.
Samsung Galaxy F05 6.7-అంగుళాల HD+ స్క్రీన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 4GB RAM, 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజీతో జత చేయబడిన MediaTek Helio G85 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ఫోన్ 4GB వరకు అదనంగా RAM విస్తరణకు, మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకునేందుకు అవకాశం కల్పించారు. ఇది Android 14-ఆధారిత One UI 5తో రన్ చేయబడుతుంది. హ్యాండ్‌సెట్ రెండు OS అప్‌గ్రేడ్‌లు, నాలుగు సంవత్సరాల భద్రతా అప్‌గ్రేడ్‌లకు సపోర్ట్ చేస్తుందని కంపెనీ ప్రకటించింది.
ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తో..
Samsung Galaxy F05 కెమెరా విషయానికి వస్తే.. ఇందులో 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో సహా డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. దీనికి వాటర్‌డ్రాప్ నాచ్‌లో ఉంచబడిన 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. USB టైప్-C పోర్ట్ ద్వారా 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. భద్రత కోసం ఇది ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తో వస్తుంది. హ్యాండ్‌సెట్ వెనుక ప్యానెల్‌పై లెదర్ కవరింగ్‌ను అందించారు. మరి ఇంత తక్కువ ధరలో ఇన్ని ఫీచర్స్‌తో వస్తోన్న Samsung Galaxy F05 స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు సిద్ధంగా ఉండండి!
ప్రకటన
ప్రకటన