ఇప్పటికే మన దేశంలో 5G హ్యాండ్‌సెట్‌లకు మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, దేశీయ మార్కెట్‌లోకి త్వరలో Moto G45 5Gని లాంచ్ చేయబోతున్నట్లు ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ Motorola ప్రకటించింది. తన కంపెనీ హ్యాండ్‌సెట్ ప్రారంభ తేదీని కూడా అధికారికంగా ధృవీకరించింది. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ మైక్రోసైట్‌లో దీని డిజైతోపాటు రంగులను రిలీజ్ చేసింది. అంతేకాదు, రాబోయే స్మార్ట్‌ఫోన్ యొక్క కొన్ని ముఖ్యమైన ఫీచర్స్‌ను కూడా వెల్లడించింది. మరెందుకు ఆలస్యం.. త్వరలోనే దేశీయ మార్కెట్‌ను పలకరించబోతోన్న
Moto G45 5G హ్యాండ్‌సెట్ ఫీచర్స్‌తోపాటు లాంచింగ్ తేదీని కూడా చూసేద్దాం రండి!
ప్రీమియం వేగన్ లెదర్ డిజైన్..
Motorola కంపెనీ అధికారిక ప్రకటన ప్రకారం.. Moto G45 5G మనదేశంలో ఆగస్ట్ 21న మధ్యాహ్నం 12 గంటలకు IST లాంచ్ అవుతుందని ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ వెల్లడించింది. మైక్రోసైట్‌లో రిలీజ్ చేసిన దానిని బట్టీ, ఈ ఫోన్‌ను ప్రీమియం వేగన్ లెదర్ డిజైన్‌తో నీలం, ఆకుపచ్చ, మెజెంటా మొత్తం మూడు రంగులలో అందుబాటులోకి రానున్నట్లు స్పష్టమైంది. Moto G45 5G 50 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా LED ఫ్లాష్ యూనిట్‌తో పాటు నిలువుగా అమర్చబడిన రెండు వేర్వేరు, రౌండ్ కెమెరా స్లాట్‌లతో కనిపిస్తుంది. కుడిపైపున పవర్, వాల్యూమ్ బటన్‌లను అమర్చారు. దిగువ భాగంలో USB టైప్-C పోర్ట్, స్పీకర్ గ్రిల్‌తోపాటు 3.5mm ఆడియో జాక్‌తో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. మెమరీని మరింత పెంచుకునేలా..
అలాగే, స్లిమ్ బెజెల్స్‌తో 6.5 అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లే అమర్చారు. ముందు కెమెరా ప్యానెల్ పైభాగంలో సెన్సార్‌ను అమర్చేందుకు ప్రత్యేకంగా స్లాట్‌ను రూపొందించారు. హ్యాండ్‌సెట్ ఎడమ అంచు SIM ట్రే స్లాట్ రావడంతోపాటు అందులో మెమరీ కార్డ్ స్లాట్ కూడా అందించారు. ఈ స్లాట్ సహాయంతో మెమరీ సామర్థ్యాన్ని మరింత పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. 4500 mAh బ్యాటరీ సామర్థ్యంతో Moto G45 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి లాంచ్ కాబోతోంది. ఈ ఫోన్ Snapdragon 6s Gen 3 చిప్‌సెట్ ప్రాసెసర్‌పై పని చేయడంతోపాటు 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది.
అలాగే, Moto G45 5G మోడల్ హ్యాండ్‌సెట్ మనదేశంలో ఈ సంవత్సరం జనవరిలో లాంచ్ చేసిన Moto G34 5G యొక్క అప్‌డేటెడ్ వెర్షన్‌గా విడుదల కాబోతున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కనెక్ట్ అయ్యేందుకు యాక్సెస్..
ఈ హ్యాండ్‌సెట్ 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ముందే చెప్పినట్లు 6.5- అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఫోన్ Snapdragon 6s Gen 3 ప్రాసెసర్‌తో 8GB RAM, 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో అందుబాటులో ఉన్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. Moto G45 5G ప్రారంభించిన తర్వాత RAM, స్టోరేజ్ ఇతర వేరియంట్‌లలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆప్టిక్స్ కోసం 50-మెగాపిక్సెల్ క్వాడ్ పిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను పొందుపరిచారు. ఇది Motorola యొక్క Smart Connect ఫీచర్‌కు మద్దతిస్తుంది. ఇది ఫోన్‌లతోపాటు ట్యాబ్‌లు, పీసీలు వంటి ఇతర పరికరాలతో సులభంగా కనెక్ట్ అయ్యేందుకు యాక్సెస్ ఇస్తుంది. ఈ మోడల్ ధరపై అధికారిక ప్రకటన లేనప్పటికీ సుమారు రూ. 15 వేల రేంజ్‌లో మార్కెట్‌లోకి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ మార్కెట్ వర్గాల ఊహాగానాలు నిజమైతే మాత్రం ఇది ముమ్మాటికీ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌గా కొనుగోలుదారులను ఆకట్టుకోవడం ఖాయంగా భావిస్తున్నారు. మరి ఆ పూర్తి వివరాలు తెలియాలంటే ఆగస్టు 21 వరకూ ఆగాల్సిందే!