సరికొత్త స్మార్ట్‌ఫోన్, ఆగస్ట్ 6 నుంచి సేల్స్, తక్కువ ధరకే మంచి ఫీచర్స్‌తో మొబైల్

Moto G86 పవర్ 5G అనే కొత్త మోడల్ మొబైల్ త్వరలోనే సేల్స్, దీని ధర, ఫీచర్స్, ఇతర వివరాలన్నీ తెలుసుకోండి.

సరికొత్త స్మార్ట్‌ఫోన్, ఆగస్ట్ 6 నుంచి సేల్స్, తక్కువ ధరకే మంచి ఫీచర్స్‌తో మొబైల్

Photo Credit: Motorola

Moto G86 పవర్ 5G కాస్మిక్ స్కై, గోల్డెన్ సైప్రస్ మరియు స్పెల్‌బౌండ్ షేడ్స్‌లో అమ్మకానికి ఉంది

ముఖ్యాంశాలు
  • Moto G86 పవర్ 5G 32-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ ఫోన్
  • దుమ్ము, నీటిని ఎదుర్కొనేలా IP68, IP69 సర్టిఫికెషన్
  • 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ దీని ప్రత్యేకం
ప్రకటన

స్మార్ట్ ఫోన్ కొనే ఆలోచనలో ఉన్నారా? అలాంటి వారికి ఒక గుడ్‌న్యూస్. మోటోరోలా కంపెనీ నుంచి సరికొత్త మొబైల్ మార్కెట్‌లోకి వచ్చింది. అధునాతనమైన ఫీచర్లు, అబ్బురపరిచే ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. బ్యాటరీ, డిస్‌ప్లే, కెమెరా ఇలా అన్నింట్లో అప్‌గ్రేడ్ లెవల్‌తో Moto G86 పవర్ 5G స్మార్ట్ ఫోన్ అధికారికంగా లాంఛ్ అయింది. పైగా ఇది బడ్జెట్ ధరకే అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌కి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ అందించాం.Moto G86 Power 5G స్మార్ట్‌ఫోన్ 6,720mAh బ్యాటరీని కలిగి ఉంది. పైగా ఇది MediaTek Dimensity 7400 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. అంతేకాదు 50 మెగాపిక్సెల్ Sony LYTIA-600 సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ దుమ్ము, నీటిని ఎదుర్కొనేలా IP68, IP69 సర్టిఫికెషన్లతో వస్తుంది. దీంతోపాటు మిలిటరీ-గ్రేడ్ MIL-STD-810H సర్టిఫికెషన్‌ను కూడా పొందుతుందని చెప్పబడింది. గొరిల్లా గ్లాస్ 7i డిస్‌ప్లే, వీగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్‌లతో మూడు పాంటోన్-సర్టిఫైడ్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.

భారతదేశంలో Moto G86 Power 5G ధర ఎంత? ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుంది?

8GB + 128GB RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ఉన్న Moto G86 పవర్ 5G ఫోన్ ధర రూ.17,999లు. అంటే బడ్జెట్ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ ఆగస్టు 6వ తేదీ నుంచి మోటరోలా ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ 3 కలర్స్‌లో ఉండనుంది. కాస్మిక్ స్కై, గోల్డెన్ సైప్రస్, స్పెల్‌బౌండ్ రంగులలో పొందవచ్చు.

Moto G86 పవర్ 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

Moto G86 పవర్ 5G స్మార్ట్‌ఫోన్‌లో మంచి అప్‌గ్రేడింగ్ ఫీచర్లు ఉన్నాయి. యూజర్ల డిమాండ్‌ను బట్టి కెమెరా క్వాలిటీ, డిస్‌ప్లే, ప్రొటక్షన్, బ్యాటరీ ఛార్జ్ విషయంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. కొనుగోలుదారులు ఏ మాత్రం అసంతృప్తి చెందకుండా ఈ ఫోన్‌ డిజైనింగ్ ఉంటుంది. ఫోన్ 6.7 అంగుళాల సూపర్ HD (1,220x2,712 పిక్సెల్స్) AMOLED స్క్రీన్‌, 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌‌ని కలిగి ఉంది. అలాగే గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌తో ఉంది. డిస్‌ప్లే విషయానికొస్తే HDR10+కి మద్దతు ఇస్తుంది. తక్కువ బ్లూ లైట్, తక్కువ మోషన్ బ్లర్ ప్రమాణాలకు SGS సర్టిఫికేషన్‌లను కూడా కలిగి ఉంది.

Moto G86 పవర్ 4nm ఆక్టా-కోర్ MediaTek Dimensity 7400 SoCతో, 8GB LPDDR4X RAM, 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో జత చేయబడింది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 1TB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UI అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో రన్ అవుతుంది.

ఇక కెమెరా విషయానికొస్తే Moto G86 పవర్ 5Gలో 50-మెగాపిక్సెల్ Sony LYT-600 ప్రైమరీ సెన్సార్, మాక్రో మోడ్‌తో కూడిన 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్, వెనుక భాగంలో 3-in-1 ఫ్లికర్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం హ్యాండ్‌సెట్ ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ మొబైల్ డాల్బీ ఆడియో సపోర్ట్ ఉన్న డ్యూయల్ స్టీరియో స్పీకర్ సిస్టమ్, హై-రెస్ ఆడియో సర్టిఫికేషన్‌ను కూడా కలిగి ఉంది.

Moto G86 పవర్ 5G 33W టర్బోపవర్ సపోర్ట్‌తో 6,720mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో డ్యూయల్ నానో సిమ్, 5G, 4G, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. బయోమెట్రిక్ ప్రామాణీకరణ కోసం ఇది ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో అమర్చబడి ఉంది. అదేవిధంగా MIL-STD-810H-సర్టిఫైడ్ మన్నికైన బిల్డ్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 161.21x74.74x8.6mm సైజులో 198 గ్రాముల బరువుతో ఉంటుంది.

Comments
Facebookలో షేర్‌ Gadgets360 Twitter Shareట్వీట్ షేర్ Snapchat రెడ్డిట్ వ్యాఖ్యానించండి

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. K13 టర్బో బరువు 207 గ్రాములు, ప్రో మోడల్ బరువు 208 గ్రాములు ఉన్నాయి
  2. Lava Blaze AMOLED 2 5G కొత్త మోడల్ ధర ఇదే.. స్టోరేజీ, ధర ఎంతంటే?
  3. అధునాతమైన స్మార్ట్‌ఫోన్, అత్యంత సన్నని, తేలికైన 5G హ్యాండ్ సెట్, 3 రోజుల్లో సేల్స్ ప్రారంభం
  4. 2025 పనాసోనిక్ P-సిరీస్ టీవీల ధరలు రూ.17,990 నుండి ప్రారంభమై రూ.3,99,990 వరకు ఉన్నాయి.
  5. 25W ఫాస్ట్ చార్జింగ్, 5G, డ్యూయల్ VoLTE, Wi-Fi 5, BT 5.3, USB-C, 192g, 7.5mm తేలికైన ఫోన్
  6. Lava Blaze AMOLED 2 5G లాంఛింగ్ కంటే ముందే బయటకు వచ్చిన ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
  7. ఇదిలా ఉంటే, K13 టర్బో మోడల్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ ఉంటుంది. ఇది మల్టీకోర్ పనితీరులో 41 శాతం
  8. టరోలా నుంచి లగ్జరీ ఫోన్, ఇయర్ బడ్స్‌తో పాటు మోటరోలా రేజర్ 60 ఫ్లిప్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్, కస్టమర్లకు స్పెష
  9. Vivo నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్, బడ్జెట్ ధరకే మొబైల్, పైగా 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్
  10. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ లో భాగంగా మీ పాత ల్యాప్‌టాప్ ఇచ్చి కొత్త లాప్టాప్ తీసుకుంటే మరింత తగ్గింపు పొందవచ్చు. ఇక నో
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »