ఫోన్ 8GB LPDDR4x RAMతో పాటు అందుబాటులో ఉంటుంది. స్టోరేజ్ పరంగా, వినియోగదారులకు 128GB మరియు 256GB వేరియంట్లు లభిస్తాయి. ఇంకా స్టోరేజ్ అవసరాల కోసం MicroSD కార్డ్ స్లాట్ ద్వారా 1TB వరకు విస్తరించుకునే అవకాశం ఉంది.
Photo Credit: Motorola
మోటో G86 పవర్ గోల్డెన్ సైప్రస్ (చిత్రంలో) తో సహా మూడు రంగులలో వస్తుంది
మోటరోలా తన నూతన మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ మోటో G86 పవర్ను భారత మార్కెట్‌లో జూలై 30న విడుదల చేయనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ ఫోన్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్, మరియు పవర్‌ఫుల్ బ్యాటరీ లాంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ఇది 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందిస్తుంది. మోటరోలా అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం, మోటో G86 పవర్ ఫోన్‌ను భారత్‌లో జూలై 30, 2025న విడుదల చేయనున్నారు. ఈ ఫోన్‌ను వినియోగదారులు ఫ్లిప్ కార్ట్ ద్వారా మరియు మోటరోలా అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇది కాస్మిక్ స్కై, గోల్డెన్ సైప్రస్, మరియు స్పెల్‌బౌండ్ వంటి 3 కలర్ వేరియంట్లలో లభిస్తుంది.
ఈ ఫోన్ 8GB LPDDR4x RAMతో పాటు అందుబాటులో ఉంటుంది. స్టోరేజ్ పరంగా, వినియోగదారులకు 128GB మరియు 256GB వేరియంట్లు లభిస్తాయి. ఇంకా స్టోరేజ్ అవసరాల కోసం MicroSD కార్డ్ స్లాట్ ద్వారా 1TB వరకు విస్తరించుకునే అవకాశం ఉంది. ఎక్కువగా పర్సనల్, డాక్యుమెంట్లను స్టోరేజ్ చేసుకోవడానికి ఇది మంచి ఆప్షన్ గా నిలుస్తుంది.
ఫోన్ డిస్‌ప్లే విషయానికి వస్తే, ఇది 6.7 అంగుళాల AMOLED స్క్రీన్తో వస్తుంది. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీకు బ్రైట్‌నెస్, మరియు గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్స్ తో ఈ ఫోను చాలా ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా మరియు ఫ్లికర్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా సెట్ చేశారు.
మోటో G86 పవర్ ఫోన్‌లో 6,720mAh భారీ బ్యాటరీ ఉంటుంది. ఇది 33W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది . ఎక్కువసేపు ఫోన్ యూస్ చేసిన కూడా ఎటువంటి ఆందోళన చెందకుండా ఫాస్ట్గా చార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ ఫోన్ IP68 మరియు IP69 రేటింగ్స్ తో వస్తుంది. ఒకవేళ ఈ ఫోన్ అనుకోకుండా నీటిలో, దుమ్ములో పడిన కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంతేకాక, MIL-STD 810H మిలిటరీ గ్రేడ్ డ్యురబిలిటీ కూడా పొందింది. సౌండ్ క్వాలిటీ కోసం స్టెరియో స్పీకర్లు అమర్చారు. సినిమాలు చూడాలనుకున్న, మంచి మంచి పాటలు వినాలనుకున్న క్వాలిటీ సౌండ్ అందిస్తుంది.
ఒక మిడ్‌రేంజ్ ధరలో అత్యాధునిక ఫీచర్లు కోరుకునే వారికి మోటో G86 పవర్ ఫోన్ బెస్ట్ ఆప్షన్ గా నిలవనుంది. పవర్ ఫుల్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ, ఆకర్షణీయమైన డిస్‌ప్లే, మరియు మంచి కెమెరా సామర్థ్యాలతో ఈ ఫోన్ మోటరోలా నుంచి మార్కెట్‌లోకి రానున్న మరో ప్రీమియం ఫీచర్ ఆఫరింగ్‌గా చెప్పవచ్చు. మిడిల్ క్లాస్ బడ్జెట్లో ఫోన్ కొనాలి అనుకునేవారు ఈ ఫోన్ ఆప్షన్గా తీసుకోవచ్చు. ఈ ఫోన్ ధర కోసం, ఇతర ఫీచర్స్ కోసం మోటోరోలా అఫీషియల్ వెబ్సైట్ను సందర్శించాల్సి ఉంటుంది.
ప్రకటన
ప్రకటన