Photo Credit: Motorola
మోటరోలా ఎడ్జ్ 60s గ్లేసియర్ మింట్, మిస్టీ ఐరిస్ మరియు పోలార్ రోజ్ (అనువాదం) షేడ్స్‌లో వస్తాయి
మే 8న Motorola నుంచి మరో కొత్త మోడల్ చైనా మార్కెట్‌కు పరిచయం కానుంది. ఈ హ్యాండ్‌సెట్ Motorola ఎడ్జ్ 60s గా కంపెనీ ప్రకటించింది. దీని కలర్ ఆప్షన్‌లతోపాటు డిజైన్‌ను కూడా వెల్లడించింది. కొన్ని రోజుల క్రితం పరిమిత మార్కెట్‌లలో పరిచమైన Motorola ఎడ్జ్ 60, Motorola రజర్ సిరీస్‌తోపాటు ఇది మార్కెట్‌లోకి రానుంది. తాజాగా కంపెనీ రాబోయే మోడల్‌కు సంబంధించిన ర్యామ్, స్టోరేజీ కాన్ఫిగరేషన్‌లతోపాటు కీలకమైన బిల్డ్ వివరాలను కూడా బహిర్గతం చేసింది. ఈ కొత్త మోడల్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.మే 8వ తేదీన చైనాలో,వీబో పోస్ట్ ద్వారా కొత్త Motorola ఎడ్జ్ 60s మే 8న 12జీబీ+ 256జీబీ, 12జీబీ+ 512జీబీ స్టోరేజీ కాన్షిగరేషన్‌లలో చైనాలో విడుదల కానున్నట్లు కంపెనీ అధికారికంగా తెలిపింది. అలాగే, పోలార్ రోజ్, మిస్టీ ఐరిస్, గ్లేసియర్ మింట్ కలర్ ఆప్షన్‌లలో లభించనుంది. అంతే కాదు, ఈ కంపెనీ నుంచి వచ్చిన ఇతర మోడల్స్ మాదిరిగానే దీనికి ఏఐ ఫీచర్స్‌ను అందించే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
రాబోయే Motorola ఎడ్జ్ 60s డిజైన్ ఇప్పటికే పరిచయమైన ఎడ్జ్ 60, ఎడ్జ్ 60 ప్రో మోడల్స్‌ను పోలి ఉన్నట్లు కనిపిస్తోంది. దీని వెనుక ప్యానల్‌ను పరిశీలిస్తే, రెక్టాంగ్లర్ కెమెరా మాడ్యుల్ ఉంటుంది. పూర్తి స్లిమ్‌గా కనిపిస్తోన్న దీని డిస్‌ప్లే, యూనిఫాం బెజెలస్ ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఫోన్ కిందిభాగంలో సిమ్ కార్డ్ స్లాట్‌తోపాటు యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్, మైక్, స్పీకర్ గ్రిల్స్‌ను ఉందించేలా డిజైన్ చేశారు. కుడివైపు అంచున పవర్ బటన్, వ్యాల్యూమ్ రాకర్‌ను అందించారు.
రజర్ 60, రజర్ 60 అల్ట్రా హ్యాండ్‌సెల్‌లు కూడా ఎడ్జ్ సిరీస్ విడుదల తేదీ రోజునే లాంఛ్ కానున్నాయి. 6.7 అంగుళాల డిస్‌ప్లే 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో ఎజ్డ్ 60s మార్కెట్‌లోకి రానుంది. అంతే కాదు, ఇది దుమ్ము, నీటి నియత్రణకు ఐపీ68+ ఐపీ69 రేటింగ్‌తో వస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. కొత్త Motorola ఎడ్జ్ 60s వేరియంట్ కూడా ఎడ్జ్, ఎడ్జ్ 60 ప్రో లతోపాటే అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని కూడా కంపెనీ అధికారింగా వెల్లడించింది.
ఈ ఫోన్ ఓఐఎస్ సపోర్ట్‌తో 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్‌వైటీ 700సీ ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాను అందించే అవకాశాలు ఉన్నాయి. అలాగే, సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండొచ్చని అంచనా. మీడియాటెక్ Dimensity 7400 ప్రాసెసర్ ద్వారా శక్తిని గ్రహిస్తుంది. ఇది 68 W వైర్డ్, 15 W వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5500 mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీతో రావొచ్చని, ఈ స్మార్ట్ ఫోన్ 8.2 ఎంఎం పరిమాణంతో 190 గ్రాముల బరువును కలిగి ఉండే అవకాశం ఉంది.
ప్రకటన
ప్రకటన