Motorola Edge 60 మోడ‌ల్‌ భార‌త్‌లో లాంఛ్‌.. ధ‌ర ఎంతంటే

Motorola Edge 60 మోడ‌ల్ తోపాటు Edge 60 ఫ్యూజ‌ర్ స్మార్ట్ ఫోన్ మైకోనోస్ బ్లూ వేరియంట్‌ను కూడా కంపెనీ ఇండియ‌న్ మార్కెట్‌లోకి తీసుకువ‌చ్చింది.

Motorola Edge 60 మోడ‌ల్‌ భార‌త్‌లో లాంఛ్‌.. ధ‌ర ఎంతంటే

Photo Credit: Motorola

మోటరోలా ఎడ్జ్ 60 పాంటోన్ జిబ్రాల్టర్ సీ మరియు పాంటోన్ షామ్రాక్ షేడ్స్‌లో వస్తుంది

ముఖ్యాంశాలు
  • Motorola Edge 60 మోడ‌ల్ 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా యూనిట్‌తో వ‌స్తుం
  • Edge 60 ఫ్యూజ‌ర్ ఫోన్ మైకోనోస్ బ్లూ వేరియంట్‌ను ప‌రిచ‌యం చేసిన కంపెనీ
  • Edge 60కి 8W ట‌ర్బో ప‌వ‌ర్ ఛార్జింగ్ స‌పోర్ట్‌తో 5,500mAh బ్యాట‌రీని అంది
ప్రకటన

ఇండియాలో Motorola Edge 60 మోడ‌ల్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. గ‌త నెలలో ఎంపిక చేసిన గ్లోబ‌ల్ మార్కెట్‌ల‌లో ఈ మోడ‌ల్‌తోపాటు Edge 60 ప్రో ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా, ఈ బేసిక్ మోడ‌ల్ భార‌తీయ మార్కెట్‌లోకి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెస‌ర్‌తోపాటు 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా యూనిట్‌, 1.5కె pOLED క్వాడ్ క‌ర్వ్‌డ్ డిస్‌ప్లే, 5500mAh సామ‌ర్థ్యం క‌లిగిన బ్యాట‌రీతో అందుబాటులోకి వ‌చ్చింది. దీంతోపాటు Edge 60 ఫ్యూజ‌ర్ స్మార్ట్ ఫోన్ మైకోనోస్ బ్లూ వేరియంట్‌ను కూడా తీసుకువ‌చ్చింది.జూన్ 17 నుంచి అమ్మ‌కాలు,కంపెనీ దేశీయ మార్కెట్‌లో Motorola Edge 60 ధ‌ర‌ను పత్రికా ప్ర‌క‌ట‌న ద్వారా వెల్ల‌డించింది. ఇది రూ. 25,999 ధ‌ర‌తో జూన్ 17 నుంచి Motorola ఇండియా ఈ- స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌, రిలియ‌న్స్ డిజిట‌ల్‌తోపాటు ప‌లు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌ల‌లో అందుబాటులోకి రానుంది. లాంఛ్ ఆఫ‌ర్‌లో భాగంగా కొనుగోలుదారులు Edge 60 మోడ‌ల్‌ను రూ. 24,999ల‌కు సొంతం చేసుకోవ‌చ్చు. ఇది పాంటోస్ జిబ్రాల్డ‌ర్ సీ, పాంటోన్ షామ్‌రాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో ల‌భించ‌నుంది.

గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్ష‌న్‌

Motorola Edge 60 స్పెసిఫికేష‌న్స్ విష‌యానికి వ‌స్తే, ఇది 6.67 అంగుళాల pOLED డిస్‌ప్లేతో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌, 300 హెచ్‌జెడ్ ట‌చ్ శాంప్లింగ్ రేట్‌తో వ‌స్తోంది. వాట‌ర్ ట‌చ్ టెక్నాల‌జీ, యాంటీ ఫింగ‌ర్ ఫ్రింట్ కోటింగ్ క‌లిగిన గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్ష‌న్‌ను క‌లిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత హ‌లో యూఐతో రావ‌డంతోపాటు నాలుగేళ్ల‌ సెక్యూరిటీ అప్‌డేట్‌ల‌తోపాటు మూడేళ్ల మేజ‌ర్ ఓఎస్ అప్‌గ్రేడ్‌ల‌ను క‌లిగి ఉంటుంద‌ని కంపెనీ తెలిపింది.

50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

కెమెరా విభాగాన్ని చూస్తే.. Edge 60 స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. దీనిలో f/1.8 అపెర్చ‌ర్‌, ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్‌వైటీఐఏ 700సీ ప్రైమ‌రీ సెన్సార్ ఉంటుంది. మాక్రో కెపాసిటీస్‌, f/2.0 అపెర్చ‌ర్‌తో కూడిన ఆల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ అటాచ్ చేయ‌బ‌డిన 50 మెగాపిక్సెల్ సెన్సార్‌, 3x ఆప్టిక‌ల్ జూమ్‌, f/2.0 అపెర్చ‌ర్‌తో 10 మెగాపిక్సెల్ టెలిపోటో షూట‌ర్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో దీనిని రూపొందించారు.

ఐపీ68+ ఐపీ69 రేటింగ్

Motorola Edge 60 ఫోన్‌కు ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. ఇది 68W ట‌ర్బో ప‌వ‌ర్ ఛార్జింగ్ స‌పోర్ట్‌తో 5,500mAh బ్యాట‌రీని క‌లిగి ఉంది. ఇందులో AI ఆధారిత productivity, ఇమేజింగ్ టూల్స్ వంటి ఫీచ‌ర్స్ ఉన్నాయి. దుమ్ము, నీటి నియంత్ర‌ణ‌కు ఐపీ68+ ఐపీ69 రేటింగ్ క‌లిగి ఉంటుంది. 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4,Wi-Fi, జీపీఎస్‌, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ వంటి క‌నెక్టివిటీ ఆప్ష‌న్‌లు ఉన్నాయి. 161.2 ×73.08 ×8.25ఎంఎం ప‌రిమాణంతో 181 గ్రాముల బ‌రువుతో వ‌స్తుంది.

Comments
Facebookలో షేర్‌ Gadgets360 Twitter Shareట్వీట్ షేర్ Snapchat రెడ్డిట్ వ్యాఖ్యానించండి

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. అత్యంత స‌న్న‌ని డిజైన్‌తో జూన్ 20 మ‌న దేశీయ మార్కెట్‌లోకి Vivo Y400 Pro 5G
  2. ఆక‌ట్టుకునే ఏఐ ఇమేజింగ్ ఫీచ‌ర్స్‌తో.. త‌క్కువ ధ‌ర‌కే Realme Narzo 80 Lite 5G
  3. భార‌త్‌లోనే Nothing Phone 3 త‌యారీ.. బ‌హిర్గ‌త‌మైన డిజైన్ ఎలా ఉందంటే
  4. ఇండియాలో విడుద‌ల‌కు ముందే Oppo K13x 5G కి చెందిన కీల‌క వివ‌రాలు బ‌హిర్గ‌తం
  5. Huawei నుంచి ఒకేసారి నాలుగు మోడ‌ల్స్‌.. ధ‌ర‌తోపాటు స్పెసిఫికేష‌న్స్ ఇవే
  6. Oppo K13x 5G డిజైన్‌తోపాటు క‌ల‌ర్ ఆప్ష‌న్ ఇవే.. పూర్తి వివ‌రాలు మీకోసం
  7. Realme GT 7, GT 7T ఫోన్‌ల‌పై డిస్కౌంట్.. త్వ‌ర‌ప‌డండి, ఈ ఆఫ‌ర్ జూన్ 14 వ‌ర‌కే
  8. Motorola Edge 60 మోడ‌ల్‌ భార‌త్‌లో లాంఛ్‌.. ధ‌ర ఎంతంటే
  9. ఒప్పో K13X 5G ప్రైస్ ఏ రేంజ్ లో ఉంటుందంటే... బెస్ట్ బడ్జెట్ ఫోన్ అనే చెప్పవచ్చు
  10. అదిరిపోయే ఫీచర్స్ తో వస్తున్న వివో X ఫోల్డ్ 5...ప్రైస్ ఎంతో తెలుసా
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »