Photo Credit: Motorola
మోటరోలా ఎడ్జ్ 60 ప్రో 1.5K రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది
మోటరోలా ఎడ్జ్ 60 ప్రో, భారత్‌లో బుధవారం విడుదలైంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్‌ను వాడారు. 12GB RAM, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. ఇది 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరాతో వస్తోంది. ఇది 6.7 అంగుళాల 1.5K pOLED ప్యానల్, 120Hz రీఫ్రెష్ రేటు కలిగిన డిస్‌ప్లేతో వచ్చింది. 6,000mAh బ్యాటరీతో వైర్డ్, వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.మోటరోలా ఎడ్జ్ 60 ప్రో ధర?మోటరోలా ఎడ్జ్ 60 ప్రో.. రెండు వేరియంట్లలో లభిస్తోంది. బెస్ మోడల్ (8GB ర్యామ్, 256GB స్టోరేజ్) ధర రూ.29,999 కాగా, 12GB ర్యామ్+ 256GB వేరియంట్ ధర రూ. 33,999గా ఉంది. ఇది పాంటోన్ డాజ్లింగ్ బ్లూ, పాంటోన్ స్పార్క్లింగ్ గ్రేప్, పాంటోన్ షాడో రంగుల్లో లభిస్తుంది. దీనిని మోటరోలా ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఫ్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. మే 7 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మకానికి రానుంది.
మోటరోలా ఎడ్జ్ 60 ప్రో.. ఆండ్రాయిడ్ 15 హలో UIపై నడుస్తుంది. ఇది 12GB వరకు RAM, 512GB వరకు UFS 4.0 స్టోరేజీతో వచ్చింది. మూడేళ్లపాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగేళ్ల వరకు సెక్యురిటీ అప్‌డేట్స్ ఇస్తామని మోటరోలా హామీ ఇచ్చింది. దీని డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణ కలిగి ఉంది. ఇది 6.7 అంగుళాల క్వాడ్ కర్వ్ pOLED స్క్రీన్‌నూ, 1.5K రిజల్యూషన్‌తో 120Hz వరకు రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. 446ppi పిక్సెల్ డెన్సిటీ, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఆకర్షిస్తోంది.
మోటరోలా ఎడ్జ్ 60 ప్రోలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. వెనకవైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫొటోలెన్స్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలను అమర్చారు.
50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా(f/1.8 అపర్చర్) సోనీ LYTIA 700C సెన్సార్, ఆఫ్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్(OIS)ను సపోర్ట్ చేస్తుంది. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 3X ఆప్టిక్ జూమ్ కలిగిన 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా( f/2.0 అపర్చర్)తో ఉంది. ముందువైపు 50 మెగాపిక్సెల్ (f/2.0 అపర్చర్) సెల్ఫీ కెమెరా ఉంటుంది.
మోటరోలా ఎడ్జ్ 60 ప్రో.. 5G, 4G LTE, వై-ఫై 6E, బ్లూటూత్ 5.4, GPS, గ్లోనాస్, గెలీలియో, USB టైప్-సీ ఫోర్ట్ కలిగి ఉంది. ఇక దుమ్ము- వాటర్ రెసిస్టెన్సీ కోసం ఐపీ68+ ఐపీ69 రేటింగ్ ఉంది. మన్నిక పరంగా మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ పొందటం విశేషం.
ఇది రెండు స్టీరియో స్పీకర్స్‌తో డాల్బీ అట్మోస్ సపోర్ట్ చేస్తుంది. తద్వారా ఆడియో నాణ్యత బాగుంటుంది. సెక్యురిటీ పరంగా ఇన్- డిస్‌ప్లే ఫింగర్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ అమర్చారు.
ఇక సెన్సార్ల పరంగా.. యాక్సిలెరోమీటర్, ఈ-కంపాస్, గైరోస్కోప్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ, SAR సెన్సార్ ఉన్నాయి.
మోటరోలా ఎడ్జ్ 60 ప్రో, 6000 mAh బ్యాటరీతో రానుంది. 90W టర్బో ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయడంతో పాటు, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కూ, 5W రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మోటరోలా ఎడ్జ్ 60 ప్రో కేవలం 186g బరువు ఉండి తేలికగా ఉంటుంది.
ప్రకటన
ప్రకటన