లగ్జరీ లుక్‌లో అదిరిపోయే ప్లిఫ్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్, ఇయర్ బడ్స్‌ని పరిచయం చేసిన మోటరోలా కంపెనీ. ఆగస్టు 7వ తేదీ నుంచి మోటరోలా రేజర్ 60, మోటో ఇయర్ బడ్స్ Motorola.comలో అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్ ఇది 3D క్విల్టెడ్ నమూనాను కలిగి, చుట్టూ లెదర్‌తో ఫినిషింగ్ లుక్‌లో ఉంటుంది.
Photo Credit: Motorola
మోటరోలా బడ్స్ లూప్ గతంలో స్వరోవ్స్కీ స్ఫటికాలతో ఫ్రెంచ్ ఓక్ ముగింపులో వచ్చింది
మెరిసే రాళ్లతో లగ్జరీ లుక్‌లో అదిరిపోయే స్మార్ట్ ఫోన్‌ని మోటరోలా కంపెనీ పరిచయం చేసింది. ఈ ఫోన్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో పాటు చాలా స్టైలిష్‌గా, ప్రీమియం లుక్‌లో కనిపిస్తుంది. ఇయర్ బడ్స్‌తో పాటు ఈ ఫ్లిప్ స్టైల్ ఫోల్డబుల్ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ లిమిటెడ్ వెర్షన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ అందించాం. కొత్త బ్రిలియంట్ కలెక్షన్‌లో భాగంగా జ్యూయలరీ బ్రాండ్ స్వరోవ్స్కీ భాగస్వామ్యంతో మోటో బడ్స్ లూప్ ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్‌లతో పాటుగా మోటరోలా రేజర్ 60 ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ అందుబాటులో ఉంది. అంతేకాదు ఈ మోటరోలా రేజర్ 60 ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్, ఇయర్ బడ్స్ కూడా సరికొత్తగా రూపొందించబడ్డాయి. ఈ రెండు డివైజ్‌లు కూడా Swarovski క్రిస్టల్స్‌తో అందంగా పాంటోన్ ఐస్ మెల్ట్ కలర్‌వేలో ఆవిష్కరించబడ్డాయి. వీటిని కొనుగోలు చేసిన కస్టమర్లు ఫ్లిప్ ఫోన్‌ను తీసుకెళ్లడానికి క్రాస్‌బాడీ బ్యాగ్‌ను కూడా పొందనున్నారు. మోటరోలా రేజర్ 60 ఈ సంవత్సరం ప్రారంభంలో భారతదేశంలో మీడియాటెక్ డైమెన్సిటీ 7400X SoCతో హుడ్ కింద విడుదలైంది.
మోటరోలా స్వరోవ్స్కీ సహకారంతో ది బ్రిలియంట్ కలెక్షన్ బండిల్‌ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ ప్యాకేజీలో పాంటోన్ ఐస్ మెల్ట్ కలర్‌వేలో మోటరోలా రేజర్ 60, మోటో బడ్స్ లూప్ అనే ప్రత్యేక ఎడిషన్ ఉన్నాయి. వీటి ధర అమెరికాలో అయితే 999 డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పుకుంటే సుమారు రూ.87,000లు. ఇందులో స్పెషల్ ఎడిషన్ Razr 60, స్వరోవ్స్కీ-స్టడెడ్ మోటో బడ్స్ లూప్ ఇయర్‌బడ్‌లు రెండూ ఉన్నాయి. ఇవి ఆగస్టు 7వ తేదీ నుంచి Motorola.comలో అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా చాలా మార్కెట్లలో అందుబాటులో ఉంటాయని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. అయితే భారతదేశంతో సహా ఇతర ప్రాంతాలకు వీటి ధర, ఇతర సమాచారాన్ని ఇంకా వెల్లడించ లేదు.
కానీ వీటి ధర విడివిడిగా చూసుకుంటే మోటరోలా రేజర్ 60 సాధారణ 8GB + 256GB RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర రూ. 49,999లు. పాంటోన్ ఫ్రెంచ్ ఓక్ కలర్ వే మోటో బడ్స్ లూప్ ప్రారంభ ధర $299 మన కరెన్సీలో సుమారు రూ. 26,000లు.
మోటరోలా రేజర్ 60 స్మార్ట్ ఫోన్ ఈ ఏడాది ప్రారంభంలో లాంఛ్ అయింది. ఇది 3D క్విల్టెడ్ నమూనాను కలిగి, చుట్టూ లెదర్‌తో ఫినిషింగ్ లుక్‌లో ఉంటుంది. ఈ లెదర్ ఫినిషింగ్‌లో 35 Swarovski క్రిస్టల్స్, 26-facet క్రిస్టల్స్ చేతితో అమర్చి అందంగా అలంకరించబడింది. వాల్యూమ్ బటన్లు కూడా క్రిస్టల్-ప్రేరేపిత రూపాన్ని కలిగి ఉంటాయి.ఇంత అందంగా ఉండే మోటరోలా ఫ్లిప్ ఫోన్‌ను తీసుకెళ్లడానికి వినియోగదారులకు మ్యాచింగ్ క్రాస్‌బాడీ బ్యాగ్‌ను కూడా కంపెనీ అందిస్తుంది.
ఇదేవిధంగా కంపెనీ బోస్-ట్యూన్ చేయబడిన మోటో బడ్స్ లూప్ వైర్‌లెస్ ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్‌లు కూడా స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌ని కలిగి ఉంటాయి. ఈ ఇయర్‌బడ్‌లు జ్యూయలరీలా ధరించేలా రూపొందించబడ్డాయి. గతంలో మోటరోలా ఏప్రిల్‌లో ఫ్రెంచ్ ఓక్ ముగింపులో వాటిని విడుదల చేసింది, ఇందులో ఎంబెడెడ్ స్వరోవ్స్కీ క్రిస్టల్స్ కూడా ఉన్నాయి.
కాగా స్పెషల్ ఎడిషన్ Razr 60 క్లామ్‌షెల్ ఫోల్డబుల్ స్టాండర్డ్ Motorola Razr 60 మాదిరిగానే స్పెసిఫికేషన్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇది 6.9-అంగుళాల డిస్‌ప్లే, 3.6-అంగుళాల కవర్ డిస్‌ప్లే, MediaTek Dimensity 7400X SoCని కలిగి ఉండే ఛాన్స్ ఉంది. ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాతో సహా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. స్టాండర్డ్ మోడల్ 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 4,500mAh బ్యాాటరీని కలిగి ఉంది.
ప్రకటన
ప్రకటన