మూడు డిఫరెంట్ కలర్స్ లో రానున్న మోటరోలా రేజర్ 60 మొబైల్

మోటరోలా రేజర్ 60 మొబైల్ గ్లోబల్ మార్కెట్లో గత నెలలో విడుదలైంది. ఇండియాలో ఫ్లిప్ కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 7400X SoC ప్రాసెసర్ తో, IP48 రేటెడ్ బిల్డ్ ప్రొటెక్షన్ తో, వైర్లెస్ ఛార్జింగ్ కూడిన 4800mAh బ్యాటరీ బ్యాకప్ తో వస్తోంది.

మూడు డిఫరెంట్ కలర్స్ లో రానున్న మోటరోలా రేజర్ 60 మొబైల్

Photo Credit: Motorola

మోటరోలా రేజర్ 60 హుడ్ కింద మీడియాటెక్ డైమెన్సిటీ 7400X చిప్‌సెట్‌ను కలిగి ఉంది

ముఖ్యాంశాలు
  • డ్యూయల్ అవుట్ వార్డ్ ఫేసింగ్ కెమెరా యూనిట్ తో రానున్న రేజర్ 60
  • 4500mAh బ్యాటరీ బ్యాకప్ – దీర్ఘకాలిక పనితీరు కోసం శక్తివంతమైన బ్యాటరీ
  • మూడు డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ – మీ స్టైల్‌కు తగ్గట్టు ఎంచుకోండి
ప్రకటన

ప్రముఖ మొబైల్ బ్రాండ్ కంపెనీ మోటోరోలా కొత్త కొత్త బ్రాండ్ ఫోన్లను లాంచ్ చేస్తూ ఉంటుంది. లో కాస్ట్ మొబైల్ తో పాటు హై కాస్ట్ మొబైల్ కూడా మోటరోలా బ్రాండ్ నుండి వస్తూ ఉంటాయి. తాజాగా మోటరోలా ఇండియాలో తన కొత్త మొబైల్ ఫోన్ రేజర్ 60 లాంచింగ్ డేట్ ను ప్రకటించింది. కలర్ వేరియంట్స్ తో పాటు, ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్స్ కూడా రివీల్ చేసింది. మోటరోలా రేజర్ 60 గ్లోబల్ మార్కెట్లో గత నెల విడుదలైంది. ఇండియాలో ఫ్లిప్ కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 7400X SoC ప్రాసెసర్ తో, IP48 రేటెడ్ బిల్డ్ ప్రొటెక్షన్ తో, వైర్లెస్ ఛార్జింగ్తో కూడిన 4800mAh బ్యాటరీ బ్యాకప్ తో వస్తోంది.

లాంచింగ్ ఎప్పుడంటే:


మే 28 మధ్యాహ్నం 12 గంటలకు మోటరోలా రేజర్ 60 లాంచింగ్ జరగనున్నట్లు మోటరోలా కంపెనీ కన్ఫామ్ చేసింది. ఇండియాలో లాంచింగ్ కి ముందు క్లామ్‌ షెల్ డిజైన్‌ తో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్లు ఫ్లిప్ కార్ట్ అలాగే మోటోరోలా అధికారిక వెబ్సైట్లో ఉంచింది. ఈ రేజర్ 60 మోడల్ ప్యాంటోన్ జిబ్రాల్టార్ సీ, స్ప్రింగ్ బడ్, లైటెస్ట్ స్కై కలర్స్ లో దొరుకుతుంది.
ఇందులో 8GB+ 256 GB సింగిల్ స్టోరేజ్ ఆప్షన్ మాత్రమే ఉంది.
మోటోరోలా 60 గ్లోబల్ వేరియంట్ లో వీటికి అదనంగా పర్ఫైట్ పింక్ కలర్ కూడా ఉంది. ఇది 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ తో వస్తోంది.

రేజర్ 60 స్పెసిఫికేషన్స్:


ఈ మోటోరోలా రేజర్ 60 ANDROID 15 ఆపరేటింగ్ సిస్టంతో వస్తుంది. దీనికి మూడు మేజర్ OS అప్డేట్స్ తో పాటు, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఫోన్లో 6.69 ఇంచ్ ఫుల్ HD+ (1080*2640 పిక్సెల్స్) pOLED LTPO మెయిన్ డిస్ప్లే వస్తుంది. దీంతోపాటు 3.63 ఇంచ్ (1,056 x 1,066 పిక్సెల్స్) pOLED కవర్ డిస్ప్లే కూడా రానుంది. అలాగే ఔటర్ స్క్రీన్ కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ కోటింగ్ ఉంటుంది.

ఇక ఈ మొబైల్లో డ్యూయల్ అవుట్ వార్డ్ ఫేసింగ్ కెమెరా యూనిట్ ఉంటుంది. ఇందులో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 32 మెగా పిక్సెల్ సెల్ఫీ షూటర్ కెమెరాలు వస్తున్నాయి. IP 48 రేటెడ్ బిల్ట్ ప్రొటెక్షన్, 15W వైర్లెస్ ఛార్జింగ్, 30W వైరుడ్ సపోర్ట్ తో 4800mAh బ్యాటరీ బ్యాక్అప్ కూడా ఈ మొబైల్ కి మోటోరోలా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఫోను లాంగ్ టైం యూసేజ్ కి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇండియాలో ఈ మోడల్ ప్రైస్ ఇప్పటికి రివిల్ అవ్వలేదు. US లో దీని రేటు సుమారు 60 వేలు ఉంది. ఇండియా మార్కెట్ లో కూడా దాదాపు ఇదే రేంజ్ లో ఉండే అవకాశం ఉందని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. ఈ ఫోన్ లాంచింగ్ కోసం మోటారోలా అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Samsung సాధారణంగా తన ఫ్లాగ్‌షిప్ ఫోన్లను జనవరి లేదా ఫిబ్రవరిలో విడుదల చేస్తుంది
  2. Realme ఇప్పటికే వియత్నాం మార్కెట్‌లో ఈ ఫోన్‌ను అధికారికంగా టీజ్ చేసింది
  3. Oppo ఐదు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, ఆరు సంవత్సరాల భద్రతా అప్‌డేట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది
  4. మార్కెట్లోకి రానున్న ఐకూ నియో 11.. 7,500mAh బ్యాటరీతో రానున్న మోడల్
  5. 7,500mAh బ్యాటరీ సపోర్ట్‌తో రానున్న రెడ్ మీ టర్బో 5.. స్పెషాలిటీ ఏంటంటే?
  6. కళ్లు చెదిరే ఫీచర్స్‌తో వన్ ప్లస్ ఏస్ 6.. సరసమైన ధరకే అదిరే ఫోన్
  7. గత ఇది iPhone Air మరియు Galaxy S25 Edge లకు పోటీగా నిలవనుంది.
  8. గత వారం వచ్చిన మరో రిపోర్ట్ కూడా ఇదే విషయాలను నిర్ధారించింది.
  9. టెలిఫోటో ఎక్స్ ట్రా కిట్‌తో రానున్న వివో ఎక్స్300 సిరీస్.. ఇక ఫోటోలు ఇష్టపడేవారికి పండుగే
  10. దీని పరిమాణం 161.42 x 76.67 x 8.10mm, బరువు సుమారు 211 గ్రాములు.
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »