Photo Credit: Nothing
మార్చి 4న జరిగే లాంచ్ ఈవెంట్‌లో రెండు హ్యాండ్‌సెట్‌లను Nothing కంపెనీ పరిచయం చేయనున్నట్లు ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. ఈ బ్రిటిష్ స్మార్ట్ ఫోన్ తయారీదారు ఫోన్ 2aకి కొనుసాగింపుగా Nothing ఫోన్ 3aను డెవలప్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ మోడల్‌తోపాటు ప్రో అనే మరో మోడల్‌ను కూడా తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది Nothing కంపెనీ నుంచి వస్తోన్న మొదటి ఫోన్‌గా చెప్పొచ్చు. ఈ ఏడాది చివర్లో తన ఫ్లాగ్‌షిప్ ఫోన్ 3ని పరిచయం చేయడానికి ముందు మూడు స్మార్ట్ ఫోన్‌లను Nothing లాంచ్ చేసే యోచనలో ఉన్నట్లు గతంలోనే బహిర్గతమైంది.
ఆండ్రాయిడ్ హెడ్‌లైన్స్ నివేదిక ప్రకారం.. మార్చి 4న జరిగే కంపెనీ ప్రొడక్ట్ ప్రదర్శనలో Nothing ఫోన్ 3a, ఫోన్ 3a ప్రో లాంచ్ చేసే అవకాశం ఉంది. గతంలో వచ్చిన లీక్‌లు ఫోన్ 3aతో పాటు ప్లస్ వేరియంట్ రావచ్చని సూచించాయి. అయితే, ఈ తాజా క్లెయిమ్ దాని స్థానంలో ప్రో మోడల్‌ను పరిచయం చేయనున్నట్లు సూచిస్తోంది. లాంచ్ తర్వాత, Nothing ఫోన్ 3a మొత్తం 8GB+128GB, 12GB+256GB రెండు కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే, ఇది నలుపు, తెలుపు రంగులలో లభించవచ్చు. ఫోన్ 3a ప్రో మాత్రం ఒక్క 12GB+256GB వేరియంలో ఒకే బూడిద రంగు ఆప్షన్‌లో అందుబాటులోకి రావచ్చు.
త్వరలో రాబోయే Nothing లాంచ్ ఈవెంట్ పవర్ ఇన్ పెర్స్పెక్టివ్ అనే ట్యాగ్‌లైన్‌తో ఉంది. ఫోన్ వెనుక భాగంలో నిలువుగా పేర్చబడిన రెండు కెమెరా రింగుల చుట్టూ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ ఉందని టీజ్ చేయబడింది. దీని స్పెసిఫికేషన్‌లు పూర్తిగా తెలియకపోయినప్పటికీ, లాంచ్ ఈవెంట్‌కు ముందు కంపెనీ మరిన్ని టీజర్‌లను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
మునుపటి నివేదికల ప్రకారం చూస్తే.. Nothing ఫోన్ 3a మోడల్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల ఫుల్-HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అలాగే, ఇది అండర్ ది హుడ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్‌తో అమర్చబడి ఉంటుందని, 12GB వరకు RAM, 256GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీతో అటాచ్ చేయబడిందని వెల్లడైంది. ఈ ఫోన్ మోడల్ A059 నెంబర్‌ను కలిగి ఉన్నట్లు నివేదించబడింది.
ఈ మోడల్ ఫోన్ కెమెరా విషయానికి వస్తే.. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉండవచ్చు. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2x ఆప్టికల్ జూమ్‌తో 50-మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్-యాంగిల్ సెన్సార్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఈ హ్యాండ్‌సెట్ కలిగి ఉండొచ్చు. Nothing ఫోన్ 3a దాని గత మోడల్స్ మాదిరిగానే 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని పొందే అవకాశం ఉంది. ఇది NFC కనెక్టివిటీని కూడా అందించవచ్చు.
ప్రకటన
ప్రకటన